Swaroopananda Swamy
-
‘అలా చేస్తే మోదీని అభినవ వివేకానందుడిగా కీర్తిస్తారు’
సాక్షి, విశాఖపట్నం : ఆర్టికల్ 370 రద్దు చారిత్రాత్మక నిర్ణయమని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద, ఉత్తరాధికారి స్వాత్మానందలు వ్యాఖ్యానించారు. సోమవారం ఆర్టికల్ 370 రద్దు నిర్ణయంపై ఇరువురూ స్పందించారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అభినందనీయులన్నారు. దేశ సమగ్రతకు, సమైక్యతకు ఆర్టికల్ 370 రద్దు దోహదపడుతుందని పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో జమ్మూకశ్మీర్ ప్రజల సమగ్ర వికాసం సాకారమవుతుందని అభిప్రాయపడ్డారు. దేశంలోని శక్తి పీఠాలన్నింటినీ సందర్శించే అవకాశం ఇన్నేళ్లకు దక్కబోతోందని ఆనందం వ్యక్తం చేశారు. కశ్మీర్లోని సరస్వతీ శక్తి పీఠం పునరుద్ధరణకు ఉపయోగపడుతుందన్నారు. భారత సర్కారు స్వరస్వతీ శక్తి పీఠ పునరుద్ధరణకు పూనుకుంటే శారదా పీఠం సహకరిస్తుందని చెప్పారు. రామ జన్మభూమి, గోరక్షణ విషయాల్లోనూ ఇదే తరహాలో తక్షణ చర్యలు చేపట్టాలని, భారత దేశపు అధికారిక ఆధ్యాత్మిక చిహ్నంగా గోవును ప్రకటించాలని కోరారు. ఈ చర్యలు చేపడితే హిందువులంతా మోదీని అభినవ వివేకానందుడిగా కీర్తిస్తారని అన్నారు. -
కృష్ణా తీరంలో ఆధ్యాత్మిక శోభ
-
స్వరూపానంద ఆశీస్సులు తీసుకున్న కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : విశాఖ పీఠాధిపతి స్వరూపానంద స్వామి వారిని తెలంగాణ సీఎం కేసీఆర్ కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. గతంలో విశాఖ శారదా పీఠంలో రాజ్యశ్యామల విగ్రహా ప్రతిష్ట కార్యక్రమానికి కేసీఆర్ హాజరు కాలేకపోయారు. ఈ నేపథ్యంలో ఫిల్మ్ నగర్లోని దైవసన్నిధానానికి విచ్చేసిన స్వరూపానందను కేసీఆర్ కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య ఆధ్యాత్మిక, రాజకీయాంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం. జూన్లో పీఠం ఉత్తరాధికారి బాధ్యతల స్వీకారోత్సవానికి రావాలని కేసీఆర్ని స్వరూపానంద ఆహ్వానించారు. జూన్ 15 నుంచి 3 రోజుల పాటు విజయవాడలో ఉత్తరాధికారి కార్యక్రమాలు నిర్వహిస్తారు. -
రేపు రిషికేష్ వెళ్లనున్న వైఎస్ జగన్
-
రేపు రిషికేష్ వెళ్లనున్న వైఎస్ జగన్
ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం రిషికేష్ వెళ్లనున్నారు. అక్కడ స్వరూపానందేంద్రస్వామి వారి ఆశీస్సులను జగన్ తీసుకుంటారు. ఏపీకి మంచి జరగాలని, ప్రత్యేక హోదా ఆకాంక్షిస్తూ స్వరూపానందేంద్ర స్వామి నిర్వహిస్తున్న పూజల్లో జగన్ పాల్గొంటారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం రెండో రోజుల పాటు ఢిల్లీలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, కమ్యూనిస్ట్ పార్టీ అగ్రనేతలను జగన్ కలిసి చర్చించిన విషయం తెలిసిందే. -
బీజేపీ, టీడీపీలపై స్వరూపానంద ఫైర్
ఢిల్లీ: బీజేపీ, టీడీపీల పై శారదాపఠాధిపతి స్వరూపానంద స్వామి మండిపడ్డారు. గోహత్యలను అడ్డుకోవడంలో బీజేపీ విఫలమయిందని ధ్వజమెత్తారు. రామ మందిర నిర్మాణంలో అడుగు కూడా ముందుకు పడలేదన్నారు. ఏపీలో దేవాలయ భూములు అన్యాక్రాంతమవుతున్నాయన్నారు. టీడీపీ నేతలు, ప్రభుత్వం దేవాలయ భూములతో వ్యాపారం చేస్తున్నారని స్వరూపానంద స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. -
వైఎస్ జగన్కు శారదా పీఠాధిపతి ఆశీస్సులు
హన్మకొండ: హిందూ ధార్మిక వ్యవస్థ, ఆలయ వ్యవస్థ రక్షణకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రత్యేక శ్రద్ధ కనబర్చారని, ప్రస్తుత తెలంగాణ సీఎం కేసీఆర్ సైతం అభినందనీయమైన కృషి చేస్తున్నారని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్రస్వామి అన్నారు. హన్మకొండలోని చారిత్రాత్మక శ్రీరుద్రేశ్వరస్వామి వారి వేయిస్తంభాల దేవాలయాన్ని మంగళవారం ఆయన సందర్శించారు. కార్తీకమాసం సందర్భంగా శ్రీరుద్రేశ్వరస్వామి వారికి అభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అనుగ్రహభాషణం చేస్తూ.. తండ్రి లాగే వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా ధార్మిక భావాలు కలవారని, ప్రజాసంక్షేమం కోసం ఏపీలో పోరాటం చేస్తున్నారని, ఆయనకు తన ఆశీస్సులు ఉంటాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో వలే తెలంగాణలో దేవాదాయ శాఖకు సారవంతమైన భూములు లేవని, కేవలం వేతనాలపైనే అర్చకులు ఆధారపడుతున్నారని తెలిపారు. ధూప, దీప నైవేద్య పథకం కింద అర్చకుల వేతనాలను పెంచుతూ కేసీఆర్ తీసుకున్న నిర్ణయం అభినందనీయమని అన్నారు. అర్చకుల మిగిలిన సమస్యలను కూడా పరిష్కరించాలని సూచించారు. -
’ఏపీ ప్రభుత్వం దారుణంగా విఫలమైంది’
-
సాయిబాబా కించపరిచిన స్వరూపానందపై భక్తుల ఆగ్రహం!
హైదరాబాద్: షిర్డీ సాయిబాబాను కించపరుస్తూ వ్యాఖ్యలు చేసిన స్వరూపానందస్వామిపై షిర్డీ సాయి భక్తుల ఆగ్రహం వ్యక్తం చేశారు. షిర్డీ సాయిబాబు దేవుడు కాదని, మనిషిని దేవుడిగా పూజించవద్దంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా షిర్డీసాయి దేవుడు కాడని, ఆయనకు ఆలయాలు కట్టడం సరికాదని సెలవిచ్చారు. పనిలో పనిగా హిందువులను విభజించేందుకే అంతర్జాతీయ శక్తులు బాబాను సీన్లోకి తెచ్చాయని స్వరూపనంద సరస్వతి వ్యాఖ్యలు చేశారు. సాయిబాబాను కించపరిచిన స్వరూపానంద క్షమాపణ చెప్పాలని భక్తులు, షిర్డీ సాయి తత్వ ప్రచార కమిటీ డిమాండ్ చేశారు. స్వరూపానందస్వామి తీరుపై సినీనటుడు మోహన్ బాబుతోపాటు పలువురు ప్రముఖులు, భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.