ఉద్దేశపూర్వకంగా వేధిస్తున్న ప్రిన్సిపాల్
Published Tue, Aug 9 2016 12:40 AM | Last Updated on Mon, Sep 4 2017 8:25 AM
హన్మకొండ అర్బన్ : హన్మకొండలోని ప్రభుత్వ బీఈడీ కళాశాల ప్రిన్సిపాల్ తమను ఉద్దేశపూర్వకంగా వేధింపులకు గురిచేస్తున్నారని ఆ కళాశాల విద్యార్థినులు సుమారు 70మంది సోమవారం జిల్లా కలెక్టర్ వాకాటి కరుణకు ఫిర్యాదు చేశారు. వార్షిక పరీక్షల ఫీజు గడువు తేదీకి ఒక్క రోజు ముందు అటెండెన్స్ సరిపోలేదని చెప్పి తమను ఫీజు చెల్లించేందుకు అనర్హులన్నారని తెలిపారు. ప్రిన్సిపాల్ సుమారు నెల రోజుల పాటు కాలేజీకి రాలేదని, బయోమెట్రిక్ యంత్రం పాడైపోగా హాజరు నమోదు చేయలేదన్నారు. ఈ పరిస్థితుల్లోనూ తమకు హాజరు లేదనడం సరికాదన్నారు. దీన్ని అర్థం చేసుకొని ఫీజు చెల్లించి పరీక్షలు రాసే అవకాశం కల్పించాలని, ఉద్దేశపూర్వకంగా వేధింపులకు గురిచేస్తున్న ప్రిన్సిపాల్‌పై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు. కలెక్టర్ స్పందిస్తూ తగిన చర్యలు తీసుకుంటామని, విద్యార్థులు ఆందోళన చెందొద్దని తెలిపారు. కాగా ఈ విషయంలో హన్మకొండ పోలీస్‌స్టేçÙన్‌లో ఫిర్యాదు చేసినట్లు విద్యార్థినులు తెలిపారు.
Advertisement
Advertisement