
సాక్షి, హైదరాబాద్ : హోలీ పండగ మార్చి ఒకటో తేదీనే జరుపుకోవాలని దేవాదాయ శాఖ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం రెండో తేదీన, రాష్ట్రం ఒకటో తేదీన హోలీ సెలవులుగా ఇప్పటికే ప్రకటించాయి. కానీ రెండు తేదీలు భిన్నంగా ఉండటంతో ఉద్యోగుల్లో అయోమయం నెలకొంది. దీంతో సెలవు విషయంలో స్పష్టత ఇవ్వాలని సాధారణ పరిపాలన విభాగం దేవాదాయ శాఖను కోరింది. ఇప్పటికే పండితులతో చర్చించి ఒకటో తేదీనే ఖాయం చేసుకున్న దేవాదాయ శాఖ, అదే విషయాన్ని మరోసారి సాధారణ పరిపాలన విభాగానికి స్పష్టం చేసింది. పండితులతో కూడిన విద్వత్ సభతో చర్చించిన మీదటే ఒకటో తేదీని ఖరారు చేసినట్టు దేవాదాయ శాఖ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment