Rudrabhishekam
-
హోలీ వేళ సీఎం యోగి రుద్రాభిషేకం!
హోలీ సందర్భంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గోరఖ్‌పూర్‌లోని గోరఖ్‌నాథ్ ఆలయంలో రుద్రాభిషేకం నిర్వహించారు. సీఎం యోగి పలు సందర్భాల్లో శివుణ్ణి పూజిస్తుంటారు. తరచుగా కాశీకి వెళ్లి విశ్వనాథునికి పూజలు నిర్వహిస్తుంటారు. సీఎం యోగి తాజాగా చేసిన ఒక పోస్ట్‌లో గడచిన ఏడు సంవత్సరాలలో రాష్ట్రంలోని ప్రతి వ్యక్తి జీవితంలో సానుకూల మార్పులను తీసుకురావడంలో విజయం సాధించామన్నారు. ఈ 7 సంవత్సరాలు ‘న్యూ ఉత్తర ప్రదేశ్ ఆఫ్ న్యూ ఇండియా’ను సృష్టించేందుకు కృషి చేశామన్నారు. #WATCH | Uttar Pradesh CM Yogi Adityanath performs 'Rudra Abhishek' in Gorakhnath temple, Gorakhpur pic.twitter.com/RA4r1oJDHG — ANI UP/Uttarakhand (@ANINewsUP) March 25, 2024 ప్రజా సంక్షేమ బాటలో నడుస్తూ, రాష్ట్ర ప్రజల కలలను నెరవేర్చడానికి డబుల్ ఇంజన్ ప్రభుత్వం పూర్తి నిబద్ధతతో పనిచేస్తున్నదన్నారు. ఇందుకు రాష్ట్ర ప్రజల సహకారం లభిస్తున్నదని, అందుకు వారికి కృతజ్ఞతలు. హ్యాపీ హోలీ’ అని పేర్కొన్నారు. आदरणीय प्रधानमंत्री श्री @narendramodi जी के प्रेरणादायी मार्गदर्शन में उत्तर प्रदेश की 25 करोड़ जनता की सेवा, सुरक्षा और समृद्धि के संकल्प को आज 07 वर्ष पूरे हो रहे हैं। इन 07 वर्षों में सबका साथ-सबका विकास के मंत्र के माध्यम से हर व्यक्ति के जीवन में सकारात्मक परिवर्तन लाने… — Yogi Adityanath (मोदी का परिवार) (@myogiadityanath) March 25, 2024 -
రుద్రాభిషేకంలో వైఎస్ఆర్సీపీ నేతలు పాల్గొన్నారు
-
హన్మకొండలో మహా రుద్రాభిషేకం
-
మౌనవ్రతం చేస్తున్నారా? ఇవి తెలుసుకోండి
మహాశివరాత్రి రోజు చేసే మౌనవ్రతం చాలా అద్భుత ఫలితాలను ఇస్తుంది. మానసిక ప్రశాంతతను చేకూరుస్తుంది. మౌనం అనగానే నోరు మూసుకుని కూర్చోవడం అని భావించవద్దు. వ్రతంలో త్రికరణములు (మనోవాక్కాయాలు) ఏకం కావాలి. మనసును మౌనం ఆవరించినప్పుడు వ్రతం సంపూర్ణమవుతుంది. అందువల్ల అనవసరమైన ఆలోచనలను, వాదనలను కట్టిపెట్టి, మనసును పరమ శివునిపై కేంద్రీకరించాలి. వీలైతే శివాలయానికి వెళ్ళండి, అక్కడ రుద్రాభిషేకం చేస్తారు. రుద్రం ఒకసారి చదవటానికి అరగంట పడుతుంది. అభిషేకం చేయించుకోకపోయినా, ఉపవాసం ఉండకపోయినా ఫరవాలేదు. జాగారం చేయకపోయినా ఎవరూ అడగరు. కానీ, పరనింద, పరాన్నభోజనం, చెడుతలపుతో, అశ్లీలపుటాలోచనలతో చేసే ఉపవాస, జాగారాలకు ఫలితం లేదు. శివాలయంలో ప్రశాంతంగా కళ్ళు మూసుకుని కూర్చుని, పండితులు పఠిస్తున్న రుద్ర – నమకచమకాలను వినడం కూడా ఫలదాయకమే! మహిమాన్వితం... మంత్ర జపం మహాశివరాత్రి మొత్తం శివనామంతో, ఓం నమః శివాయ అనే పంచాక్షరీ మహామంత్ర జపం/స్మరణతో జాగరణ మీలో నిక్షిప్తమై ఉన్న అనంతమైన శక్తిని జాగృతం చేస్తుంది. శివోహం అనే భావనను కలిగిస్తుంది. ఓం నమః శివాయ!! చదవండి: ఉపవాసం రోజు ఏం చేయాలి? ఆరు రకాల ఉపవాసాలు మంచివట! -
శివనామ స్మరణలతో మార్మోగిన పున్నమి ఘాట్
సాక్షి, విజయవాడ: పున్నమి ఘాట్ శివనామ స్మరణలతో మార్మోగింది. ఢమరుక నాదాలు, వేదమంత్రాల మధ్య మహా రుద్రాభిషేకం అంగరంగ వైభవంగా ప్రారంభమయింది. మహారుద్రాభిషేకం కార్యక్రమానికి దేవాదాయ శాఖా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కుటుంబ సమేతంగా హాజరయ్యారు. ఎనిమిది అడుగుల మట్టి శివలింగాన్ని దర్శించిన భక్తులు పరవశించారు. వేలాదిగా శివ భక్తులు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వైఎస్సార్సీపీ తూర్పు ఇంచార్జి బొప్పన భవకుమార్, గన్నవరం ఇంచార్జి యార్లగడ్డ వెంకటరావు, అధికార ప్రతినిధి పైలా సోంనాయుడు తదితరులు పాల్గొన్నారు. -
వైభవంగా రుద్రాభిషేకం
కొల్లూరు: ప్రత్యేక పూజలతో ఆదివారం కొల్లూరు అనంతభేగేశ్వరాలయం భక్తులతో కిటకిటలాడింది. అనతభోగేశ్వరస్వామికి రుద్రాభిషేకం, బిళ్వార్చన నిర్వహించారు. అనంతరం పార్వతీ అమ్మవారికి విశేషాలంకారణ జరిపి లక్ష కుంకుమార్చన జరిపారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కార్యక్రమంలో వేదపండితులు జనస్వామి వెంకటప్పావధానులు, విష్ణుభట్ల శ్రీరామచంద్రసోమయాజులు, చిట్టి రాధాకృష్ణమూర్తి, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.