సాధారణంగా ఏదైనా పాఠశాలలో ఉపాధ్యాయులు హాజరు వేసేటప్పుడు విద్యార్థులు ‘ఎస్ మేడమ్’ అనో లేదా ‘ఎస్ సార్’ అనో అంటుంటారు. అయితే ఆ పాఠశాలలో ఉపాధ్యాయులు హాజరువేసేటప్పుడు విద్యార్థులు ‘జై శ్రీరామ్’ అని అంటారు. అంటే ఉపాధ్యాయురాలు రామూ అనే పేరును పిలవగానే ఒక కుర్రాడు లేచి నిలుచుని ‘జై శ్రీరామ్’ అంటాడు. అలాగే జానకీ అని టీచర్ పిలవగానే ఒక విద్యార్థిని లేచి ‘జై శ్రీరామ్’ అని అంటుంది. ఈ ఉదంతానికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.
ఈ వీడియోలో హాజరు వేస్తున్న టీచర్ విద్యార్థుల పేర్లను పలికినప్పుడు వారు ‘జైశ్రీరాం’ అని అంటుంటారు. దీనికి టీచర్ ఏమీ అభ్యంతరం చెప్పకుండా విద్యార్థులకు హాజరు వేస్తుంటారు. దీనిని అదే క్లాసులోని ఎవరో విద్యార్థి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. విద్యార్థులు ‘జై శ్రీరామ్’ అంటుండగా ఉపాధ్యాయురాలు హాజరు వేయడాన్ని మనం వీడియోలో చూడవచ్చు.
ఉపాధ్యాయురాలు క్లాస్‌లోని బ్లాక్‌బోర్డ్ దగ్గర నిలుచుని విద్యార్థుల పేర్లను ఒక్కొక్కటిగా పిలుస్తుండగా, చాలా మంది పిల్లలు జై శ్రీరామ్ అంటూ కూర్చోగా, మరికొందరు చేతులు జోడించి జై శ్రీరామ్ అని చెబుతున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫారం ‘ఎక్స్’లో @aaravxelvish ఖతాలో షేర్ చేశారు. ఈ వీడియోకు ఇప్పటివరకూ ఎనిమిది వేలకు పైగా వీక్షణలు దక్కాయి. కొన్ని వందల మంది ఈ వీడియోకు లైక్ చెప్పారు.
ఈ నెల 22న అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం జరగనుంది. ఈ నేపధ్యలో దేశంలో రాముని పేరిట పలు భక్తిపూర్వక కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీనిలో భాగంగానే ఆ స్కూలులో హాజరు సమయంలో ‘జై శ్రీరామ్’ నినాదాన్ని పలుకున్నట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: రామాలయం బంగారు తలుపు ఇదే.. ఫొటో వైరల్!
JAI SHREE RAM ONLY 🔱
— 𝐀𝐀𝐑𝐀𝐕𝕏𝐄𝐋𝐕𝐈𝐒𝐇 (@aaravxelvish) January 8, 2024
School attendance Yes sir , mam ❌ #JaiShreeRam #Hindu #ElvishArmy #RamMandirAyodhya pic.twitter.com/DMocOspPIB
Comments
Please login to add a commentAdd a comment