
రిషికేశ్: మధ్యప్రదేశ్‌లోని రేవా రాజవంశానికి చెందిన యువతి, టీవీ నటి మోహన కుమారి కరోనా బారిన పడి సుమారు వారం రోజులు కావస్తోంది. ఈ నేపథ్యంలో తన ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ సోషల్ మీడియాలో ఆమె అభిమానులకు వీడియో సందేశం పంపింది. "రిషికేశ్ ఆసుపత్రిలో నాకిది 6వ రోజు. ఈ వ్యాధి శారీరకంగా బాధపెట్టదు కానీ మానసికంగా ప్రభావితం చేస్తుంది. మీ లోపల వైరస్ ఉందన్న విషయం మిమ్మల్ని మనశ్శాంతిగా ఉంచనివ్వదు. అది నిజంగా బాధిస్తుంది. కోవిడ్ బారిన పడిన నా కుటుంబ సభ్యులందరూ ఇప్పుడు బాగానే ఉన్నారు. మేము వైరస్‌తో పోరాడాం, ఇప్పటికీ పోరాడుతూనే ఉన్నాం. అయినప్పటికీ ఈసారి కూడా పాజిటివ్ అనే తేలింది. కానీ మీ ప్రార్థనలు ఫలిస్తే త్వరలోనే అది నెగెటివ్ అని వస్తుందని ఆశిస్తున్నా" అని పేర్కొంది. (మాకు కరోనా పాజిటివ్‌గా తేలింది: నటి)
మోహన కుమారితోపాటు ఆమె భర్త సుయేష్ రావత్, అతని తండ్రి, ఉత్తరాఖండ్ పర్యాటక మంత్రి సత్పల్ మహారాజ్ సహా ఏడుగురు కుటుంబ సభ్యులు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. కాగా గత ఏడాది అక్టోబర్‌లో మోహనా ఉత్తరాఖండ్ పర్యాటక మంత్రి సత్పాల్ మహారాజ్ కుమారుడు సుయేష్ రావత్‌ని వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లి కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ సైతం హాజరైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె తన భర్త, కుటుంబంతో కలిసి డెహ్రాడూన్‌లో నివసిస్తోంది. (మంత్రి కుటుంబానికి కరోనా పాజిటివ్)
Comments
Please login to add a commentAdd a comment