
సాక్షి, రుషికేశ్: విశ్వహిందూ పరిషత్ జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి రాఘవులు సోమవారం రుషికేశ్‌లో విశాఖ శారదా పీఠాధిపతులను కలిశారు. స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర ఆశీస్సులు అందుకున్నారు. పీఠాధిపతులు చేపట్టిన చాతుర్మాస్య దీక్ష వివరాలను అడిగి తెలుసుకున్నారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం గురించి ఈ సందర్భంగా చర్చించారు. రామ మందిరం భూమి పూజ వివరాలను పీఠాధిపతులకు వివరించారు. నిర్మాణానికి స్వామిజీ ఆశీస్సులు ఉండాలని కోరారు. రామ మందిర నిర్మాణం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టాలని నిర్ణయించినట్లు చెప్పారు. రామ మందిర నిర్మాణంపై ప్రధాని మోదీ దృఢ సంకల్పంతో ఉన్నారని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment