
రేపు రిషికేష్ వెళ్లనున్న వైఎస్ జగన్
ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి బుధవారం రిషికేష్ వెళ్లనున్నారు. అక్కడ స్వరూపానందేంద్రస్వామి వారి ఆశీస్సులను జగన్ తీసుకుంటారు.
ఏపీకి మంచి జరగాలని, ప్రత్యేక హోదా ఆకాంక్షిస్తూ స్వరూపానందేంద్ర స్వామి నిర్వహిస్తున్న పూజల్లో జగన్ పాల్గొంటారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం రెండో రోజుల పాటు ఢిల్లీలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, కమ్యూనిస్ట్ పార్టీ అగ్రనేతలను జగన్ కలిసి చర్చించిన విషయం తెలిసిందే.