
సాక్షి, న్యూఢిల్లీ: ఈ కామర్స్ దిగ్గజం మరోసారి డిస్కౌంట్ అమ్మకాలకు తెరతీసింది. హోలీ పండుగ సందర్భంగా ది గ్రేట్ అమెజాన్ హోలీ సేల్ 2019 పేరుతో ఆకర్షణీయమైన ఆఫర్లను అందిస్తోంది.
శాంసంగ్ గెలాక్సీ ఎం20, రియల్ మి యూ, హావావే వై 9, వివో 5ప్రొ స్మార్ట్‌ఫోన్లను తగ్గింపు ధరల్లో వినియోగదారులకు అందుబాటులో ఉంచింది. దీంతోపాటు అమెజాన్ పే, ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులపై రూ.3వేలు దాటిన కొనుగోళ్లపై నోకాస్ట్ ఈఇంఐ, యాక్సిస్ బ్యాంకు క్రెడిట్,కార్డుపై 5 శాతం తక్షణ డిస్కౌంట్‌ను ఆపర్ చేస్తోంది. అలాగే డెబిట్ కార్డు కొనుగోళ్లపై నో ఈఎంఐ, 5,400 రూపాయల విలువైన తక్షణ క్యాష్ బ్యాకు, 3టీబీ జియో డాటా ను అందివ్వనుంది.
దీంతోపాటు హోలి స్టోర్ పేరుతో ప్రకటించిన సేల్‌లో గృహోపకరణాలపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. గాడ్జెట్లను కూడా అత్యంత తక్కువ ధరలకే అందిస్తోంది. మార్చి 9న మొదలైన ఈ సేల్ 21వ తేదీ వరకు కొనసాగనుంది.
Comments
Please login to add a commentAdd a comment