తాజ్‌మహల్, యూపీ సీఎం యోగి ప్రధాన అర్చకుడిగా ఉన్న గోరఖ్‌నాథ్ ఆలయం (ఇన్‌సెట్‌లో పర్యాటక మంత్రి చౌదరి)
ఆగ్రా : ప్రపంచ వింతల్లో ఒకటిగా, యునిసెఫ్ వారసత్వ కట్టడంగా గుర్తింపు పొందిన తాజ్‌మహల్ స్థానంలో.. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ ప్రధాన పూజారిగా వ్యవహరిస్తోన్న గోరఖ్‌నాథ్ మఠాన్ని చేర్చనున్నారా! సాక్షాత్తూ ఆ రాష్ట్ర పర్యాటక మంత్రి లక్ష్మీనారాయణ్ చౌదరే ఈ డిమాండ్‌ను లేవనెత్తడంతో తాజ్ వివాదం మలుపు తిరిగినట్లైంది.
యూపీ ప్రభుత్వం ఇటీవల ముద్రించిన టూరిజం బుక్‌లెట్‌లో తాజ్ మహల్ కట్టడానికి స్థానం కల్పించకపోవడంపై తీవ్ర వివాదం రేగిన సంగతి తెలిసిందే. బుక్‌లెట్ నుంచి తాజ్ తొలగింపును సమర్థించుకున్న యూపీ మంత్రి చౌదరి.. దాని స్థానంలో గోరఖ్‌నాథ్ మఠంతో భర్తీ చేయాలన్నారు. ప్రస్తుతం యూపీలో ఉన్నది జాతీయవాద ప్రభుత్వమని, అది మత ధర్మాన్ని కాపాడుతుందన్నారు. సోమవారం ఆగ్రాలో ఏబీవీపీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సాక్షి వెబ్
‘‘17వ శతాబద్ధం నాటి కట్టడానికి టూరిజం బుక్‌లెట్‌లో చోటుకల్పించినవాళ్లు.. ఇతరులు ఇష్టపడే ప్రదేశాలకు కూడా చోటు కల్పించి ఉండాల్సింది. గోరఖ్‌నాథ్ మథం ఇక్కడి ప్రజలకు ప్రతిబింబం లాంటిది. తాజ్ మహల్ స్థానంలో మఠానికి చోటుకల్పించడం అవసరం. తాజ్ ఏ ఒక్క మతానికో, వ్యక్తికో గుర్తుగా నిలిచిందికాదు’’ అని మంత్రి లక్ష్మీనారాయణ్ చౌదరి అన్నారు.
కాగా, మంత్రి వ్యాఖ్యలపై యూపీ టూరిజనం డైరెక్టర్ జనరల్ అవనీశ్ అవస్థీ భిన్నంగా స్పందించారు. అసలా బుక్‌లెట్ పర్యాటక ఆకర్షక స్థలాల సమాహారం కానేకాదని, ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను హైలైట్ చేయడానికి మాత్రమే రూపొందించిందని వివరించారు. పుస్తకంలో చోటు కల్పించనప్పటికీ తాజ్ మహల్ నిర్వహణ కోసం ప్రభుత్వం నిధులు ఇస్తుందని సీఎం ఆదిత్యానాథ్ గతంలోనే చెప్పారు. అయితే, మంత్రి చౌదరి డిమాండ్‌పై సీఎం స్పందించాల్సిఉంది. సాక్షి వెబ్
Comments
Please login to add a commentAdd a comment