కుమారుడితో పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన తల్లి, దెబ్బలు చూపిస్తున్న విద్యార్థి సంజీవ్
సాక్షి,శంకర్‌పల్లి: తరగతిగదిలోకి వచ్చేందుకు అనుమతి అడుగుతుంటే నోట్లో నుంచి ఉమ్ము కింద పడిందని ఆగ్రహించిన ఓ ఉపాధ్యాయురాలు విద్యార్థిపై కర్కశం ప్రద ర్శించారు. విచక్షణారహితంగా చితకబాదారు. దీంతో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన శంకర్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఫత్తేపూర్ ప్రభుత్వ పాఠశాలలో గురువారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన సాయిలు, లత దంపతుల కుమారుడు సంజీవ్‌కుమార్ (8) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నాడు.
చదవండి: అమ్మా.. నేను చనిపోతున్నా’ కూతురు ఫోన్.. అంతలోనే..
తరగతి గదిలోకి వచ్చేందుకు ఉపాధ్యాయురాలు శ్వేతను అనుమతి అడుగుతున్న క్రమంలో అతని నోట్లో నుంచి ఉమ్ము కింద పడింది. దీంతో ఆగ్రహించిన ఆమె కర్రతో చితకబాదారు. చేతులు, కాళ్లు, ముఖంపై కొట్టడంతో చర్మం కమిలిపోయింది. సాయంత్రం ఇంటికి వచి్చన బాలుడి ఒంటిపై ఉన్న దెబ్బలు చూసి చలించిపోయిన తల్లిదండ్రులు సదరు ఉపాధ్యాయురాలిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే విషయమై టీచర్‌ను నిలదీయగా.. మీ అబ్బాయికి క్రమశిక్షణ లేదు అందుకే కొట్టానని బదులిచ్చారు. కేసు దర్యాప్తులో ఉంది.
చదవండి: ఇద్దరూ ఇష్టపడ్డారు.. ప్రేమించిన అమ్మాయిని దూరం చేశారని..
సస్పెన్షన్ వేటు
విద్యార్థి సంజీవ్‌కుమార్‌ను చితకబాదిన ఉపాధ్యాయురాలిని జిల్లా విద్యాధికారి సస్పెండ్ చేసినట్లు మండల విద్యాధికారి అక్బర్ తెలిపారు. విద్యార్థి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ జరిపామని తెలిపారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్వేతపై డీఈవో సుశీందర్‌రావు గురువారం వేటు వేశారు.
Comments
Please login to add a commentAdd a comment