ఇప్పుడు చెప్పుకోబోయేది అవతార్ సినిమా గురించి కాదు. అంతకు మించిన అద్భుతం గురించే!. కళ్ల ఎదురుగా మనిషి లేకున్నా.. ఉన్నట్లుగా భావించడం, పక్కనే ఉన్నట్లు ఫీలవ్వడం, మాట్లాడడం, చర్చించడం.. ఇవన్నీ కుదిరే పనేనా?. టెక్నాలజీ ఎరాలో అందునా అవతార్ లాంటి రోబోలతో అది సాధ్యమవుతోంది.
బెర్లిన్(జర్మనీ) మార్జహ్న్-హెలెర్స్‌డోర్ఫ్‌లో జోషువా మార్టినన్‌గెలి అనే చిన్నారి ఉన్నాడు. అతనికి ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధి ఉంది. ఈ కారణంగా అతని మెడ నుంచి ఓ పైప్ సాయంతో చికిత్స అందిస్తున్నారు పేరెంట్స్. అలాంటప్పుడు స్కూల్‌కి వెళ్లడం వీలుపడదు కదా!. అందుకే జోషువా బదులు.. ఒక అవతార్ రోబోని అతని సీట్లో కూర్చోబెట్టారు.
ఏడేళ్ల Joshua Martinangeli బదులు ఈ అవతార్ రోబో పాఠాలు వింటుంది. తోటి విద్యార్థులతో మాట్లాడుతుంది. సరదాగా బదులు ఇస్తుంది. టీచర్ చెప్పే పాఠాలు వింటుంది. అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వడంతో పాటు అనుమానాలను నివృత్తి చేసుకుంటుంది కూడా. ఇదేలా సాధ్యం అంటే.. ఇంట్లో స్పెషల్ మానిటర్ ముందు కూర్చుని జోషిని.. అవతార్ రోబోకి ఉన్న మానిటర్‌కు కనెక్ట్ చేస్తారు కాబట్టి. అంతే అవతల ఇంట్లో జోషువా ఏం చేప్తే.. అవతార్ అదే బదులు ఇస్తుంది.
దీంతో అచ్చం జోషువా పక్కనే ఉన్నట్లు ఫీలైపోతున్నారు కొందరు స్టూడెంట్స్. జోషువా కుటుంబ ఆర్థిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని.. డిస్ట్రిక్ట్ కౌన్సిల్ వాళ్లు ఈ ఆవిష్కరణను ఆ కుటుంబానికి ఉచితంగా అందించారు. కరోనా టైంలో మొత్తం నాలుగు అవతార్ రోబోలను తయారు చేయగా.. ఇప్పుడు స్కూల్‌కి వెళ్లలేని ఆ చిన్నారి కోసం ఒక రోబోను వాడడం రాజకీయంగా కూడా చర్చనీయాంశంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment