
దెబ్బలను చూపుతున్న అబ్దుల్ రహమాన్
పంజగుట్ట: క్లాస్ రూంలో నవ్వినందుకు ఉపాధ్యాయుడు ఓ విద్యార్థిని చితక బాదాడు. సదరు విద్యార్థి కుటుంబ సభ్యులతో కలిసి పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఎమ్‌ఎస్ మక్తాకు చెందిన మహ్మద్ అబ్దుల్ అజీజ్ కుమారుడు అబ్దుల్ రహమాన్ (11) స్థానిక ఇక్రా హైస్కూల్‌లో 7వ తరగతి చదువుతున్నాడు. బుధవారం స్కూల్‌లో జీషన్ అనే ఉపాధ్యాయుడు ఒక విద్యార్థిని కొట్టాడు. దీనిని చూసిన అబ్దుల్ రహమాన్ నవ్వడంతో ఆగ్రహానికి లోనైన జీషన్ అతడిని తీవ్రంగా కొట్టాడు. బాధితుడు ఈ విషయాన్ని కుటుంబ సభ్యుల దృష్టికి తీసుకెళ్లడంతో వారు పంజగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కాగా సదరు టీచర్ స్టేషన్‌కు వచ్చి విద్యార్థి కుటుంబ సభ్యులతో రాజీ కుదుర్చుకున్నట్లు సమాచారం. పోలీసులు ఫిర్యాదును స్వీకరించి విచారణ చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment