దేశవ్యాప్తంగా గురు పూర్ణిమ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గోరఖ్‌నాథ్ ఆలయంలో పూజలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. గురు పూర్ణిమను వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు.
#WATCH | UP CM Yogi Adityanath offers prayers at Gorakhnath Temple, on the occasion of #GuruPurnima2024 pic.twitter.com/goky8Ro8eK
— ANI UP/Uttarakhand (@ANINewsUP) July 21, 2024
మహర్షి వేద వ్యాసుడు ఈ రోజున జన్మించాడు. ఆయనను గుర్తు చేసుకుంటూ ఈ ఉత్సవాన్ని జరుపుకుంటారు. హిందువులు గురు పూర్ణిమకు ఎంతో ప్రాధాన్యతనిస్తుంటారు. హిందువులు గురువును దేవునితో సమానంగా భావిస్తారు. హరిద్వార్‌లో గురు పూర్ణిమ సందర్భంగా భక్తులు పవిత్ర గంగా నదిలో స్నానాలు చేస్తున్నారు. భక్తుల రద్దీతో గంగా ఘాట్‌లు నిండిపోయాయి. యూపీలోని అయోధ్యలోగల సరయూ నదిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు.
#WATCH | Haridwar, Uttarakhand: Devotees take a holy dip in the Ganga River, on the occasion of Guru Purnima pic.twitter.com/UcVQYZQAOY
— ANI (@ANI) July 21, 2024
Comments
Please login to add a commentAdd a comment