క్లాస్‌లో విద్యార్థిపై కాల్పులు.. | Student allegedly shoots another Student | Sakshi
Sakshi News home page

క్లాస్‌లో విద్యార్థిపై కాల్పులు..

Published Sat, Sep 2 2017 11:45 AM | Last Updated on Fri, Nov 9 2018 4:36 PM

క్లాస్‌లో విద్యార్థిపై కాల్పులు.. - Sakshi

క్లాస్‌లో విద్యార్థిపై కాల్పులు..

సాక్షి,  హర్యానా: గన్‌ కల్చర్‌కు మనదేశంలోని విద్యార్థులు కూడా ఆకర్షితులు అవుతున్నారు. హరియాణాలోని సోనిపట్‌ ఇండస్ట్రియల్‌ ట్రైనింగ్‌ ఇనిస్టిట్యూట్‌ (ఐటీఐ)లో శనివారం ఇటువంటి ఘటనే జరిగింది. సోనిపట్‌లో ఐటిఐలో 17 ఏళ్ల ఒక విద్యార్థి తుపాకితో క్లాస్‌కు హాజరయ్యాడు. ప్రాక్టికల్స్‌ జరుగుతున్న సమయంలో ఆ విద్యార్థి తుపాకి తీసి.. మరో విద్యార్థిని దగ్గర నుంచి కాల్చాడు. అయితే బాధితుడికి బుల్లెట్‌ శరీరానికి దగ్గరగా దూసుకువెళ్లడంతో గాయపడ్డాడు.

ప్రస్తుతం గాయపడ్డ విద్యార్థి రోహత్‌క్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజ్‌లో.. బాధితుడు ..సహ విద్యార్థులతో మాట్లాడుతున్న సమయంలో.. వెనకవైపు నుంచి వచ్చిన విద్యార్థి తుపాకీ తీసి.. కాల్చిన దృశ్యాలు రికార్డు అయ్యాయి. కాగా ఆ విద్యార్థి ఎందుకు కాల్పులు జరిపాడన్నది తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement