
సెల్‌ఫోన్‌లో మాట్లాడితే రూ.10వేల జరిమానా
కేకే.నగర్: తరగతి గదిలో సెల్‌ఫోన్‌లో మాట్లాడితే రూ.10వేలు జరిమానాగా విధించనున్నట్లు గిండి ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులకు హెచ్చరికలు జారీ చేసింది.శాస్త్రీయ అభివృద్ధిలో ఒక భాగంగా భావించపడే సామాజిక మాధ్యమాలు యువతరాన్ని ముఖ్యంగా విద్యార్థులను తన కబంధ హస్తాలతో బందీలను చేస్తున్నాయని చేతిలో పాఠ్య పుస్తకాలు ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా విద్యార్థుల వద్ద సెల్‌ఫోన్ ఉండాల్సిందే. సెల్‌ఫోన్‌కు దాసులైన విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టలేకపోతున్నారు. అంతేకాక వారి చెడు మార్గాలను అనుసరిస్తున్నట్లు పలు సర్వేల్లో తెలిసింది.
ఈ నేపథ్యంలో విద్యార్థులను మంచి మార్గంలో నడిపించడానికి చదువుకునే సమయంలో వారి ఏకాగ్రత దెబ్బతినకుండా ఉండేందుకు పాఠశాల, కళాశాల నిర్వాహకులు పలు రకాల నిబంధనలు విధించాయి. గిండి ఇంజినీరింగ్ కళాశాలలో తరగతి గదుల్లో సెల్‌ఫోన్‌లు ఉపయోగించరాదని, ఒక వేళ మాట్లాడితే వారికి రూ.10వేలు జరిమానా విధిస్తామని నిర్వాహకులు తెలిపారు. నిర్వాహకులు మాట్లాడుతూ విద్యార్థుల క్షేమం కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.
విద్యార్థుల నుండి ఈ నిబంధనకు ఆదరణ లభించిందని అన్నారు. ఎవరైనా పట్టుబడి జరిమానా చెల్లించినట్లయితే ఆ సొమ్మును పేద విద్యార్థుల ఫీజులకు ఉపయోగిస్తామన్నారు. వారంలో రెండు రోజులు విద్యార్థులకు దీనిపై కౌన్సెలింగ్ ఇస్తామని తెలిపారు.