attendence
-
టీచర్: రామూ.. ‘జై శ్రీరామ్’.. జానకీ.. ‘జై శ్రీ రామ్’..!
సాధారణంగా ఏదైనా పాఠశాలలో ఉపాధ్యాయులు హాజరు వేసేటప్పుడు విద్యార్థులు ‘ఎస్ మేడమ్’ అనో లేదా ‘ఎస్ సార్’ అనో అంటుంటారు. అయితే ఆ పాఠశాలలో ఉపాధ్యాయులు హాజరువేసేటప్పుడు విద్యార్థులు ‘జై శ్రీరామ్’ అని అంటారు. అంటే ఉపాధ్యాయురాలు రామూ అనే పేరును పిలవగానే ఒక కుర్రాడు లేచి నిలుచుని ‘జై శ్రీరామ్’ అంటాడు. అలాగే జానకీ అని టీచర్ పిలవగానే ఒక విద్యార్థిని లేచి ‘జై శ్రీరామ్’ అని అంటుంది. ఈ ఉదంతానికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈ వీడియోలో హాజరు వేస్తున్న టీచర్ విద్యార్థుల పేర్లను పలికినప్పుడు వారు ‘జైశ్రీరాం’ అని అంటుంటారు. దీనికి టీచర్ ఏమీ అభ్యంతరం చెప్పకుండా విద్యార్థులకు హాజరు వేస్తుంటారు. దీనిని అదే క్లాసులోని ఎవరో విద్యార్థి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. విద్యార్థులు ‘జై శ్రీరామ్’ అంటుండగా ఉపాధ్యాయురాలు హాజరు వేయడాన్ని మనం వీడియోలో చూడవచ్చు. ఉపాధ్యాయురాలు క్లాస్‌లోని బ్లాక్‌బోర్డ్ దగ్గర నిలుచుని విద్యార్థుల పేర్లను ఒక్కొక్కటిగా పిలుస్తుండగా, చాలా మంది పిల్లలు జై శ్రీరామ్ అంటూ కూర్చోగా, మరికొందరు చేతులు జోడించి జై శ్రీరామ్ అని చెబుతున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్ఫారం ‘ఎక్స్’లో @aaravxelvish ఖతాలో షేర్ చేశారు. ఈ వీడియోకు ఇప్పటివరకూ ఎనిమిది వేలకు పైగా వీక్షణలు దక్కాయి. కొన్ని వందల మంది ఈ వీడియోకు లైక్ చెప్పారు. ఈ నెల 22న అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం జరగనుంది. ఈ నేపధ్యలో దేశంలో రాముని పేరిట పలు భక్తిపూర్వక కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీనిలో భాగంగానే ఆ స్కూలులో హాజరు సమయంలో ‘జై శ్రీరామ్’ నినాదాన్ని పలుకున్నట్లు సమాచారం. ఇది కూడా చదవండి: రామాలయం బంగారు తలుపు ఇదే.. ఫొటో వైరల్! JAI SHREE RAM ONLY 🔱 School attendance Yes sir , mam ❌ #JaiShreeRam #Hindu #ElvishArmy #RamMandirAyodhya pic.twitter.com/DMocOspPIB — 𝐀𝐀𝐑𝐀𝐕𝕏𝐄𝐋𝐕𝐈𝐒𝐇 (@aaravxelvish) January 8, 2024 -
AP: బడికి డుమ్మా కొడితే ఇంటికే మెసేజ్!
సాక్షి, విశాఖపట్నం: విశాఖ నగరంలోని ప్రకాశరావుపేటకు చెందిన రాకేష్ పొద్దున్నే ఎంచక్కా తయరై, పుస్తకాల బ్యాగు భుజాన వేసుకొని ఠంచన్‌గా బడికి బయలుదేరాడు. కానీ ఉదయం 11గంటలకు ఆ విద్యార్ధి తండ్రి వెంకటరావు సెల్‌ఫోన్‌కు ‘మీ బాబు ఈ రోజు స్కూల్‌కు ఆబ్సెంట్ అయ్యాడు’ అని మెసేజ్ వచ్చింది.తమ కుమారుడు బడికి వెళ్లి చదువుకుంటున్నాడనుకున్న ఆ తల్లిదండ్రులు, ఫోన్‌కు వచ్చిన మెసేజ్‌తో పాఠశాలకు వెళ్లి ఆరా తీశారు. రాకేష్ కాలనీ సమీపంలో తోటి మిత్రులతో ఆడుతూ కనిపించాడు. అక్కడ నుంచి బడికి తీసుకెళ్లి వదిలాడు. స్టూడెంట్స్ అటెండెన్స్ యాప్ హాజరు నమోదు ద్వారా సత్ఫలితాలు కనిపిస్తొన్నాయి. విశాఖ జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాల పరిధిలో 1,397 పాఠశాలలు ఉండగా, ఇందులో 3,54,740 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. అన్ని పాఠశాలల్లో ప్రతి రోజూ స్టూడెంట్ అటెండెన్స్ యాప్ ద్వారా హాజరు నమోదు చేస్తున్నారు. విద్యార్థులు ఉదయం 9.30 గంటలలోపు పాఠశాలకు రాకుంటే తల్లిదండ్రుల సెల్‌ఫోన్‌కు మెసేజ్ వెళ్లేలా ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేసింది. పాఠశాలల్లో 90 శాతం హాజరు నమోదౌతుండటమే కాక, తల్లిదండ్రులు తమ పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ చూపించే అవకాశం ఏర్పడింది. చదువులవైపు మళ్లించేలా.. విద్యార్థులందరినీ బడికి రప్పించి, వారికి విద్యాబుద్ధులు నేరి్పంచాలనే లక్ష్యంతో మొబైల్ యాప్ ద్వారా హాజరు నమోదుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. చదువులకు తోడ్పాటు అందించాలనే సంకల్పంతో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అమలు చేస్తోన్న జగనన్న అమ్మ ఒడి పథకం లబి్ధపొందేందుకు పాఠశాల పనిదినాల్లో 75 శాతం హాజరు ఉండాలనే నిబంధన ఉంది. ఈ నేపథ్యంలో విద్యార్థుల హాజరుశాతం పెంపుతో పాటు, మధ్యాహ్న భోజన పథకం పారదర్శకంగా అమలయ్యేలా స్టూడెంట్స్ అటెండెన్స్ యాప్ హాజరు నమోదుపై విద్యాశాఖాధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. బడికి రాకుంటే ఇంటికే వలంటీర్ ప్రతి రోజూ ఉదయం 9.15 నుంచి 10 గంటల మధ్యలో పాఠశాలల్లో హాజరు నమోదు చేసేలా జిల్లా విద్యాశాఖాధికారులు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. పాఠశాల తల్లిదండ్రులు, క్లాస్ టీచర్, అదే విధంగా గ్రామ/వార్డు వలంటీరు సెల్‌ఫోన్ నంబర్‌ను చైల్డ్ ఇన్ఫోతో కూడిన స్టూడెంట్ అటెండెన్స్ యాప్‌కు అనుసంధానం చేశారు. యాప్‌లో విద్యార్థి హాజరు నమోదు కాకుంటే వెంటనే వారి సెల్‌ఫోన్‌కు మెసేజ్ వెళ్తొంది. వరుసగా మూడు రోజులు విద్యార్థి పాఠశాలకు గైర్హాజర్ అయినట్లైతే సచివాలయ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ద్వారా వలంటీర్‌కు సమాచారం వెళ్తోంది. దీంతో వలంటీరు విద్యార్థి ఇంటికి వెళ్లి , బడికి రాకపోవడానికి గల కారణాలు తెలుసుకునేలా విద్యాశాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ప్రతి రోజూ పర్యవేక్షణ విద్యార్థుల హాజరు నమోదుపై ప్రతి రోజూ పర్యవేక్షణ చేస్తున్నాం. ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాల పరిధిలోని అన్ని పాఠశాలల్లో తప్పనిసరిగా యాప్‌ద్వారానే హాజరువేయాలి. విద్యార్థులను చదువుల వైపు మళ్లించాలనే లక్ష్యంతోనే ప్రభుత్వం ఇటువంటి ఏర్పాట్లు చేసింది. దీని వల్ల పారదర్శకత పెరుగుతుంది. – ఎల్. చంద్రకళ, డీఈవో, ఉమ్మడి విశాఖ జిల్లా హాజరుశాతం పెరిగింది స్టూడెంట్ అటెండెన్స్ యాప్ ద్వారానే విద్యార్థుల హాజరు నమోదు చేస్తున్నాం. దీని వల్ల బడికి రాని విద్యార్థులెవరనేది వెంటనే తెలుసుకునే అవకాశం కలిగింది. ఇలాంటి పర్యవేక్షణతో బడిలో విద్యార్థుల హాజరు శాతం పెరిగింది. ల్లిదండ్రులను కూడా భాగస్వామ్యులను చేయటం ద్వారా మంచి ఫలితాలు కనిపిస్తొన్నాయి. – బాబు, హెచ్ఎం, మధురానగర్ పీఎస్, విశాఖ జిల్లా. -
Telangana: గురుకులాల్లో హాజరు.. 57శాతమే
సాక్షి, హైదరాబాద్: గురుకుల పాఠశాలల్లో విద్యార్థుల హాజరు అంతంతమాత్రంగానే ఉంది. ఈ విద్యాసంస్థలు పునఃప్రారంభమై 12 రోజులు గడిచినా ఇప్పటికీ సగం మంది విద్యార్థులు గైర్హాజరులోనే ఉన్నారు. కోవిడ్ నేపథ్యంలో గతేడాది మార్చిలో మూతబడ్డ గురుకుల విద్యా సంస్థలు.. సుదీర్ఘ విరామం తర్వాత అక్టోబర్ 21న పూర్తి స్థాయిలో ప్రారంభమయ్యాయి. 5వ తరగతి నుంచి డిగ్రీ వరకు అన్ని తరగతుల్లో ప్రత్యక్ష బోధన షురూ అయినా హాజరు శాతం ఆశించిన స్థాయికి చేరుకోలేదు. ఎస్సీ గురుకుల సొసైటీ (టీఎస్‌డబ్ల్యూఆర్ ఈఐఎస్) పరిధిలోని 239 విద్యా సంస్థల్లో ఐదో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు 1.38 లక్షల మంది విద్యార్థులుండగా, ఈనెల 2 నాటికి 57.46 శాతం మంది మాత్రమే ప్రత్యక్ష తరగతులకు హాజరయ్యారు. అలాగే ఇతర గురుకుల సొసైటీల పరిధిలోనూ హాజరు శాతం ఇలాగే ఉన్నట్లు ఆయా సొసైటీల అధికారులు చెబుతున్నారు. 2వ తేదీ నాటికి 57.46 శాతం మందే.. ప్రత్యక్ష తరగతుల హాజరుపై గురుకుల విద్యా ర్థులు, వారి తల్లిదండ్రులు ఇప్పటికీ ఎలాంటి నిర్ణ యం తీసుకోలేనట్లు తెలుస్తోంది. గురుకుల పాఠ శాలల పునఃప్రారంభంపై విద్యార్థులు, వారి తల్లి దండ్రులకు 20వ తేదీనే ఫోన్లు, వాట్సాప్, ఎస్ఎం ఎస్‌ల ద్వారా సమాచారాన్ని ఇచ్చారు. కానీ తొలి రోజు 6% విద్యార్థులే పాఠశాలలకు హాజరయ్యా రు. అనంతరం గైర్హాజరవుతున్న విద్యార్థులతో క్లాస్ టీచర్లు నేరుగా ఫోనులో సంప్రదించడం, వారి తల్లిదండ్రులతో మాట్లాడి అవగాహన కల్పించే చర్యలు చేపడుతున్నారు. అయినా హాజరు శాతం అంతంతమాత్రంగానే ఉంది. ఈనెల 2 నాటికి 57.46% మంది మాత్రమే హాజరయ్యారు. ఈ క్రమంలో విద్యార్థుల హాజరును పెంచి నూరుశాతం ప్రత్యక్ష బోధనను విజయవంతంగా సాగించాలని గురుకుల సొసైటీలు క్షేత్రస్థాయిలోని రీజినల్ కో–ఆర్డినేటర్లు, జిల్లా సంక్షేమాధికారులు, గురుకుల విద్యా సంస్థల ప్రిన్స్‌పాల్స్‌కు, టీచర్లకు లిఖితపూర్వక ఆదేశాలు పంపాయి. గైర్హాజరవుతున్న విద్యార్థులు, తల్లిదం డ్రులతో ప్రత్యేక చొరవ తీసుకుని అవగాహన కల్పించాలని, విద్యార్థి పాఠశాల/ కళాశాలకు వచ్చేంతవరకు ఈమేరకు చర్యలు తీసుకోవాలని సూచించాయి. ప్రిన్స్పాళ్లు, టీచర్లకు ఎస్ఎంఎస్లు, వాట్సాప్‌ల ద్వారా సమాచారాన్ని సైతం చేరవేశాయి. రోజువారీగా హాజరు తీరును ఎప్పటికప్పుడు ప్రిన్సిపాళ్లు, రీజినల్ కోఆర్డినేటర్లకు బాధ్యతతో పంపాలని సూచించాయి. -
Telangana: తొలిరోజున విద్యార్థుల హాజరు నామమాత్రమే..!
సాక్షి, హైదరాబాద్/ నెట్వర్క్: రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థలు తిరిగి ప్రారంభమైనా.. తొలిరోజున విద్యార్థుల హాజరు నామమాత్రంగా నమోదైంది. బుధవారం చాలావరకు ప్రభుత్వ, ప్రైవేటు బడులన్నీ బోసిపోయి కనిపించాయి. విద్యార్థులను బడులకు రప్పించేందుకు విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు ప్రయత్నించారు. జిల్లా, రాష్ట్రస్థాయిలో అధికారులు కూడా రంగంలోకి దిగారు. విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్వయంగా కొన్ని ప్రాంతాల్లో పర్యటించారు. కానీ విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులు కూడా పెద్దగా ఆసక్తి చూపని పరిస్థితి కనిపించింది. ఇంకొన్ని రోజులు వేచిచూద్దామని తల్లిదండ్రులు అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం. ప్రైవేటు విద్యాసంస్థల్లో ప్రత్యక్ష బోధనకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు. ప్రభుత్వం ఆన్లైన్ బోధనకు వెసులుబాటు ఇవ్వడంతో.. పాఠశాలలతో పాటు విద్యార్థులు కూడా ఆన్లైన్నే ఆప్షన్‌గా ఎంచుకున్నారు. ఫలితంగా ప్రైవేటు సంస్థల్లో విద్యార్థుల హాజరు తక్కువగా నమోదైంది. బుధవారమే మొదటి రోజు కావడంతో రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్లలో విద్యార్థుల హాజరు తక్కువగా ఉందని, కొద్దిరోజుల్లోనే పుంజుకుంటుందని విద్యాశాఖ అధికారులు చెప్తున్నారు. సగటున 22 శాతం మించలేదు గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లు మినహా అన్ని విద్యాసంస్థలను పునః ప్రారంభించారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం తొలిరోజున ప్రభుత్వ స్కూళ్లలో 27.45 శాతం, ప్రైవేటు బడుల్లో 18.35 శాతం విద్యార్థుల హాజరునమోదైంది. మొత్తంగా సగటు హాజరుశాతం 22కు మించలేదని అధికార వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో 405 ఇంటర్ కాలేజీల్లో ఫస్టియర్ విద్యార్థులు 97,520 మందికిగాను 16,907 మంది.. సెకండియర్‌లో 84,038 మందికిగాను 12,687 మంది హాజరయ్యారు. సగటున 15 శాతమే హాజరు నమోదైంది. భయం భయంగానే.. పట్టణ ప్రాంతాలతో పోలిస్తే.. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులు ఎక్కువ మంది బడికి వచ్చారు. గ్రామాల్లో తల్లిదండ్రుల నుంచి పెద్దగా అభ్యంతరాలు కన్పించలేదని ఉపాధ్యాయులు చెప్తున్నారు. అయితే సీజనల్ జ్వరాలు, ఇతర అనారోగ్యం ఉన్నవారిని బడులకు రాకుండా చూశారు. వ్యవసాయ పనులకు వెళ్లే విద్యార్థుల్లో చాలా వరకు పాఠశాలకు రావడానికి ఆసక్తి చూపలేదు. పట్టణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థుల హాజరు తక్కువగా ఉంది. తల్లిదండ్రులు వేచి చూసే ధోరణి అవలంబిస్తున్నారని, క్రమంగా హాజరు పుంజుకుంటుందని అధికారులు చెప్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రైవేటు స్కూళ్లలో హాజరు కాస్త మెరుగ్గా ఉంది. కానీ సమీపంలోని పట్టణాలు, వేరే ఊర్లలో చదువుతున్న విద్యార్థులు మాత్రం వెళ్లలేదు. పాఠశాలల వాహనాలు గ్రామాలకు వచ్చినా తల్లిదండ్రులు పిల్లలను పంపలేదు. పట్టణ, నగర ప్రాంతాల్లోని ప్రైవేటు స్కూళ్లలో హాజరుశాతం తక్కువగా కనిపించింది. ఏడాదిన్నరగా బడులు లేకపోవడం, ఉపాధి అవకాశాలు సన్నగిల్లడంతో చాలామంది తల్లిదండ్రులు సొంతూర్లకు వెళ్లారు. వారు ఇప్పటికిప్పుడు పట్టణాలకు వచ్చే పరిస్థితి లేదు. దానికితోడు ఆన్లైన్ బోధన ఉండటంతో.. దానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. కార్పొరేట్ విద్యాసంస్థల్లో చాలా వరకు ఆన్లైన్ బోధనకే ప్రాధాన్యం ఇస్తున్నాయి. చిన్నగదుల్లో ప్రత్యక్ష బోధన వల్ల సమస్యలు రావొచ్చనే ఆలోచనతో ఉన్నాయి. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా కొంతకాలం పరిస్థితిని గమనించాకే స్కూళ్లకు పంపాలని భావిస్తున్నారు. బుధవారం స్కూళ్లు, విద్యార్థుల పరిస్థితి ఇదీ.. ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో మొత్తం విద్యార్థులు: 52,22,174 తొలిరోజు హాజరైన విద్యార్థుల సంఖ్య: 11,37,095 (21.77 శాతం) ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థులు: 19,66,234 హాజరైన విద్యార్థులు: 5,39,674 (27.45 శాతం) ప్రైవేటు స్కూళ్లలో విద్యార్థులు: 32,55,940 హాజరైన విద్యార్థులు: 5,97,421 (18.35 శాతం) బడికి రెడీ.. సైకిలే రిపేర్.. ఖమ్మం జిల్లా కేంద్రంలో పాఠశాలకు వెళ్లేందుకు బయలుదేరిన విద్యార్థి ఇతను. సైకిల్ మొరాయించడంతో మధ్యలో ఆగి మరమ్మతు చేయించుకున్నాడు. చిన్న పిల్లలు రాలే.. ఖమ్మం జిల్లా కేంద్రంలోని శాంతినగర్‌లో ఉన్న అంగన్వాడీ కేంద్రం ఇది. బుధవారం ఈ కేంద్రాన్ని తెరిచినా.. పిల్లలెవరూ రాక టీచర్ ఖాళీగా కూర్చున్నారు. బడికి కొందరు.. చెత్త ఏరుతున్న మరికొందరు ప్రత్యక్ష బోధన ప్రారంభం కావడంతో.. కొందరు పిల్లలు బడిబాట పట్టినా, మరికొందరు పనులకు వెళ్లారు. భువనగిరి పట్టణంలో కొందరు విద్యార్థులు పాఠశాలకు వెళ్తుండగా.. ఆ ప్రాంతంలోనే మరికొందరు పిల్లలు చెత్త పేపర్లు సేకరిస్తున్న దృశ్యమిది. తొలిరోజే.. తృటిలో తప్పిన ప్రమాదం నిర్మల్ జిల్లా ఖానాపూర్లోని తిమ్మాపూర్ అంగన్వాడీ కేంద్రంలో తొలిరోజు అపశ్రుతి చోటు చేసుకుంది. ఇక్కడి స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆవరణలో శిథిలావస్థలో ఉన్న పాత గదుల్లో కొన్నేళ్లుగా అంగన్వాడీ కేంద్రం కొనసాగుతోంది. బుధవారం ఈ కేంద్రానికి వచ్చిన గర్భిణులు, బాలింతలకు అంగన్వాడీ హెల్పర్ మౌనిక సరుకులు అందజేస్తుండగా.. భవనంపై చెట్టుకొమ్మలు విరిగిపడ్డాయి. ఒక్కసారిగా అందరూ బయటికి పరుగెత్తారు. భవనం పాక్షికంగా దెబ్బతింది. ఇద్దరు విద్యార్థులు.. పది మంది లెక్చరర్లు మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 350 మంది విద్యార్థులు ఉండగా.. బుధవారం ఇద్దరు మాత్రమే హాజరయ్యారు. మరోవైపు కాలేజీలోని పది మంది లెక్చరర్లు విధులకు వచ్చారు. మంగళ హారతులిచ్చి.. మెదక్ జిల్లా కుర్తివాడ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు మంగళ హారతులతో స్వాగతం పలుకుతున్న ఉపాధ్యాయులు వీరు. విద్యార్థులను శుభ సూచకంతో స్వాగతించాలని ఇలా చేసినట్టు వారు చెప్పారు. బురదలో నడుచుకుంటూ.. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులోని బాలుర ఉన్నత పాఠశాల వద్ద బురదలో నడుచుకుంటూ వెళుతున్న విద్యార్థులు. పాఠశాలకు వెళ్లే దారి సరిగా లేకపోవడంతో ఇటీవలి వర్షాలకు నీళ్లు నిలిచి బురదగా మారింది. డప్పులతో విద్యార్థులకు స్వాగతం చాలా రోజుల తర్వాత పాఠశాలలు తిరిగి తెరుచుకోవడంతో విద్యార్థులకు డప్పు చప్పుళ్లతో స్వాగతం పలుకుతున్న దృశ్యమిది. మెదక్ జిల్లా రామాయంపేట మండలం రాయిలాపూర్ పాఠశాలలో అక్కడి సర్పంచ్ నర్సాగౌడ్, ఉపాధ్యాయులు ఇలా స్వాగతం పలికారు. గదులు లేక.. వరండాలో చదువులు ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో వరండాలో కూర్చుని చదువుకుంటున్న విద్యార్థులు వీరు. మొత్తంగా 142 మంది విద్యార్థులు ఉండగా.. మూడే తరగతి గదులు ఉన్నాయి. దీనితో 7, 8వ తరగతుల విద్యార్థులను వరండాలో కూర్చోబెట్టి పాఠాలు చెప్తున్నారు. బడి కూలిపోయేలా ఉంది సార్.. మంత్రి కేటీఆర్‌కు జనగామ ఉపాధ్యాయుల ట్వీట్ తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి ఆదేశాలు! జనగామ: జనగామ జిల్లా కేంద్రంలో సిద్దిపేట రోడ్డులో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాల శిథిలావస్థకు చేరింది. 160 మంది విద్యార్థులున్న ఈ పాఠశాలలో తరగతి గదుల పైకప్పు దెబ్బతింది. ఇటీవలి వర్షాలతో గోడలు తడిసి, గదుల్లోకి నీరు వస్తోంది. ఉపాధ్యాయులు దీనిపై మంత్రి కేటీఆర్‌కు ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేశారు. ‘‘జనగామలో బాలికల ఉన్నత పాఠశాలలో 160 మంది విద్యార్థులు ఉన్నారు. తరగతి గదులతోపాటు వరండా పైకప్పు కూలిపోవడానికి సిద్ధంగా ఉంది. బడి కోసం కొత్త భవన నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదన రెండేళ్లుగా పెండింగ్‌లో ఉంది. విద్యార్థుల ప్రాణాలను దృష్టిలో ఉంచుకుని తగిన చర్యలు తీసుకోవాలి’’ అని కోరారు. దీనిపై స్పందించిన మంత్రి కేటీఆర్.. పాఠశాల తరలింపు, కొత్త భవన నిర్మాణానికి సంబంధించి చర్యలు చేపట్టాలని జిల్లా అధికారులను ఆదేశించినట్టు తెలిసింది. బడిలో విద్యాశాఖ కమిషనర్.. బీబీనగర్, భూదాన్ పోచంపల్లి: పాఠశాలలు పునః ప్రారంభం అవుతుండటంతో విద్యా శాఖ కమిషనర్ దేవసేన.. బుధవారం క్షేత్రస్థాయిలో పర్యటించి స్కూళ్లను సందర్శించారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలంలోని రాయరావుపేట, జామీలపేట, పడమటి సోమవారం గ్రామాల్లో ప్రభుత్వ స్కూళ్లు, అంగన్వాడీ కేంద్రాలను, భూదాన్ పోచంపల్లి పట్టణంలోని మోడల్ స్కూల్‌ను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడారు. వారితో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. కోవిడ్ నిబంధనలను సక్రమంగా పాటించాలని ఉపాధ్యాయులు, విద్యార్థులకు సూచించారు. -
సభ్యుల గైర్హాజరుపై వెంకయ్య ఆగ్రహం
న్యూఢిల్లీ: రాజ్యసభలో హాజరుశాతం తక్కువగా ఉండటంపై రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. కీలకమైన జాతీయ వెనుకబడిన వర్గాల కమిషన్ (ఎన్సీబీసీ)కు రాజ్యాంగ హోదా కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లును ఆమోదించే సమయంలో సభ్యులు గైర్హాజరవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ రాజ్యాంగ (123వ సవరణ) బిల్లును సోమవారం ఆమోదించిన సమయంలో 156 మంది సభ్యులే సభలో ఉన్నారు. ‘చారిత్రక బిల్లును సోమవారం ఏకగ్రీవంగా ఆమోదించాం. కానీ సభ మొత్తం సభ్యుల సంఖ్య ఎంత? ఎంతమంది హాజరయ్యారు? 245 మంది సభ్యులకు గాను 156 మందే హాజరయ్యారు. ఒకరిద్దరు తగ్గినా బిల్లు పాసయ్యేది కాదు. అతి తక్కువ మెజారిటీతో బిల్లు ఆమోదం పొందింది’ అని అన్నారు. ఇలాంటి కీలక బిల్లుల ఆమోదం సమయంలో సభ్యులు తప్పకుండా హాజరయ్యేలా రాజకీయ పార్టీలు విప్‌లు జారీ చేయాలని వెంకయ్య అన్నారు. -
విద్యార్థుల హాజరుకు ఇక బయోమెట్రిక్
సాక్షి, హైదరాబాద్ : బయోమెట్రిక్ పద్ధతిలో విద్యా ర్థుల హాజరు నమోదుకు రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో త్వరలో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ (టీఎస్టీఎస్) సంస్థ రూపొందించిన ‘అబాస్’ సాఫ్ట్వేర్ ప్రోగ్రాంను ఇందుకు ఉపయోగించ నున్నారు. ఆధార్ అనుసంధానం ద్వారా బయో మెట్రిక్ పద్ధతిలో విద్యార్థుల హాజరును నమోదు చేసేందుకు పాఠశాలల్లో ప్రత్యేక యంత్రాలను ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రంలోని పదివేల పాఠ శాలల్లో ఈ విధానాన్ని అమలు చేసేందుకు విద్యా శాఖ సన్నాహాలు చేస్తోంది. 4 సెకండ్ల వ్యవధిలో ఓ విద్యార్థి హాజరును ఈ సాఫ్ట్వేర్ నమోదు చేయనుంది. పాఠశాల ప్రధానోపాధ్యాయులు, జిల్లా విద్యాధికారి, రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ అధికారులు తమ కంప్యూటర్లు/లాప్టాప్ తెరల మీద విద్యార్థుల హాజరుకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటి కప్పుడు తెలుసుకోవడానికి దీని ద్వారా వీలు కలగ నుంది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతంపై విశ్లేషణలు జరపడంతో పాటు మధ్యాహ్న భోజనం పథకాన్ని పారదర్శకంగా అమలు చేసేందుకు ఈ సమాచారం ఉపయోగపడనుంది. -
ఇంట్లో కూర్చొని బీటెక్ చదువులా?
సాక్షి, హైదరాబాద్: తగినంత హాజరు లేదన్న కారణంతో తమను పరీక్షలకు అనుమతించడం లేదంటూ కోర్టును ఆశ్రయించిన విద్యార్థులకు ఉమ్మడి హైకోర్టు చీవాట్లు పెట్టింది. నిర్దేశించిన మేర హాజరు శాతం లేకుంటే పరీక్షలకు అనుమతించాలంటూ తామెలా విశ్వవిద్యాలయాన్ని ఆదేశించగలమని పేర్కొంది. తరగతులకు వెళ్లకుండా ఇంట్లో కూర్చొని బీటెక్ చదువుతామంటే ఎలా అని ప్రశ్నించింది. అలాంటి చదువులు ఎందుకూ పనికి రావని మందలించింది. పరీక్ష రాయకపోతే మరోసారి అదే తరగతి చదవాల్సి ఉంటుందని, అందుకు సిగ్గుపడాల్సిన అవసరమేమీ లేదని, మళ్లీ చదివితే గట్టి పునాది ఏర్పడుతుందని విద్యార్థులకు చెప్పింది. నిబంధనల మేర 75 శాతం హాజరు ఉండాలని, 65–75 శాతం మధ్య హాజరున్న పిటిషనర్లకు మినహాయింపు విషయమై 10 రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని వర్సిటీ అకడమిక్ కమిటీని ఆదేశించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలిల ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. అప్పుడిచ్చారని... బీటెక్ మూడో సంవత్సరం రెండో సెమిస్టర్ పరీక్ష రాసిన తమను తగినంత హాజరు శాతం లేదంటూ తదుపరి సంవత్సరానికి పంపకపోవడంతోపాటు రెండో సెమిస్టర్ పరీక్ష ఫలితాలూ వెల్లడించడం లేదని పలువురు జేఎన్టీయూ, హైదరాబాద్ విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన సింగిల్ జడ్జి, హైకోర్టును ఆశ్రయించిన విద్యార్థులను తదుపరి సంవత్సరానికి అనుమతించాలని వర్సిటీని ఆదేశించారు. ఈ ఆదేశాలను సవాలు చేస్తూ ధర్మాసనం ముందు వర్సిటీ రిజిస్ట్రార్ అప్పీల్ దాఖలు చేయగా.. ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. వర్సిటీ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. నిబంధనల ప్రకారం తగినంత హాజరు లేని విద్యార్థులను తదుపరి సంవత్సరానికి అనుమతించడం సాధ్యం కాదని కోర్టుకు తెలిపారు. ఈ విషయంలో సుప్రీం, హైకోర్టుల తీర్పులూ ఉన్నాయన్నారు. ధర్మాసనం స్పందిస్తూ.. హాజరు మినహాయింపులో తుది నిర్ణయం వర్సిటీదేనని స్పష్టం చేసింది. -
రేయ్.. ఇక ప్రజెంట్ సార్ అనొద్దండర్రా!
నగరి (చిత్తూరు జిల్లా) : పాఠశాలల్లో విద్యార్థుల హాజరును లెక్కించడానికి ఇకపై ‘ప్రెజెంట్ సార్../ఎస్ సార్’ అని అనరాదు. ఇందుకు బదులుగా ‘మరుగుదొడ్డి కట్టాము సార్../ మరుగుదొడ్డి కట్టలేదు సార్’ అని మాత్రమే విద్యార్థులతో చెప్పించాలి. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలో లక్ష్యం చేరుకునేందుకు ప్రభుత్వం ఈ విధానాన్ని కూడా వాడుకోవాలని నిర్ణయించింది. ఇంట్లో మరుగుదొడ్డి ఉన్న విద్యార్థులు ‘ప్రెజెంట్ సార్’కు బదులు ‘కట్టాము’ అని, ఇంట్లో మరుగుదొడ్డి లేని విద్యార్థులు ‘కట్టలేదు’ అని చెప్పాల్సి ఉంటుంది. ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ కమిషన్ ప్రొసీడింగ్స్ నంబరు 448 మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల హెచ్ఎంలకు ఈ ఉత్తర్వులు అందాయి. ఈ ఉత్తర్వులు తప్పనిసరిగా పాటించాలని చిత్తూరు జిల్లా డీఈవో పాండురంగ స్వామి పేర్కొన్నారు. అయితే ఈ అంశంపై ఉపాధ్యాయుల నుంచి, విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇది విద్యార్థుల మనోభావాలను దెబ్బతీసే అంశం అని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నత పాఠశాలల్లో చదివే పేద విద్యార్థినులకు ఈ అంశం ఇబ్బందికరమని, తోటి విద్యార్థుల మధ్య వారు కుంగిపోతారంటున్నారు. ఈ పద్ధతి బాగోలేదు.. అన్ని ఇళ్లలోనూ వ్యక్తిగత మరుగుదొడ్లు ఉండాలనేది మంచి నిర్ణయమే. ఈ విషయంలో ఎవరికీ అభ్యంతరం లేదు. అయితే దీనిని అమలు చేయించడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు విమర్శలకు తావిస్తున్నాయి. ఇప్పటికే పశు వైద్యులను పూర్తి సమయం ఈ పని కోసమే వినియోగిస్తున్నారు. ఉపాధ్యాయులనూ భాగస్వాములను చేశారు. మరుగుదొడ్ల నిర్మాణం విషయంలో పెద్దలకు అవగాహన కలిగించడానికి పలు మార్గాలు ఉన్నాయి. వాటన్నింటినీ వదిలిపెట్టి పిల్లలను మానసికంగా ఇబ్బంది పెట్టడం ద్వారా పెద్దల్లో మార్పు తేవాలనుకోవడం సరికాదని మనస్తత్వ శాస్త్రవేత్తలు అంటున్నారు. ‘హాజరు వేసే సమయంలో విద్యార్థులను మీ ఇంట్లో మరుగుదొడ్డి కట్టారా, లేదా అని రోజూ అడిగితే గ్రామాల్లో పలు సమస్యలు తలెత్తుతాయి. కొందరు విద్యార్థులు ఒత్తిడికి గురయ్యి.. పాఠశాలకు రావడం మానేసే ప్రమాదం ఉంది. ఇది మంచి పద్ధతి కాదు. ఈ విషయంలో విద్యార్థుల తల్లిదండ్రులకు రెవిన్యూ, మున్సిపల్, పంచాయతీ అధికారుల ద్వారా అవగాహన కల్పించాలి. అంతేకాని ఉపాధ్యాయులు, విద్యార్థులపై రుద్దడం తగద’ని చిత్తూరు జిల్లా యూటీఎఫ్ కార్యదర్శి మునిరత్నం ఆందోళన వ్యక్తం చేశారు. -
ఇక పోలీసులకు ఆధార్ ఆధారిత హాజరు
సాక్షి, సిటీబ్యూరో: సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకోవడంలో ముందుండే నగర పోలీసు విభాగం మరో వినూత్న విధానానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకు నేరాల నియంత్రణ, కేసుల పరిష్కారం, నిందితుల్ని న్యాయస్థానంలో దోషులుగా నిరూపించేందుకే టెక్నాలజీని వాడుకుంటున్న సిటీ పోలీస్ అంతర్గత పరిపాలన కోసమూ దానిని వినయోగిస్తోంది. ప్రస్తుతం సిబ్బంది హాజరు నమోదు కోసం ఆధార్ ఆధారిత విధానాన్ని పూర్తిస్థాయిలో అమలులోకి తీసుకువచ్చారు. ఎన్రోల్మెంట్ సమస్యలు ఉన్న వారి కోసం ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అటెండెన్స్ రిజిస్టర్లకు స్వస్తి చెప్తూ... నగర పోలీసు విభాగం సిబ్బంది హాజరును లెక్కించేందుకు హాజరుపట్టీలు, రిజిస్టర్లపై ఆధారపడేది. ఇందుకుగాను ఆయా ఠాణాలతో పాటు విభాగాధిపతుల వద్ద ఉండే రిజిస్టర్లో సిబ్బంది ప్రతిరోజూ సంతకాలు చేసేవారు. అయితే కొన్ని సందర్భాల్లో విధులకు గైర్హాజరైన వారు సైతం ఆ తర్వాతి రోజో, విధులకు వచ్చిన రోజో పాత తేదీల్లో సైతం సంతకాలు చేసే వారు. ఇలాంటి అవకతవకలను గుర్తించిన ఉన్నతాధికారులు రిజిస్టర్లు/హాజరుపట్టీల విధానానికి స్వస్తి పలుకుతూ బయోమెట్రిక్ మిషన్లను అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రయోగాత్మకంగా బషీర్‌బాగ్‌లోని కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అధికారులు లోపాలను గుర్తించారు. వీటిని అధిగమించిన తర్వాత అన్ని విభాగాల కార్యాలయాలతో పాటు డీసీపీ, ఏసీపీ ఆఫీసులు, ట్రాఫిక్–శాంతిభద్రతల విభాగం ఠాణాల్లోనూ అందుబాటులోకి తెచ్చారు. ఆఖరి రోజున ఎస్సెమ్మెస్‌లు... ఈ బయోమెట్రిక్ హాజరును నగర పోలీసు కమిషనరేట్‌లోని ఐటీ సెల్ పర్యవేక్షిస్తోంది. ప్రతి నెలా ఆఖరి రోజున సిబ్బందికి ఎస్సెమ్మెస్‌లు పంపే విధానానికి ఆగస్టు నుంచి శ్రీకారం చుట్టారు. ఆ నెలలో పంచ్‌లు మిస్ అయిన, అసలు పంచ్‌లే చేయని రోజు లకు సంబంధించిన వివరాలు సూచి స్తూ ఈ ఎస్సెమ్మెస్‌లు పంపిస్తున్నారు. దీంతో ఆయా సిబ్బంది, అధికారులు ఆ నెల్లో అధికారికంగా ఎన్ని రోజులు హాజరయ్యారు/పంచ్ చేశారనే దానిపై పారదర్శకతకు ఆస్కారం ఏర్పడింది. లోకల్ నెట్‌వర్క్‌కు భిన్నంగా... సాధారణంగా బయోమెట్రిక్ హాజరు విధానంలో నెట్వర్కింగ్ మొత్తం స్థానికంగా ఉంటుంది. ఆయా కార్యాలయాలు లేదా కమిషనరేట్ మొత్తాన్ని కలిపి నెట్వర్క్ చేస్తుంటారు. అక్కడ పని చేసే సిబ్బంది నుంచి వేలిముద్రలు తీసుకుని, సర్వర్ నిక్షిప్తం చేయడం ద్వారా బయోమెట్రిక్ మిషన్లకు అనుసంధానిస్తారు. ఈ డేటాబేస్ ఆధారంగానే బయోమెట్రిక్ బేస్డ్ హాజరు వ్యవస్థ పని చేస్తుంది. అయితే నగర పోలీసు కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన బయోమెట్రిక్ వ్యవస్థను నేరుగా ఆధార్ డేటాబేస్‌తో అనుసంధానించారు. ఫలితంగా ప్రత్యేక డేటాబేస్ అవసరం లేకుండానే నేరుగా ఆయా వ్యక్తుల హాజరు తీసుకునే అవకాశం ఏర్పడింది. ఈ విధానంలో ఎలాంటి లోపాలు, అవకతవకలకు ఆస్కారం లేకపోవడంతో పూర్తిస్థాయిలో అమలుకు చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా కొందరు పోలీసు సిబ్బందికి ఆధార్ ఎన్రోల్మెంట్ లేదని, మరికొందరికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయన్న విషయాలు వెలుగులోకి రావడంతో వీటిని సరిచేసేందుకు గాను కమిషనరేట్ గ్రౌండ్‌ఫ్లోర్‌లో ప్రత్యేక ఆధార్ నమోదు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. -
ఉద్దేశపూర్వకంగా వేధిస్తున్న ప్రిన్సిపాల్
హన్మకొండ అర్బన్ : హన్మకొండలోని ప్రభుత్వ బీఈడీ కళాశాల ప్రిన్సిపాల్ తమను ఉద్దేశపూర్వకంగా వేధింపులకు గురిచేస్తున్నారని ఆ కళాశాల విద్యార్థినులు సుమారు 70మంది సోమవారం జిల్లా కలెక్టర్ వాకాటి కరుణకు ఫిర్యాదు చేశారు. వార్షిక పరీక్షల ఫీజు గడువు తేదీకి ఒక్క రోజు ముందు అటెండెన్స్ సరిపోలేదని చెప్పి తమను ఫీజు చెల్లించేందుకు అనర్హులన్నారని తెలిపారు. ప్రిన్సిపాల్ సుమారు నెల రోజుల పాటు కాలేజీకి రాలేదని, బయోమెట్రిక్ యంత్రం పాడైపోగా హాజరు నమోదు చేయలేదన్నారు. ఈ పరిస్థితుల్లోనూ తమకు హాజరు లేదనడం సరికాదన్నారు. దీన్ని అర్థం చేసుకొని ఫీజు చెల్లించి పరీక్షలు రాసే అవకాశం కల్పించాలని, ఉద్దేశపూర్వకంగా వేధింపులకు గురిచేస్తున్న ప్రిన్సిపాల్‌పై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు. కలెక్టర్ స్పందిస్తూ తగిన చర్యలు తీసుకుంటామని, విద్యార్థులు ఆందోళన చెందొద్దని తెలిపారు. కాగా ఈ విషయంలో హన్మకొండ పోలీస్‌స్టేçÙన్లో ఫిర్యాదు చేసినట్లు విద్యార్థినులు తెలిపారు. -
పంచాయతీల్లోనూ బయోమెట్రిక్
జిల్లాలో విడతల వారీగా అమలు – గ్రామ స్థాయి అధికారులందరికీ పంచాయతీ కార్యాలయంలోనే హాజరు – ఉపాధ్యాయులకూ అక్కడే.. – 369 పంచాయతీలు లక్ష్యం – ఇప్పటికే 60 చోట్ల ఏర్పాట్లు పూర్తి కర్నూలు(సిటీ): రాష్ట్ర ప్రభుత్వం గ్రామ స్థాయిలోనూ బయోమెట్రిక్ హాజరుకు శ్రీకారం చుడుతోంది. ఇప్పటి వరకు ఈ విధానం మండల స్థాయికే పరిమితం. తాజా ఉత్తర్వులతో పంచాయతీ పరిధిలోని ఉద్యోగులంతా పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేస్తున్న బయోమెట్రిక్ యంత్రంలో హాజరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. లేని పక్షంలో గైర్హాజరుగా భావించి ఆ రోజు వేతనం కోత వేయనున్నట్లు అధికార వర్గాల ద్వారా తెలిసింది. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగుల్లో ఈ బయోమెట్రిక్ విధానంపై తీవ్ర వ్యతిరేఖత ఉన్నా.. ప్రభుత్వం లెక్క చేయకుండా గ్రామ స్థాయిలోనూ ఏర్పాటు చేస్తుండటం చర్చనీయాంశంగా మారింది. 369 పంచాయతీల్లో అమలు జిల్లాలో 889 గ్రామ పంచాయతీలు.. 1,498 గ్రామాలు ఉన్నాయి. గ్రామస్థాయిలో పనిచేసే అన్ని శాఖల అధికారులను ఒకే తాటిపైకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం బయోమెట్రిక్‌ను తెరపైకి తీసుకొస్తోంది. రాష్ట్ర వ్యాప్త కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 369 గ్రామ పంచాయతీలను బయోమెట్రిక్ అమలుకు ఎంపిక చేశారు. మొదటి విడతగా ఇప్పటికే 60 గ్రామ పంచాయతీల్లో బయోమెట్రిక్ యంత్రాలను ఏర్పాటు చేశారు. నేడో రేపో మరో 169 గ్రామ పంచాయతీల్లో ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. మొత్తంగా ఈ ఏడాది 369 గ్రామ పంచాయతీల్లో ఈ విధానం అమలు చేయాలని లక్ష్యంగా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. గ్రామ పంచాయతీలను డిజిటల్‌గా తీర్చిదిద్దేందుకు జిల్లాలోని దాదాపు అన్ని పంచాయతీలకు కంప్యూటర్లు అందజేశారు. ప్రస్తుతం ఈ బయోమెట్రిక్ విధానానికి ఆ కంప్యూటర్లు ఉపయోగపడనున్నాయి. వీటిని అదనంగా వేలిముద్రలు వేసేందుకు అవసరమైన పరికరాలను మాత్రమే పంపిణీ చేస్తున్నారు. అయితే కొన్నిచోట్ల ఈ పరికరాలు పనిచేయకపోవడంతో కొంత జాప్యం జరుగుతుండటంపై ఆయా మండల అధికారులపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. అధికారులందరికీ అక్కడే హాజరు పంచాయతీల్లో ఏర్పాటు చేస్తున్న బయోమెట్రిక్ యంత్రంలో అక్కడ పని చేస్తున్న వీఆర్వో, పంచాయతీ కార్యదర్శి, పారిశుద్ధ్య కార్మికులు, ఇతర పంచాయతీ సిబ్బంది.. ఆయా గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న టీచర్లు సైతం పంచాయతీ కార్యాలయానికి వచ్చి హాజరు తీసుకోవాల్సి ఉంది. అదేవిధంగా ఆయా పంచాయతీల పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, దేవాదాయ శాఖ, అంగన్వాడీ టీచర్లు, విద్యుత్ శాఖ లైన్‌మన్ కూడా పంచాయతీలోనే బయోమెట్రిక్ హాజరు తీసుకోవాల్సి రానుంది. -
ఓపిక లేకున్నా ఉద్యోగానికి ఎందుకెళ్తారో తెలుసా?
లండన్: ఆరోగ్యం బాగోలేకపోయినా, ఒంట్లో సత్తువ లేకున్నా కొన్ని భయాల కారణంగానే నేటి తరం ఉద్యోగాలకు వెళ్తున్నారని ఓ అధ్యయనం తెలిపింది. అందులో ప్రధాన కారణాలుగా ఉద్యోగాలకు భారీ స్థాయిలో డిమాండ్ ఉండటం, ఒత్తిడి, అభద్రతా భావం, వ్యక్తిగతంగా ఆర్థిక సమస్యలు వారిని విధుల నిర్వహణకు గైర్హాజరు కాకుండా చేస్తాయట. అసలు కొంతమంది వ్యక్తులు చిన్న జబ్బులు చేసినా, రోగంతో బాధపడుతున్నా అవన్నీ పట్టించుకోకుండా ఎందుకు ఉద్యోగానికి వెళుతుంటారో అని యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ ఆంగ్లియా అనే విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ మారియెల్లా మిరాగిలియా ప్రత్యేక అధ్యయనం చేశారు. ఈ అధ్యయనంలో భాగంగా పై మూడు కారణాలు గుర్తించిన ఆయన ఫలితాలు కూడా వివరించారు. 'ఆరోగ్యం బాగాలేనప్పుడు పనిచేస్తుండటం వల్ల ఏ పని చేస్తున్నామో దానిపై ప్రతికూల దృక్పథం ఏర్పడే ప్రమాదం ఉంది.పనిమధ్యలో విరమించుకునే అవకాశం కూడా ఉంది. ఇవి తెలిసినా కూడా చాలా మంది ఉద్యోగులు అలాగే తమ విధులకు హాజరవుతుంటారు. అయితే, ఇలా చేయడం కొందరికి స్ఫూర్తి దాయకంగా కనిపిస్తుంటుంది. మరింత ముందుకు వెళ్లేలా పనిచేయాలని అవతలివారికి అనిపిస్తుంది. ఎలాంటి ఇబ్బంది వచ్చినా విధులు తప్పక నిర్వర్తించాలనే బాధ్యతను గుర్తు చేస్తుంటుంది' అని ఆయన తెలిపారు. ఈ అధ్యయనం కోసం ఆయన మొత్తం 61 అధ్యయనాలు పూర్తి చేశారు. ఈ అధ్యయనాల్లో మొత్తం 1,75,960మంది పాల్గొన్నట్లు తెలిసింది. -
బయోమెట్రిక్ విధానం..అదో ఆర్భాటం
ప్రొద్దుటూరు: సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాల్లో బోగస్ అటెండెన్స్ నివారణకు ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించిన బయో మెట్రిక్ విధానం అమలు ప్రశ్నార్థకంగా మారింది. లక్షలాది రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన కంప్యూటర్ సామగ్రి నిరుపయోగంగా ఉంది. వాస్తవానికి చాలా రోజుల క్రితమే సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. కొత్తగా రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు కాగానే విద్యార్థుల హాజరునుబట్టి వసతి గృహ సంక్షేమాధికారులకు ల్యాప్‌టాప్‌లతోపాటు బయోమెట్రిక్ మిషన్లు సెప్టంబర్లో సరఫరా చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన 998 వసతి గృహాలకు ఈ సామగ్రి చేరింది. జిల్లాకు సంబంధించి 140 వసతి గృహాలకుగాను 99 వాటికి సరఫరా చేశారు. ప్రత్యేకంగా తయారు చేసిన సాఫ్ట్‌వేర్‌తో వీటిని రూపొందించడంతో ఒక్కో వసతి గృహానికి సంబంధించిన ల్యాప్‌టాప్ బయోమెట్రిక్ మిషన్ కొనుగోలుకు ప్రభుత్వం సుమారు రూ.లక్ష వరకు వెచ్చించినట్లు అధికార వర్గాల సమాచారం. ప్రతి రోజు ఉదయం, రాత్రి వేళల్లో విద్యార్థుల అటెండెన్స్‌ను బయోమెట్రిక్ ద్వారా సేకరించాల్సి ఉంది. ప్రధానంగా బోగస్‌ను అరికట్టేందుకు ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. అయితే సంబంధిత ల్యాప్‌టాప్ కంపెనీ ప్రతినిధులు ఆయా డివిజన్లకు వచ్చి ల్యాప్‌టాప్‌లు అందించారే కానీ వినియోగంపై సరైన అవగాహన కల్పించలేదు. పూర్వం నుంచి రిజిష్టర్లపైన ఆధారపడిన హెచ్‌డబ్ల్యూఓలకు ఈ విధానంపై అవగాహన లేక ఆ సామగ్రిని తీసుకెళ్లి ఇళ్లల్లో దాచుకున్నారు. ఏదైనా సాంకేతిక సమస్య ఏర్పడితే మీరే బాధ్యులవుతారని ఉన్నతాధికారులు హెచ్చరించడంతో హెచ్‌డబ్ల్యూఓలు వీటిని భద్రంగా దాచి ఉంచారు. ఇదిలావుండగానే సాంఘిక సంక్షేమ శాఖ కమిషనర్ జి.జయలక్ష్మి డిసెంబర్ 1వ తేదీ నుంచి బయోమెట్రిక్ విధానాన్ని వసతి గృహాల్లో అమలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే అవగాహన లేని కారణంగా జిల్లాలో ఎక్కడా ఈ విధానం అమలుకు నోచుకోలేదు. -
ఆధార్ అనుసంధానం కొలిక్కి
సాక్షి, మంచిర్యాల : సంక్షేమ వసతిగృహాల్లో లోపాలు అరికట్టడానికి ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు కొలిక్కివస్తున్నాయి. హాస్టళ్లలో జరిగే అవినీతిని అరికట్టేందుకు, విద్యార్థులకు నాణ్యమైన భోజ నంతోపాటు సదుపాయాల కల్పనకు అవినీతే అడ్డంకిగా మారిందని అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. దీంతో విద్యార్థుల ఆధార్ నంబర్‌ను, హాజరును ఆన్లైన్లో అనుసంధానం చేయాలని, తద్వారా వారికి అందే సదుపాయాలు, హాజరు వంటివాటిని పరిశీలించే అవకాశం ఉంటుందని భావించారు. ఈ నేపథ్యంలో ఆధార్ వివరాల సేకరణ చేపడుతున్నారు. ఆన్లైన్ ఆధారంగా.. జిల్లాలో దళిత సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రీ మెట్రిక్‌లో 76 హాస్టళ్లు ఉండగా పోస్ట్‌మెట్రిక్ 14 వసతి గృహాలు ఉన్నాయి. బీసీ వెల్ఫేర్ హాస్టళ్లు ప్రీ మెట్రిక్‌లో 50 ఉండగా పోస్ట్ మెట్రిక్‌లో 20 హాస్టళ్లు ఉన్నాయి. మైనార్టీ వెల్ఫేర్ విభాగంలో ప్రీ మెట్రిక్‌లో ఒకటి, పోస్ట్ మెట్రిక్‌లో మరొకటి ఉంది. ఎస్టీ హాస్టళ్లలో మొత్తం విద్యార్థులు 38,214 మంది ఉన్నప్పటికీ ఆధార్ అనుసంధానం గురించి ఇప్పటికీ ఏమీ సమాచారం రాలేదని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. ఎస్సీ హాస్టళ్లలో దాదాపు 28వేల వరకు విద్యార్థులున్నారు. అయితే ఎస్టీ మినహా మిగతా విభాగాల్లోని హాస్టల్లలో నెలకొన్న అవినీతిని తొలగించేందుకు సర్కారు కసరత్తు చేస్తోంది. ఇందుకోసం విద్యార్థుల ఆధార్ నంబరును ఆన్లైన్లో అనుసంధానం చేయనున్నారు. ఇప్పటికే దాదాపు 80 శాతం అప్లోడ్ ప్రక్రియ పూర్తయినట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత బయోమెట్రిక్ విధానంలో విద్యార్థుల హాజరును పరిశీలించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ విధానం అమలులోకి వస్తే విద్యార్థులు హాజరుకాకపోయినా హాజరు అయినట్లు రిజిస్టర్లో నమోదు చేయడం, విద్యార్థులందరికీ వంటచేసినట్లు రికార్డులు తయారు చేయడం తద్వారా నిధుల దుర్వినియోగం వంటి చర్యలకు చెక్‌పడనుంది. ఇదిలా ఉండగా ఇప్పటివరకు హాస్టల్ వార్డెన్లచే సరుకుల కొనుగోలు చేయించిన ప్రభుత్వం త్వరలో ఈ విధానాన్ని మార్చేందుకు ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఆయా హాస్టళ్లకు కాంట్రాక్టర్ ద్వారా పప్పులు, నూనెల, కారం, ఉప్పు, చింతపండు, ఇతరత్రా వస్తువులు అందజేసే విషయాలు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. -
శాసనసభలో మన ఎమ్మెల్యేల హాజరు అంతంతే!
సాక్షి, నిజామాబాద్: గడిచిన నాలుగున్నరేళ్లలో అసెంబ్లీ సమావేశాలను పరిశీలిస్తే జిల్లా ఎమ్మెల్యేల హాజరు అంతంత మాత్రమే ఉంది. తమ నియోజకవర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను, అభివృద్ధి పనులను శాసనసభలో ప్రస్తావించాల్సిన ప్రజాప్రతినిధులు అస లు సమావేశాలకే ముఖం చాటేశారు. జీతా లు, భత్యాల రూపంలో నెలనెలా లక్షల రూపాయల అలవెన్సులు పొందుతున్న వీరికి ప్రజ ల బాధలు మాత్రం పట్టడం లేదు. ప్రస్తుతం జరుగుతున్న సమావేశాలను మినహాయిస్తే అసెంబ్లీ 12 సార్లు సమావేశమైంది. మొత్తం 173 రోజులు సమావేశాలు జరిగాయి. 2009 మే నెలలో ఎన్నికైన ఎమ్మెల్యేల పదవీకాలం మరో నాలుగు నెలల్లో ముగి యనుంది. ఈ నేపథ్యంలో జిల్లా ఎమ్మెల్యే ల అసెంబ్లీ సమావేశాల హాజరు తీరును పరిశీ లిస్తే... మండవ వెంకటేశ్వర్రావు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తు న్న టీడీపీ సీనియర్ నేత మండవ వెంకటే శ్వరరావు 75 రోజుల పాటు శాసనసభ సమావేశాలకు హాజరు కాలేదు. ఈ ఏడాది జూన్‌లో పదిరోజుల పాటు జరిగిన 12వ సెషన్స్ రెండో విడతలో ఒక్కరోజు కూడా హాజరు కాలేదు. 2012 నవంబర్‌లో మూడు రోజులు జరిగిన 11వ సెషన్స్‌కు కూడా దూరంగా ఉన్నారు. ఏడో సెషన్స్ 30 రోజుల పాటు జరిగితే 24 రోజులు సభలో కనిపించలేదు. డుమ్మాకొట్టిన జిల్లా ఎమ్మెల్యేల్లో మండవది మొదటి స్థానం. ఈరవత్రి అనిల్ పీఆర్పీ అభ్యర్థిగా గెలుపొంది కాంగ్రెస్‌లో చేరిన బాల్కొండ ఎమ్మె ల్యే ఈరవత్రి అనిల్ ప్రభుత్వ విప్‌గా నియమితులయ్యే వరకు 54 రోజులు అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొట్టారు. నాలుగో, ఏడో సెషన్స్‌లో చాలా రోజులు అనిల్ హాజరు కాలేదు. ఏలేటి అన్నపూర్ణమ్మ ఆర్మూర్ ఎమ్మెల్యే ఏలేటి అన్నపూర్ణమ్మ 40 రోజులు అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజరయ్యారు. 2011 ఫిబ్రవరి, మార్చిలో 31 రోజుల పాటు ఏడో సెషన్స్ జరిగితే 23 రోజులు హాజరుకాలేదు. 2012 ఫిబ్రవరి, మార్చిలో 29 రోజులకు 9 రోజులు గైర్హాజరయ్యారు. హన్మంత్ సింధే జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ సింధే కూడా అసెంబ్లీ సమావేశాలకు 38 రోజులు హాజరు కాలేదు. 2010 ఫిబ్రవరి, మార్చిలో జరిగిన సమావేశాలకు నాలుగు రోజులు, 2011 ఫిబ్రవరి, మార్చిలో జరి గిన సమావేశాలకు ఏకంగా 22 రోజులు, 2012లో జరిగిన సమావేశాలకు 10 రోజులు గైర్హాజరయ్యారు. పోచారం శ్రీనివాస్‌రెడ్డి బాన్సువాడ ఎమ్మెల్యేగా టీడీపీ నుంచి గెలుపొందిన పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఏకంగా 45 రోజులు సమావేశాలలో పాల్గొనలేదు. పోచారం ఏడో సెషన్స్‌లో 25 రోజులు, తొమ్మిది సెషన్స్‌లో 14 రోజులు సభలో లేరు. అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజరైన జిల్లాకు చెందిన ఎమ్మెల్యేల్లో పోచారం మూడో స్థానంలో ఉన్నారు. ఏనుగు రవీందర్‌రెడ్డి ఎల్లారెడ్డి నుంచి గెలుపొందిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి 42 రోజులు సభకు రాలేదు. ప్రత్యేక రాష్ట్రం కోసం ఎమ్మె ల్యే పద వికి రాజీనామా చేయడంతో 2010లో ఫిబ్రవరి, మార్చి మాసాల్లో జరిగిన 4వ సెషన్స్‌కు ఆయన హాజరయ్యే అవకాశం లేకుండా పోయింది. తిరిగి ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత 2011లో సమావేశాలకు 23 రోజులు దూరంగా ఉన్నారు. గత ఏడాది తొమ్మిదో సెషన్స్‌లో 14 రోజులు సభకు వెళ్లలేదు. గంప గోవర్ధన్ మొదట టీడీపీ అభ్యర్థిగా కామారెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందిన గంప గోవర్ధన్ హాజరు అసెంబ్లీ సమావేశాలకు కాస్త మెరుగ్గానే ఉంది. 23 రోజులు మాత్రమే సభలో పాల్గొనలేకపోయారు. 2011లో ఆయన టీడీపీకి, తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో డిసెంబర్లో జరిగిన 8వ సెషన్స్‌కు హాజరయ్యే అవకాశం దొరకలేదు. ఆ తర్వాత టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఆయన ఒకటీ రెండు రోజులు మినహా ప్రతిసారి సభకు హాజరవుతూనే ఉన్నారు. యెండల లక్ష్మీనారాయణ బీజేపీకి చెందిన నిజామాబాద్ అర్మన్ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ 34 రోజులు అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉన్నారు. తెలంగాణ రాష్ర్టం కోసం యెండల 2010లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, తిరిగి విజయం సాధించారు. ఈ మధ్య కాలం లో 37 రోజులు జరిగిన అసెంబ్లీ సమావేశాలకు ఆయన హాజరయ్యే అవకాశం దక్కలేదు.