
సాక్షి, అమరావతి : రంగుల పండుగైన హోలీ తెలుగు వారి జీవితాలను రంగులమయంగా, సంతోషకరంగా మార్చాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆకాంక్షించారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు గురువారం ఆయన హోలీ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలకు అంతా మంచి జరగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు హోలీ శుభాకాంక్షలు తెలుపుతూ గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.