
సాక్షి,బంజారాహిల్స్(హైదరాబాద్): హోలీ ఆడుకుందామని స్నేహితుడిని బయటికి పిలిచిన ముగ్గురు బాలురు తమతో పాటు తెచ్చుకున్న బ్లేడ్‌తో వీపుపైన, తొడలపైన గాయపరిచి దాడి చేసిన ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు... బంజారాహిల్స్ రోడ్ నెం. 2లోని ఎల్‌వీ ప్రసాద్ ఆస్పత్రి వెనుక ఉండే ఇందిరానగర్‌లో నివసించే శ్రీహరి తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. (చదవండి: సంతానం కలగలేదు.. భర్త మరో మహిళతో సన్నిహితంగా ఉన్నాడని.. )
శుక్రవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో శ్రీహరి తన ఇంటి ముందు హోలీ ఆడుకుంటుండగా సమీపంలో నివసించే ముగ్గురు స్నేహితులు అభి, నాని, బబ్లూ ముగ్గురూ అక్కడికొచ్చి శ్రీహరికి రంగులు పూశారు. బలవంతంగా నెత్తి మీద కోడిగుడ్లు కొట్టారు. వారి నుంచి విడిపించుకునేందుకు ప్రయత్నిస్తుండగా ముగ్గురూ కలిసి తమతోపాటు తెచ్చుకున్న బ్లేడ్‌తో శ్రీహరి వీపు మీద గాట్లు పెట్టారు. తీవ్రంగా రక్తస్రావం జరుగుతుండగా శ్రీహరి అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించగా తొడలపై గాట్లు పెట్టారు. అదే సమయంలో బాధితుడి తల్లి లక్ష్మి అక్కడికొచ్చి తీవ్రంగా గాయపడిన కొడుకును ఆస్పత్రికి తీసుకెళ్లింది. దాడికి పాల్పడ్డ ముగ్గురు బాలలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంజారాహిల్స్ పోలీసులు అభి, నాని, బబ్లూలను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment