ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కార్యరంగంలోకి దిగారు. బుధవారం కేబినెట్ సమావేశం అనంతరం పలు కీలక నిర్ణయాలు వెలువరించారు. హోం, ఆర్థికశాఖలను తానే పర్యవేక్షిస్తానని ప్రకటించారు. డిప్యూటీ సీఎంలు కేశవ్ ప్రసాద్ మౌర్య, దినేశ్ వర్మ పీడబ్ల్యూడీ, విద్యాశాఖలను కేటాయించారు.