
బీజింగ్, చైనా : ఎండల తీవ్రతకు తట్టుకోలేని ఓ పాము క్లాస్ రూంలోకి వచ్చిన సంఘటన నైరుతి చైనాలో చోటు చేసుకుంది. హఠాత్తుగా పాము తరగతి గదిలోకి రావడం గమనించిన విద్యార్థులు హడలిపోయారు. పెద్ద పెట్టున కేకలు పెడుతూ గదిలో నుంచి బయటకు పరుగులు తీశారు.
విద్యార్థులు అటూఇటూ పరుగెత్తడంతో గందరగోళం నెలకొంది. ఈ లోగా క్లాస్ టీచర్ పామును ఒంటిచేత్తో పట్టుకొని అటవీ ప్రాంతంలో వదిలేశారు. ఎండలకు తట్టుకోలేక చల్లదనం కోసం ఏసీ క్లాస్ రూంలోకి పాము వచ్చివుంటుందని టీచర్ అన్నారు. పాము 3.3 అడుగుల పొడవు ఉంటుందని చెప్పారు. అయితే, అది విషపూరితమైనది కాదని స్పష్టం చేశారు.