వైభవంగా రుద్రాభిషేకం
కొల్లూరు: ప్రత్యేక పూజలతో ఆదివారం కొల్లూరు అనంతభేగేశ్వరాలయం భక్తులతో కిటకిటలాడింది. అనతభోగేశ్వరస్వామికి రుద్రాభిషేకం, బిళ్వార్చన నిర్వహించారు. అనంతరం పార్వతీ అమ్మవారికి విశేషాలంకారణ జరిపి లక్ష కుంకుమార్చన జరిపారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కార్యక్రమంలో వేదపండితులు జనస్వామి వెంకటప్పావధానులు, విష్ణుభట్ల శ్రీరామచంద్రసోమయాజులు, చిట్టి రాధాకృష్ణమూర్తి, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.