
'దీక్షలో వైఎస్ జగన్ పాల్గొనడం సంతోషకరం'
న్యూఢిల్లీ: రిషికేశ్‌లో నిర్వహించిన చాతుర్మాస్య దీక్షలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొనడం చాలా సంతోషకరమని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి చెప్పారు. బుధవారం స్వరూపానందేంద్ర స్వామి మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి జరగాలని వైఎస్ జగన్ దీక్షలో పాల్గొన్నారని ఆయన చెప్పారు. (రిషికేశ్‌లో వైఎస్ జగన్)
ఏపీకి ప్రత్యేక హోదా ఆకాంక్ష నెరవేరాలని వైఎస్ జగన్ యజ్ఞం కూడా చేసినట్టు తెలిపారు. కాగా, వైఎస్ జగన్ బుధవారం ఉదయం డెహ్రాడూన్ వెళ్లి అక్కడనుంచి రిషికేశ్కు చేరుకున్నారు. అనంతరం వైఎస్ జగన్ స్వరూపానందేంద్ర స్వామి ఆశీస్సులను తీసుకున్న విషయం తెలిసిందే.