ఏడేళ్ల బాలికపై లైంగిక వేధింపులు | seven year old sexually harassed in bangalore | Sakshi
Sakshi News home page

ఏడేళ్ల బాలికపై లైంగిక వేధింపులు

Published Wed, Jan 7 2015 3:48 PM | Last Updated on Mon, Jul 23 2018 9:13 PM

స్కూల్లో ధ్వంసమైన ఫర్నిచర్ - Sakshi

స్కూల్లో ధ్వంసమైన ఫర్నిచర్

బెంగళూరులోని ఓ స్కూల్లో ఘోరం జరిగింది. ఏడేళ్ల బాలికను లైంగికంగా వేధించిన వ్యాయామ ఉపాధ్యాయుడిని ఆమె తల్లిదండ్రులు పట్టుకుని చితకబాదారు. ఈ ఘటన పశ్చిమ బెంగళూరులోని బయతారాయణపుర ప్రాంతంలో జరిగింది. ఈ దారుణంతో తీవ్ర ఆగ్రహానికి గురైన స్థానికులు.. స్కూలు ప్రాంగణంలో ఉన్న వాహనాలను తగలబెట్టారు. స్కూలు ఫర్నిచర్ ధ్వంసం చేశారు. దాంతో పోలీసులు చేరుకుని బాష్పవాయువు ప్రయోగించి లాఠీచార్జి కూడా చేశారు. ఈ గందరగోళంలో ఓ కానిస్టేబుల్కు తలమీద గాయాలయ్యాయి. అతడిని విక్టోరియా ఆస్పత్రికి తరలించారు.

బుధవారం ఉదయం ఏడు గంటలకు ఏడేళ్ల బాలిక తల్లిదండ్రులు స్కూలుకు వచ్చి, తమ కుమార్తెను పీటీ లైంగికంగా వేధించారని ఆరోపించారు. ఈ విషయం వెంటనే చుట్టుపక్కల ప్రాంతాలకు పాకిపోయి, అందరూ చేరుకున్నారు. అయితే పోలీసు జీపు బయట పార్కు చేసి ఉండటంతో అందులో నిందితుడిని తీసుకెళ్లడం కష్టమని అర్థమైపోయింది. చివరకు ఎలాగోలా అతడిని బయటకు తీసుకొచ్చారు. జనంలో కొందరు అతడిని కొట్టడం మొదలుపెట్టగా, పోలీసులు లాఠీలకు పనిచెప్పి, పీటీని జీపులోకి ఎక్కించారు.

అనంతరం జనంలో ఆగ్రహావేశాలు పెరగడంతో పలు వాహనాలకు నిప్పంటించారు. నాలుగు ప్లటూన్ల రిజర్వు పోలీసు బలగాలను, వాటర్ కేనన్లను కూడా మోహరించారు. సీనియర్ పోలీసు అధికారులు ఎంతగా విజ్ఞప్తి చేసినా జనం వినిపించుకోలేదని నగర పోలీసు కమిషనర్ ఎంఎన్ రెడ్డి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement