చిన్నారి జుట్టు పట్టుకుని చితకబాదిన టీచర్‌.. దెబ్బలు తట్టుకోలేక.. | Woman shiksha Mitra Brutally Thrashes Student At Unnao | Sakshi
Sakshi News home page

ఇంత క్రూరత్వమా.. చిన్నారిని జుట్టు పట్టుకుని 30 సెకన్లలో 10 చెంపదెబ్బలు

Published Tue, Jul 12 2022 8:28 PM | Last Updated on Tue, Jul 12 2022 8:35 PM

Woman shiksha Mitra Brutally Thrashes Student At Unnao - Sakshi

పిల్లల విద్యా విధానంలో ఎన్నో మార్పులు వచ్చాయి. ఇప్పుడంతా టెక్నాలజీ చదువులు వచ్చేశాయి. దానికి తోడు కరోనా కారణంగా విద్యార్థులు.. బడులకు నెలల పాటు బడులకు దూరమయ్యారు. కొత్తగా స్కూల్స్‌ ప్రారంభం కావడంతో విద్యార్థులు చదువులో బాగా వెనకబడ్డారు. 

దండిస్తే.. పిల్లలు క్రమశిక్షణ తప్పరు, సరిగా చదువుతారనేది ఒకప్పడు ఉండేది. కానీ, ఇప్పుడు పరిస్థితులు చాలా మారిపోయాయి. అయితే పిల్లల్ని దండించడంలో ఓ టీచర్‌ దారుణంగా వ్యవహరించింది. ఆమెకు కూడా ఓ తల్లేనన్న విషయం మరచి.. పాపం పసిపాపను చితకబాదింది. ఐదేళ్ల చిన్నారి పట్ల అత్యంత క్రూరంగా వ్యవహరించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ దారుణ ఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటుచేసుకుంది.

ఉన్నావ్​ జిల్లా అసోహా మండలం ఇస్లామ్​ నగర్ ప్రభుత్వ​ ప్రాథమిక పాఠశాలలో ప్రభుత్వ పాఠశాలలో శిక్షా మిత్ర లేదా పారా టీచర్.. ఓ చిన్నారిని దారుణంగా కొట్టింది. క్లాస్‌ రూమ్‌ శబ్ధం చేసిందని, హోం వర్క్‌ చేయలేదన్న కారణంతో 30 సెకన్లలో 10 చెంప దెబ్బలు కొట్టింది. చిన్నారి జుట్టు పట్టుకుని ఎడా పెడా చెంపలు వాయించింది. ఈ క్రమంలో చిన్నారి బోరున ఏడుస్తున్నా.. ఆమె అదేదీ పట్టించుకోలేదు.

ఈ ఘటన ఈనెల 9వ తేదీన చోటుచేసుకోగా.. అదే రోజు సాయంత్రం బాలిక తల్లిదండ్రులు చిన్నారి ముఖంపై దెబ్బలు గుర్తించి.. వెంటనే బడికి వచ్చారు. అనంతరం టీచర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసి మరోసారి ఇలా జరిగితే బాగుండని హెచ్చరించారు. ఈ క్రమంలోనే మళ్లీ ఇలాంటి పని చేయనని ఆమెతో లేఖ రాయించారు. అయితే.. ఓ వ్యక్తి ఈ దారుణాన్ని వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్​ కాగా.. విద్యాశాఖ అధికారులు స్పందించారు. టీచర్‌ను ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడ్ని సస్పెండ్ చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement