Drunk Man Rides Bull At Night In Uttarakhand Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

Viral Video: ఏం స్వారీ చేశాడు భయ్యా! అర్థరాత్రి తాగిన మైకంలో ఎద్దుపైకి ఎక్కి..

Published Tue, May 9 2023 2:39 PM | Last Updated on Tue, May 9 2023 3:44 PM

Drunk Man Rides Bull At Night In Uttarakhand Goes Viral On Socialmedia - Sakshi

తాగిన మైకంలో పలువురు వ్యక్తులు ఏం చేస్తారో కూడా తెలియదు. కొందరికి ఆ సమయంలో తాము ఏం చేశాం అనే స్పృహ కూడా ఉండదు. మత్తులో చిత్తయిన ఓ యువకుడు చేసిన పని అందర్నీ షాక్‌కి గురి చేసింది. అసలేం జరిగిందంటే.. ఓ యువకుడు తాగిన మత్తులో ఎద్దుపై స్వారీ చేస్తూ వీధుల గుండా హల్‌చల్‌ చేశాడు. రోడ్డుపై ఉన్న జనం ఆ యవకుడిని చూసి ఒకింత ఆశ్చర్యానికి, ఎక్కడ ఆ ఎద్దు తమపైకి దూసుకొస్తుందోననని మరొకింత ఆందోళనకు గురయ్యారు.

జల్లికట్టు మాదిరిగా ఆ ఎద్దుపైకి ఎక్కి కూర్చొని వెళ్లడం అందర్నీ దిగ్బ్రాంతికి గురి చేసింది. ఈ వీడియో కాస్త సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు.  అతడిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. ఈ ఘటన ఉత్తరాఖండ్‌లోని రిషీకేశ్‌ తపోవన్‌ ప్రాంతంలో జరిగినట్లుగా గుర్తించారు.

ఈ మేరకు ఉత్తరాఖండ్‌ పోలీసులు ట్విట్టర్‌ వేదికగా.. మే 5న అర్థరాత్రి రిషికేశ్‌లోని తపోవన్‌లో మద్యం మత్తులో ఉన్న ఓ యువకుడు ఎద్దుపై స్వారీ చేస్తూ కనిపించిన వైరల్‌ వీడియోని గుర్తించాం. ఆ యువకుడిపై చ​ర్యలు తీసుకున్నాం. జంతువులతో ఎవరూ అసభ్యంగా ప్రవర్తించొద్దని యువతను గట్టిగా హెచ్చరిస్తూ ట్వీట్‌ చేశారు ఉత్తరాఖండ్‌ పోలీసులు. కొందరు నెటిజన్లు ఎద్దును ఇలా హింసించడం సరికాదని ట్వీట్‌ చేయగా, మరికొందరూ జల్లికట్టు క్రీడతో పోల్చుతూ ట్వీట్లు చేశారు.

(చదవండి: రెజ్లర్ల నిరసనలో పాల్గొనేందుకు తరలి వస్తున్న రైతులు..బారికేడ్లను చేధించి..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement