కోల్‌కత్తా: రెండు రోజుల క్రితం దేశవ్యాప్తంగా హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రజలంతా రంగులు చల్లుకుని సంబురాలు జరుపుకున్నారు. ఈ వేడుకల్లో కొన్ని చోట్ల ఘర్షణలు, అపశ్రుతులు చోటుచేసుకున్నాయి. వేడుకల్లో కత్తితో పొడుచుకొని ఓ వ్యక్తి మరణించగా పశ్చిమ బెంగాల్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది.
కోల్‌కత్తాలో సుజిత్ మల్లిక్, దిలీప్ అనే వ్యక్తులు మంచి స్నేహితులు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన దిలీప్ చౌహాన్ (45) కొన్ని సంవత్సరాల క్రితం కోల్‌కత్తా చేరుకుని నాటూన్‌పల్లిలోని తన బంధువులు నివాసం ఉంటున్న ఏరియాలోనే అద్దె ఇల్లు తీసుకుని వ్యాపారం చేస్తున్నాడు. సుజిత్ మల్లిక్ కూడా అక్కడే నివాసం ఉంటున్నారు. కాగా, హోలీ రోజున వీధిలో వీరంతా కలిసి సంబురాలు జరుపుకున్నారు. వేడుకల్లో దిలీప్ అతని స్నేహితుడు సుజిత్ మల్లిక్ భార్యపై రంగులు చల్లాడు.
అది గమనించిన సుజిత్.. తన భార్యపై బలవంతంగా ఎందుకు రంగులు చల్లావని దిలీప్‌ను అడిగాడు. ఈ క్రమంలో వారి మధ్య వాగ్వాదం జరిగింది. ఇంతలో తీవ్ర ఆవేశంతో సుజిత్ మల్లిక్.. దిలీప్‌ను తుపాకీతో కాల్చి చంపాడు. ఈ కాల్పుల్లో ఇద్దరు గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించారు. దీంతో అక్కడున్న వారంతా ఒక‍్కసారిగా షాకయ్యారు. అనంతరం నిందితుడు పారిపోయి డైమండ్ హార్బర్ ప్రాంతంలో ఉన్నడాని తెలుసుకున్న పోలీసులు అక్కడికి వెళ్లి మాలిక్‌ను అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నట్టు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment