gorakhnath temple
-
గురుపౌర్ణమి వేళ.. సీఎం యోగి పూజలు
దేశవ్యాప్తంగా గురు పూర్ణిమ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గోరఖ్‌నాథ్ ఆలయంలో పూజలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. గురు పూర్ణిమను వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు. #WATCH | UP CM Yogi Adityanath offers prayers at Gorakhnath Temple, on the occasion of #GuruPurnima2024 pic.twitter.com/goky8Ro8eK— ANI UP/Uttarakhand (@ANINewsUP) July 21, 2024 మహర్షి వేద వ్యాసుడు ఈ రోజున జన్మించాడు. ఆయనను గుర్తు చేసుకుంటూ ఈ ఉత్సవాన్ని జరుపుకుంటారు. హిందువులు గురు పూర్ణిమకు ఎంతో ప్రాధాన్యతనిస్తుంటారు. హిందువులు గురువును దేవునితో సమానంగా భావిస్తారు. హరిద్వార్‌లో గురు పూర్ణిమ సందర్భంగా భక్తులు పవిత్ర గంగా నదిలో స్నానాలు చేస్తున్నారు. భక్తుల రద్దీతో గంగా ఘాట్లు నిండిపోయాయి. యూపీలోని అయోధ్యలోగల సరయూ నదిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. #WATCH | Haridwar, Uttarakhand: Devotees take a holy dip in the Ganga River, on the occasion of Guru Purnima pic.twitter.com/UcVQYZQAOY— ANI (@ANI) July 21, 2024 -
గోరఖ్‌నాథ్ ఆలయంపై దాడి కేసు.. నిందితుడు ముర్తజాకు మరణశిక్ష
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని ప్రముఖ గోరఖ్‌నాథ్ ఆలయంలోకి చొరబడి కత్తితో భద్రతా సిబ్బందిపై దాడి చేసిన ఘటనలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కోర్టు సోమవారం కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో అరెస్ట్ అయిన అహ్మద్ ముర్తజా అబ్బాసీని దోషిగా తేల్చిన ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు.. అతనికి మరణశిక్ష విధించింది. ఐపీసీ సెక్షన్ 121 ప్రకారం నిందితుడికి మరణశిక్ష విధించినట్లు ఏడీజీ (లా అండ్ ఆర్డర్) ప్రశాంత్ కుమార్ తెలిపారు. పోలీస్ సిబ్బందిపై దాడి చేసినందుకు సెక్షన్ 307 ప్రకారం జీవిత ఖైదు కూడా విధించినట్లు పేర్కొన్నారు. కాగా దాదాపు తొమ్మిది నెలల క్రితం గతేడాది ఏప్రిల్‌లో గోరఖ్‌పూర్ జిల్లాలోని గోరఖ్‌నాథ్ ఆలయం వద్ద ఓ వ్యక్తి బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ ప్రాంతానికే చెందిన ముర్తాజా అబ్బాసీ అనే వ్యక్తి.. ఆలయం వద్ద కత్తితో వీరంగం సృష్టించి.. ఆలయంలోకి బలవంతంగా ప్రవేశించేందుకు ప్రయత్నించాడు. అక్కడే సెక్యూరిటీగా ఉన్న పోలీసులు అతడ్ని అడ్డుకోబోగా పదునైన కత్తితో వారిపై దాడికి దిగాడు. ఈ ఘటనలో నిందితుడితోపాటు ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. అనంతరం అతడు పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా.. అబ్బాసీని పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఉగ్ర కుట్రలో భాగంగానే నిందితుడు ఆలయంలోకి ప్రవేశించి భక్తులపై దాడి చేసేందుకు ప్రయత్నించాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. అనంతరం ఈ ఘటనపై ఉగ్రవాద నిరోధక బృందం (ఏటీసీ) దర్యాప్తు చేపట్టింది. విచారణలో తనకు ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్(ఐసిస్)తో సంబంధాలున్నట్లు నిందితుడు అంగీకరించాడు. ఐసీసీ్ కోసం పోరాడుతున్నట్లు, ఉగ్రవాద సంస్థ మద్దతుదారులకు ఆర్థిక సాయం చేస్తున్నట్లు ఒప్పుకున్నాడు. సుదీర్ఘ విచారణ అనంతరం.. ఈ కేసులో అబ్బాసీని ఎన్ఐఏకోర్టు దోషిగా తేల్చింది. తాజాగా అతడికి మరణశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. కాగా గోరఖ్‌పూర్ సివిల్ లైన్స్ ప్రాంతానికి చెందిన అబ్బాసీ.. 2015లో ఐఐటీ ముంబయి నుంచి కెమికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. అనంతరం రెండు ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగం కూడా చేశాడు. అయితే 2017 నుంచి అబ్బాసీ మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు అతడి కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. చదవండి: ఫుట్‌పాత్‌పై జుట్లు పట్టుకుని కొట్టుకున్న అమ్మాయిలు.. వీడియో వైరల్ -
గోరఖ్‌నాథ్ ఆలయం వద్ద కలకలం
గోరఖ్‌పూర్: ఉత్తరప్రదేశ్‌లోని ప్రముఖ గోరఖ్‌నాథ్ ఆలయం వద్ద దుండగుడి హల్చల్తో కలకలం రేగింది. ముర్తజా అబ్బాసీ అనే ఐఐటీ గ్రాడ్యుయేట్ సోమవారం సాయంత్రం ప్రధాన ఆలయంలోకి ప్రవేశించేందుకు యత్నించాడు. అడ్డుకున్న ఇద్దరు భద్రతా సిబ్బందిని వెంట తెచ్చుకున్న కొడవలితో గాయపరిచాడు. భద్రతాసిబ్బంది అతడిని అదుపులోకి తీసుకున్నారు. దీనిని ఉగ్రకుట్రగా రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఆ సమయంలో భక్తులతో ఆలయ ప్రాంగణం నిండి ఉందని పోలీసులు తెలిపారు. పథకం ప్రకారమే అక్కడికి చేరుకున్న ముర్తజా ఆలయం లోపలికి ప్రవేశించి ఉంటే జరిగే పరిణామాన్ని ఊహించలేమన్నారు. అతడి వద్ద లభ్యమైన పత్రాలు సంచలనం కలిగించేవిగా ఉన్నట్లు పోలీసులు చెప్పారు. ముర్తజాను స్థానిక కోర్టు రెండు వారాల జ్యుడిషియల్ కస్టడీకి అనుమతించింది. ముర్తజా మానసిక సమస్యలతో బాధపడుతున్నాడని అతడి తండ్రి మునీర్ అంటున్నారు. -
యూనిఫాంతో మోకరిల్లిన సీఐ.. ట్రోలింగ్
గోరఖ్‌పూర్: ఉత్తరప్రదేశ్‌లో ఓ సీనియర్ అధికారి చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ ముందు యూనిఫాంలో మోకరిల్లిన సదరు అధికారి.. పైగా ఆ ఫోటోలను తన ఫేస్బుక్లో పోస్టు చేశారు. దీంతో పలువురు ఆన్లైన్లో సీఐను ట్రోల్ చేయటం ప్రారంభించారు. గురుపూర్ణిమ సందర్భంగా గోరఖ్‌నాథ్ ఆలయంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆలయ పెద్ద ఆదిత్యానాథ్ హాజరయ్యారు. దీంతో భద్రత కోసం సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ సింగ్ అక్కడికొచ్చారు. ఈ సందర్భంగా యోగి నుంచి ఆశీర్వాదం తీసుకున్న ప్రవీణ్.. ఆయా ఫోటోలను సోషల్ మీడియాలో ఉంచి ‘ఫీలింగ్ బ్లెస్స్డ్’ అంటూ పోస్ట్ చేశారు. వెంటనే విమర్శలు రావటంతో ప్రవీణ్ స్పందించలేదు. ‘నేను సీఎం హోదాలో ఆయనకా గౌరవం ఇవ్వలేదు. కేవలం ఆలయానికి పెద్దగా మాత్రమే పూజ చేశా’ అంటూ బదులిచ్చారు. అయితే చాలా మంది మట్టుకు మాత్రం ప్రవీణ్ చేసిన పనిని తప్పుబడుతున్నారు. యూనిఫాంలో ఆ పని చేయాల్సిన అవసరం ఏంటి? సిగ్గుందా? పోలీసుల పరువు తీసేశావ్.. ప్రభుత్వ ఉద్యోగివేనా? ఇలా పలువురు విరుచుకుపడుతున్నారు. మరోవైపు ట్రోలింగ్ కూడా ఓ రేంజ్‌లోనే జరుగుతోంది. -
తాజ్‌మహల్ స్థానంలో గోరఖ్‌నాథ్ మఠం!
ఆగ్రా : ప్రపంచ వింతల్లో ఒకటిగా, యునిసెఫ్ వారసత్వ కట్టడంగా గుర్తింపు పొందిన తాజ్‌మహల్ స్థానంలో.. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ ప్రధాన పూజారిగా వ్యవహరిస్తోన్న గోరఖ్‌నాథ్ మఠాన్ని చేర్చనున్నారా! సాక్షాత్తూ ఆ రాష్ట్ర పర్యాటక మంత్రి లక్ష్మీనారాయణ్ చౌదరే ఈ డిమాండ్‌ను లేవనెత్తడంతో తాజ్ వివాదం మలుపు తిరిగినట్లైంది. యూపీ ప్రభుత్వం ఇటీవల ముద్రించిన టూరిజం బుక్‌లెట్‌లో తాజ్ మహల్ కట్టడానికి స్థానం కల్పించకపోవడంపై తీవ్ర వివాదం రేగిన సంగతి తెలిసిందే. బుక్లెట్ నుంచి తాజ్ తొలగింపును సమర్థించుకున్న యూపీ మంత్రి చౌదరి.. దాని స్థానంలో గోరఖ్‌నాథ్ మఠంతో భర్తీ చేయాలన్నారు. ప్రస్తుతం యూపీలో ఉన్నది జాతీయవాద ప్రభుత్వమని, అది మత ధర్మాన్ని కాపాడుతుందన్నారు. సోమవారం ఆగ్రాలో ఏబీవీపీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సాక్షి వెబ్ ‘‘17వ శతాబద్ధం నాటి కట్టడానికి టూరిజం బుక్‌లెట్‌లో చోటుకల్పించినవాళ్లు.. ఇతరులు ఇష్టపడే ప్రదేశాలకు కూడా చోటు కల్పించి ఉండాల్సింది. గోరఖ్‌నాథ్ మథం ఇక్కడి ప్రజలకు ప్రతిబింబం లాంటిది. తాజ్ మహల్ స్థానంలో మఠానికి చోటుకల్పించడం అవసరం. తాజ్ ఏ ఒక్క మతానికో, వ్యక్తికో గుర్తుగా నిలిచిందికాదు’’ అని మంత్రి లక్ష్మీనారాయణ్ చౌదరి అన్నారు. కాగా, మంత్రి వ్యాఖ్యలపై యూపీ టూరిజనం డైరెక్టర్ జనరల్ అవనీశ్ అవస్థీ భిన్నంగా స్పందించారు. అసలా బుక్లెట్ పర్యాటక ఆకర్షక స్థలాల సమాహారం కానేకాదని, ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను హైలైట్ చేయడానికి మాత్రమే రూపొందించిందని వివరించారు. పుస్తకంలో చోటు కల్పించనప్పటికీ తాజ్ మహల్ నిర్వహణ కోసం ప్రభుత్వం నిధులు ఇస్తుందని సీఎం ఆదిత్యానాథ్ గతంలోనే చెప్పారు. అయితే, మంత్రి చౌదరి డిమాండ్‌పై సీఎం స్పందించాల్సిఉంది. సాక్షి వెబ్ -
గోరఖ్‌నాథ్ ఆలయాన్ని దర్శించుకున్న యోగీ
లక్నో : ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ శనివారం ఉదయం గోరఖ్‌పూర్‌లోని గోరఖ్‌నాథ్ ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేకపూజలు నిర్వహించారు. అనంతరం అక్కడే ఉన్న గోశాలను సందర్శించారు. గోవులకు ముఖ్యమంత్రి దాణా తినిపించారు. ఈ గోశాలలో సుమారు 500 ఆవులు ఉన్నాయి. ఈ సందర్భంగా గోశాల సంరక్షకుడు శివ్ పార్సెన్ మాట్లాడుతూ ఈ రోజు ఉదయం ముఖ్యమంత్రి గోశాలను సందర్శించారని, బెల్లం, బిస్కెట్లు, పండ్లు, దాణాను గోవులకు తినిపించినట్లు తెలిపారు. అలాగే పలు గోవులకు ఆయన పేర్లు పెట్టారు. గతంలోనూ సీఎం యోగీ గోశాలను దర్శించిన విషయం తెలిసిందే. -
‘యోగికి ఆ ముస్లిం యువకుడంటే ప్రేమ’
లక్నో: ఓ ముస్లిం యువకుడికి ఉత్తరప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌కు చాలా అవినాభావ సంబంధం ఉంది. ఎంత అంటే అతడు ఎప్పుడంటే అప్పుడు వెళ్లి కలిసేలాగా.. ఒక్కోసారి పెద్ద పెద్దవారికే దొరకని సీఎం అపాయింట్మెంట్ అతడికెలా సాధ్యం అని అనుకుంటున్నారా? మరేంలేదు ఆ యువకుడు సేవలు చేసేది గోరఖ్‌నాథ్ ఆలయంలో. అవును.. పేద కుటుంబం నుంచి వచ్చిన మహ్మద్ అనే నేటి యువకుడు పదేళ్ల ప్రాయంలోనే గోరఖ్‌నాథ్ ఆలయానికి చేరుకున్నాడు. అతడి తండ్రి ఇనాయతుల్లా నుంచి బాధ్యతలు అందుకొని స్వచ్ఛంద సేవకుడిగా ఇక్కడి ఆలయంలోని గోశాలలో పనిచేస్తున్నాడు. ఇందులో సేవలందించే ఇతర సన్యాసుల మాదిరిగానే అతడు కూడా ఇప్పటికీ ఓ బ్యాచిలర్. కొంతమొత్తం పైకంతోపాటు అక్కడే భోజనం చేస్తూ హాయిగా సంతోషంగా తన జీవితాన్ని గడిపేస్తున్నాడంట. దిగ్విజయ్నాథ్, వైద్యనాథ్ మఠాదిపతులుగా ఉన్న సమయంలో మహ్మద్ తండ్రి ఇనాయతుల్లా సేవలందించగా యోగి ఆదిత్యనాథ్ మఠాదిపతిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మహ్మద్ సేవలందిస్తున్నాడు. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే హిందుమతస్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా తన మత ఆచారాలు పాటిస్తుంటాడు. ‘నేను నా బాల్యం మొత్తాన్ని ఇంట్లో మాదిరిగానే గోరఖ్‌నాథ్ ఆలయంలో గడిపాను. నా జీవితకాలం మొత్తం ఇక్కడే పనిచేస్తాను. యోగీజీ నాకు చాలా గౌరవం ఇస్తారు.. ప్రేమ చూపిస్తారు. గోవులపట్ల నా అంకిత భావాన్ని యోగీజీ బాగా ఇష్టపడతారు. ఆయన గోవులు తినేవరకు బ్రేక్ ఫాస్ట్ కూడా చేయరు’ అని మహ్మద్ తెలిపారు. ‘ఆయన కరడుగట్టిన హిందుత్వవాదిగా కనిపించినప్పటికి వ్యక్తిగతంగా మాత్రం ఆయన ప్రతిఒక్కరికి అండగా ఉంటారు. గౌరవిస్తారు’ అని కూడా మహ్మద్ చెప్పాడు.