
మహా రుద్రాభిషేకం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్
సాక్షి, విజయవాడ: పున్నమి ఘాట్ శివనామ స్మరణలతో మార్మోగింది. ఢమరుక నాదాలు, వేదమంత్రాల మధ్య మహా రుద్రాభిషేకం అంగరంగ వైభవంగా ప్రారంభమయింది. మహారుద్రాభిషేకం కార్యక్రమానికి దేవాదాయ శాఖా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కుటుంబ సమేతంగా హాజరయ్యారు. ఎనిమిది అడుగుల మట్టి శివలింగాన్ని దర్శించిన భక్తులు పరవశించారు. వేలాదిగా శివ భక్తులు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వైఎస్సార్‌సీపీ తూర్పు ఇంచార్జి బొప్పన భవకుమార్, గన్నవరం ఇంచార్జి యార్లగడ్డ వెంకటరావు, అధికార ప్రతినిధి పైలా సోంనాయుడు తదితరులు పాల్గొన్నారు.