Vishwa Hindu Parishad Leader
-
తిరుమల లడ్డూపై బాబు చేసిన వాఖ్యలను ఖండించిన వీహెచ్ పీ
-
లవ్ జిహాద్‌కు మదర్సాలే కేంద్రాలు
బరేలీ: ’లవ్ జిహాద్, ప్రపంచ కలహాలకు కేంద్రాలకు మారిన మదర్సాలను మూసివేయాలని వీహెచ్‌పీ నేత సాధ్వి ప్రాచి వ్యాఖ్యానించారు. ‘హిందువులు డబ్బు సంపాదన గురించే ఆలోచిస్తారు. ఒక ప్రత్యేకవర్గం మాత్రం భారత్‌ను పాలించాలని ఆలోచిస్తుంటుంది. వెయ్యేళ్లు భారత్‌ను పాలించడమే వారి ఎజెండా’అని యూపీలోని బరేలీలో ఆదివారం ఆమె మీడియాతో అన్నారు. ‘లవ్ జిహాద్ మదర్సాల నుంచే మొదలవుతోంది. అక్కణ్నుంచే వ్యాప్తి చెందుతుంది. దేశంలో మదర్సాలు మూసేసిన రోజున లవ్ జిహాద్ ఉనికిలోనే ఉండదు. అప్పుడు ఒక్క భారతదేశంలోనే కాదు, ప్రపంచం మొత్తంలో శాంతి సామరస్యాలు వెల్లివిరుస్తాయి’అని ఆమె మీడియాతో అన్నారు. -
హిందువులు నలుగురిని కని... ఇద్దర్ని ఆరెస్సెస్‌కు దత్తతివ్వండి
కాన్పూర్/లక్నో/సిమ్లా: భారత్ హిందూ దేశంగా మారాలంటే ప్రతి హిందూ దంపతులు నలుగురేసి పిల్లల్ని కనాలని సాధ్వి రితంబర కోరారు. వారిలో ఇద్దరిని దేశం కోసం కేటాయించాలన్నారు. కరడుగట్టిన హిందుత్వవాదిగా పేరున్న ఆమె శనివారం నిరాలానగర్‌లో రామ్ మహోత్సవ్ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘హిందూ దంపతులు నలుగురిని కని వారిలో ఇద్దరిని ఆర్ఎస్ఎస్కు దత్తతకివ్వాలి. వీహెచ్‌పీ కార్యకర్తలుగా తయారు చేసి దేశానికి అంకితం చేయాలి’’ అన్నారు. ‘‘జనాభా అసమతుల్యత భవిష్యత్తులో దేశానికి మంచిది కాదు. ఉమ్మడి పౌరస్మృతి అమల్లోకొస్తే ఈ సమస్య ఉండదు’’ అని చెప్పారు. అయోధ్య రామ మందిర ఉద్యమంతో సంబంధమున్న రితంబర వీహెచ్‌పీ మహిళా విభాగం దుర్గావాహిని వ్యవస్థాపకురాలు. నర్సింగానంద్.. మళ్లీ అదే మాట భారత్ ముస్లిం దేశంగా మారకూడదంటే హిందువులు ఎక్కువ మంది సంతానాన్ని కనాలని యతి నర్సింగానంద్, అఖిలభారత సంత్ పరిషత్ హిమాచల్‌ప్రదేశ్ ఇన్చార్జి యతి సత్యదేవానంద్ సరస్వతి పిలుపునిచ్చారు. సోమవారం హిమాచల్‌ప్రదేశ్‌లోని ఉనా జిల్లా ముబారక్‌పూర్‌లో ‘ధర్మసంసద్’లో వారు మాట్లాడారు. ‘‘ముస్లింలు పథకం ప్రకారం ఎక్కువ మందిని కంటూ తమ జనాభాను పెంచుకుంటున్నారు. భారత్ ముస్లిం దేశంగా మారకుండా చూసేందుకు ఎక్కువ సంతానాన్ని కనాలని హిందూ దంపతులకు పిలుపునిస్తున్నాం’ అని సరస్వతి అన్నారు. ఇవి అభ్యంతరకర వ్యాఖ్యలంటూ జిల్లా పోలీసులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. యతి నర్సింగానంద్ ఇటీవల మథురలోనూ ఇవే వ్యాఖ్యలు చేశారు. గతేడాది హరిద్వార్‌లో మత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన కేసులో ఆయన బెయిల్‌పై ఉన్నారు. -
సంచలన వ్యాఖ్యలు : మసీదులో హోమం చేస్తాం!
లక్నో: విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) నాయకురాలు సాధ్వీ ప్రాచి లక్నోలోని ఒక మసీదులో హోమం చేస్తామని శుక్రవారం నాడు సంచలన వాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్ మధురాలోని ఒక ఆలయంలో నమాజ్ సమర్పించినందుకు నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసిన కొన్ని రోజుల తరువాత ఆమె ఇలా బహిరంగంగా ప్రకటించడం తీవ్ర కలకలం రేపింది. అయితే వెంటనే ఆమె తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకున్నారు. అక్టోబర్ 29 న మధురలోని నందగావ్‌లో ఉన్న నంద్ బాబా మందిర్ వద్ద ఇద్దరు వ్యక్తులు నమాజ్ చేశారనే ఆరోపణలతో పోలీసులు నలుగురు వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఫైజల్ ఖాన్, చంద్ మొహమ్మద్ అనే వ్యక్తులు నమాజ్ చేయగా వారితో పాటు వచ్చిన అలోక్ రతన్, నీలేష్ గుప్తా వారి ఫోటోలు తీసి సోషల్ మీడియాలో ప్రసారం చేసినట్లు తెలుస్తోంది. ఈ సంఘటన తరువాత, మసీదులలో 'హనుమాన్ చలీసా' చదివిన కేసులు వెలువడ్డాయి. తారోలి గ్రామంలోని ఒక మసీదులోకి ప్రవేశించి హనుమాన్ చలీసాను పఠించినట్లు ఆరోపణలు రావడంతో మధుర పోలీసులు గురువారం ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ముగ్గురిపై సీఆర్పీసీ 151 కింద కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ప్రాచి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఇక ప్రాచి ఈ విషయాల పై స్పందిస్తూ సామాజిక సామరస్యం పేరిట ఒక ముఠా దేవాలయాలకు వెళ్లి నమాజ్ చేస్తోందని, సాంఘిక సామరస్యాన్ని కాపాడుకునేలా హిందువులు కూడా మసీదుల వద్దకు వెళ్లి హోమం చేయాలని తాము అభిప్రాయపడుతున్నామని ఆమె పేర్కొన్నారు. దేవాలయాలను నాశనం చేసి నిర్మించిన మసీదులను కూల్చివేసి అక్కడ పూజలు నిర్వహించాలన్నారు. హోమం చేయడం ద్వారా వాయు కాలుష్యం కూడా తగ్గుతుందన్నారు. లక్నోలో ఉన్న పురాతన మసీదలో హోమం చేస్తామని ఆమె ప్రకటించారు. అయితే తరువాత ఆమె తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు. దీంతో పాటు ఆమె ‘లవ్ జిహాద్’ పై కూడా స్పందించారు. ఇది ఎంతోకాలంగా చేస్తోన్న కుట్ర అని ఇది నెమ్మదిగా భారతదేశమంతా విస్తరిస్తుందన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడే వ్యక్తులను బహిరంగా ఉరితీయాలన్నారు. ఈ విషయానికి సంబంధించి కఠినమైన చట్టాన్ని తీసుకురావాలన్నారు. చదవండి: లవ్ జిహాద్: విచారణలో కీలక విషయాలు -
శారదా పీఠాధిపతులను కలిసిన వీహెచ్‌పీ నేత
సాక్షి, రుషికేశ్: విశ్వహిందూ పరిషత్ జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి రాఘవులు సోమవారం రుషికేశ్‌లో విశాఖ శారదా పీఠాధిపతులను కలిశారు. స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర ఆశీస్సులు అందుకున్నారు. పీఠాధిపతులు చేపట్టిన చాతుర్మాస్య దీక్ష వివరాలను అడిగి తెలుసుకున్నారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం గురించి ఈ సందర్భంగా చర్చించారు. రామ మందిరం భూమి పూజ వివరాలను పీఠాధిపతులకు వివరించారు. నిర్మాణానికి స్వామిజీ ఆశీస్సులు ఉండాలని కోరారు. రామ మందిర నిర్మాణం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టాలని నిర్ణయించినట్లు చెప్పారు. రామ మందిర నిర్మాణంపై ప్రధాని మోదీ దృఢ సంకల్పంతో ఉన్నారని వివరించారు. -
ఆయనకు బెదిరింపు కాల్స్ వచ్చేవి: రంజిత్ భార్య
లక్నో: విశ్వహిందూ మహాసభల నాయకుడు రంజిత్ బచ్చన్ ఆదివారం హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఆయన భార్య కలింది మాట్లాడుతూ.. రంజిత్‌కు రాడికల్ గ్రూప్‌ల నుంచి తరచూ బెదిరింపు కాల్స్, మెసెజ్‌లు వచ్చేవని పేర్కొన్నారు. అయితే ఆయనకు వస్తున్న బెదిరింపులపై పోలీసులకు ఎప్పుడు ఫిర్యాదు చేయలేదని చెప్పారు. ఎందుకంటే ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంలో తనకు ఎప్పటికీ హాని జరగదని ఆయన చాలా నమ్మకంగా ఉండేవారన్నారు. కాగా గతంలో మేము మా బిడ్డను కోల్పోయాము, ఇప్పుడు నా భర్తను కోల్పోయానంటూ ఆమె ఆవేధన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తన భర్తను హత్య చేసిన నిందితులను త్వరలో పట్టుకోవాలని, వారిని కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. (చదవండి: విశ్వహిందూ మహాసభ చీఫ్ కాల్చివేత..!) ఇక రంజిత్ హత్య కేసుపై లక్నో పోలీసులు గాలింపులు చర్యలు చేపట్టగా సీసీటీవీ వీడియో ఆధారంగా నిందితుడి ఫొటోను విడుదల చేశారు. నిందితులను పట్టుకునేందుకు ఆరు క్రైం బ్రాంచ్ పోలీసుల బృందాలు గాలింపు చర్యలు చేపట్టారు. అలాగే నిందితుడి ఆచూకి తెలిపిన వారికి రూ. 50 వేలు బహుమతిని ఇవ్వనున్నట్లు పోలీసులు ప్రకటించారు. కాగా ఆదివారం ఉదయం హజ్రత్‌గంజ్ ప్రాంతంలో మార్నింగ్ వాక్ వెళ్లిన రంజిత్ బచ్చన్, అతని సోదరునిపై దుండగులు కాల్పులకు తెగబడ్డారు. తీవ్ర గాయాలపాలైన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించగా.. తలలో బుల్లెట్ దూసుకుపోవడంతో బచ్చన్ అప్పటికే మరణించినట్టు వైద్యులు తెలిపారు. ఆయన సోదరుడు చికిత్స పొందుతున్నాడని వెల్లడించారు. -
విశ్వహిందూ మహాసభ చీఫ్ కాల్చివేత..!
లక్నో : విశ్వహిందూ మహాసభ చీఫ్ రంజిత్ బచ్చన్‌ను దుండగులు కాల్చి చంపారు. ఈ ఘటన లక్నోలోని హజరత్గంజ్లో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. మార్నింగ్ వాక్ వెళ్లిన బచ్చన్, అతని సోదరునిపై దుండగులు కాల్పులకు తెగబడ్డారు. తీవ్ర గాయాలపాలైన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించగా.. తలలో బుల్లెట్ దూసుకుపోవడంతో బచ్చన్ అప్పటికే మరణించినట్టు వైద్యులు తెలిపారు. ఆయన సోదరుడు చికిత్స పొందుతున్నాడని వెల్లడించారు. నిందితుల కోసం ఆరు క్రైం బ్రాంచ్ పోలీసుల బృందాలు గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, ఇటీవల కాలంలో ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన హిందుత్వ ప్రతినిధులను కాల్చిచంపిన ఘటనల్లో ఇది రెండోది. గత అక్టోబర్‌లో హిందూ సమాజ్‌పార్టీ నాయకుడు కమలేశ్ తివారీని దుండగులు లక్నోలోని నక ప్రాంతంలో కాల్చి చంపారు. 2015లో ముహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి తివారీ వార్తల్లో నిలిచారు. ఆయన వ్యాఖ్యలపై అప్పట్లో ముస్లిం సంఘాలు తీవ్ర విమర్శలు చేశాయి. చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఫైజాబాద్ నుంచి స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీచేసిన తివారీ డిపాజిట్ కోల్పోయారు. పలు కేసుల్లో ఆయనపై అభియోగాలు ఉన్నాయి. -
హిందూ ఉద్యమ నేత అశోక్ సింఘాల్
గుర్గావ్: రామజన్మభూమి ఉద్యమంలో క్రియాశీలక పాత్ర వహించిన అశోక్ సింఘాల్, దళితుల కోసం ప్రత్యేక దేవాలయాలను నిర్మించడంతో స్ఫూర్తిదాయక పాత్రను నిర్వహించారు. దేవాలయాల్లోకి ప్రవేశం లేదంటూ అగ్రవర్గాల ఛీత్కారాలను ఛీదరించుకొని పరమతాన్ని ఆశ్రయిస్తున్న సమయంలో దళితుల కోసం ప్రత్యేక దేవాలయాల నిర్మాణానికి ఉద్యమించారు. అలా దాదాపు 200 దేవాలయాలను నిర్మించారు. ఆరెస్సెస్‌తో ప్రారంభమైన ఆయన హిందూ మతోద్ధరణ కార్యక్రమం విశ్వహిందూ పరిషత్‌కు ప్రధాన కార్యదర్శి బాధ్యతల నుంచి తప్పుకునే వరకు కొనసాగింది. 1926, సెప్టెంబర్ 15వ తేదీన ఆగ్రాలో జన్మించిన అశోక్ సింఘాల్ 1950లో బనారస్ హిందూ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఇంజనీరింగ్ పట్టభద్రుడయ్యారు. ఆయన 1942లోనే ఆరెస్సెస్‌లో చేరారు. పట్టభద్రుడయ్యాక ఫుల్‌టైమ్ ప్రచారక్‌గా మారారు. ఉత్తరప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో చురుకైన ప్రచారక్‌గా ప్రశంసలు అందుకున్నారు. ఢిల్లీ, హర్యానాలకు ప్రంత్ ప్రచారక్‌గా మారారు. 1980లో విశ్వహిందూ పరిషద్‌కు బదిలీ అయ్యారు. సంయుక్త ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. 1984లో ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఆయన 1984లో నిర్వహించిన వీహెచ్‌పీ ధర్మ సంసద్‌కు వందలాది మంది సాధువులు, హిందూ స్కాలర్లు హాజరయ్యారు. దేశంలో హిందూ మతాన్ని పునరుద్ధరించేందుకు ఆయన ఈ సంసద్‌లో సుదీర్ఘ చర్చలు జరపడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అందులో భాగంగానే పుట్టుకొచ్చిన రామజన్మభూమి ఉద్యమానికి ముఖ్య సారథిగా పనిచేశారు. 1992లో బాబ్రీ మసీదు విధ్వంసానికి దారితీసిన ఆ ఉద్యమంలో ఆయనపై కేసులు కూడా నమోదయ్యాయి. ఆ తర్వాత ఆయన వీహెచ్‌పీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా 2011 వరకు బాధ్యతలు నిర్వహించారు. అనారోగ్య కారణాలతో ఆయన ఆ బాధ్యతల నుంచి తప్పుకోగా, వీహెచ్‌పీ నాయకత్వ బాధ్యతలు మోహన్ భగవత్ స్వీకరించారు. మంచి గాత్ర శుద్ధిగల అశోక్ సింఘాల్, పండిట్ హోంకార్నాథ్ ఠాకూర్ వద్ద హిందూస్థాన్ మ్యూజిక్‌ను నేర్చుకున్నారు.