ఈ బహుబలి కజ్జికాయ బరువెంతో తెలుసా? | Lucknow Shop Made Bahubali Gujiya | Sakshi
Sakshi News home page

ఈ బహుబలి కజ్జికాయ బరువెంతో తెలుసా?

Published Sun, Mar 28 2021 5:36 PM | Last Updated on Sun, Mar 28 2021 9:16 PM

Lucknow Shop Made Bahubali Gujiya - Sakshi

బాహుబలి కజ్జికాయతో మహిళలు

లక్నో : భారత దేశ ప్రజలు అత్యంత సంబరంగా జరుపుకునే పండుగల్లో హోలీ ఒకటి. ఉత్తర భారత దేశ ప్రజలకు ఈ పండుగ ఎంతో ప్రత్యేకమైనది. రంగులతో, పిండి వంటలతో అద్భుతంగా జరుపుకుంటారు అక్కడి ప్రజలు. ముఖ్యంగా గుజియా(కజ్జికాయ) లేనిదే హోలీ పండుగ పూర్తికాదని అంటారు. అందుకే, పండుగ పూట తమ వ్యాపారాన్ని మూడు పువ్వులు, ఆరు కాయలుగా చేసుకోవటానికి ఉత్తరప్రదేశ్‌, లక్నోలోని ఓ స్వీట్‌ షాపు వెరైటీగా కజ్జికాయను తయారు చేసింది. దానికి ‘బాహుబలి కజ్జికాయ’ అని పేరు పెట్టింది. పేరుకు తగ్గట్టుగానే దాని బరువు 1.5 కేజీలు. ఇది 35.4 సెంటీమీటర్ల పొడవు ఉంది.

ఈ కజ్జికాయ ఐడియా గురించి స్వీట్‌ షాపు మార్కెటింగ్‌ హెడ్‌ మాట్లాడుతూ.. ‘‘ కొత్తగా ఏదైనా చేయాలనే బాహుబలి కజ్జికాయను తయారు చేశాము. ఈ కజ్జికాయకు వినియోగదారులనుంచి మంచి స్పందన వస్తోంది. అయితే వీటి ధర తయారు చేయటానికి ఉపయోగించిన పదార్ధాలను బట్టి మారుతుంది’’ అని తెలిపాడు. ప్రస్తుతం ఈ బాహుబలి కజ్జికాయ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

చదవండి, చదివించండి : 2 నెలల కొడుకు కోసం చంద్రుడిపై స్థలం..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement