Teacher punishing
-
విద్యార్థులను చితకబాదిన ఉపాధ్యాయురాలు
రాయపర్తి: అటెండెన్స్ విషయంలో కోపంతో ఓ ఉపాధ్యాయురాలు ఇద్దరు విద్యార్థులను చితకబాదారు. ఈ ఘటన వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని కొత్తూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం చోటు చేసుకుంది. దీంతో గ్రామస్తులు శనివారం పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు. కొత్తూరు ప్రభుత్వ పాఠశాలలో సీనియర్ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న అంబటి దేవకి శుక్రవారం పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న హపావత్ వైష్ణవి, బాలకృష్ణలను తీవ్రంగా చితకబాదారు. తోటి ఉపాధ్యాయులు, విద్యార్థులు అక్కడికి చేరుకొని గాయాలపాలైన విద్యార్థులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఇదేంటని ప్రశ్నించిన తోటి ఉపాధ్యాయులను సైతం దేవకి పరుష పదజాలంతో దూషించారు. ఇంటికి వెళ్లిన విద్యార్థులు తమ తల్లిదండ్రులకు విషయం తెలపడంతో శనివారం పాఠశాల గేటుమూసి ఆందోళన చేశారు. తమ పిల్లలను ఎందుకు కొట్టారని టీచర్‌ను నిలదీశారు. దీనిపై ఉపాధ్యాయురాలు దేవకిని వివరణ కోరగా అటెండెన్స్ తీసుకునే సమయంలో వైష్ణవి పేరు పిలవగా విద్యార్థిని తరగతి గదిలో ఉన్నా ఆబ్సెంట్ అని బాలకృష్ణ చెప్పాడని, దీంతో క్రమశిక్షణ కింద దండించానని తెలిపారు. ‘పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులు కొడితే ఒప్పు.. టీచర్‌గా తాను కొడితే తప్పా’అని ప్రశ్నించారు. -
అధ్యాపకురాలి క్రూరత్వం.. ఆస్పత్రి పాలైన విద్యార్థిని
వేములవాడ అర్బన్: సెలవుపై ఇంటికెళ్లిన విద్యార్థిని తిరిగి కళాశాలకు ఆలస్యంగా వచ్చిందంటూ ఓ అధ్యాపకురాలు ఆమెపట్ల క్రూరంగా ప్రవర్తించింది. ఐదు రోజులపాటు తరగతి గది బయట 8 గంటల చొప్పున నిలబెట్టడంతో నడవలేని స్థితికి చేరి, ఆదివారం ఆసుపత్రి పాలైంది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం రేగడి మద్దికుంటకు చెందిన మద్దెల నిహారిక రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని సాంఘిక సంక్షేమ గురుకుల మహిళాడిగ్రీ కళాశాలలో బీకాం మూడో సంవత్సరం చదువుతోంది. అనారోగ్య సమస్యతో బాధపడుతున్న నిహారిక ఈ నెల 18న ఒకరోజు సెలవుపై ఇంటికెళ్లి 22న తిరిగొచ్చింది. ఆలస్యంగా వచ్చిందంటూ నిహారికపై అధ్యాపకురాలు మహేశ్వరి కఠినంగా వ్యవహరించింది. ఈ నెల 23 నుంచి 27వ తేదీ వరకు క్లాస్‌లోకి అనుమతించకపోగా నిత్యం ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు బయట నిలుచోబెట్టింది. దీంతో ఆ విద్యార్థిని నడవలేని స్థితికి చేరింది. ఈ విషయం హాస్టల్ ఇన్చార్జి దృష్టికి వెళ్లడంతో ఆదివారం ఉదయం వేములవాడ ఏరియా ఆస్పత్రికి నిహారికను తరలించి వైద్యసేవలు అందించారు. దీనిపై కళాశాల వైస్ ప్రిన్సిపాల్ శ్యామలను వివరణ కోరగా ఈ విషయం తమ దృష్టికి ఇప్పుడే వచ్చిందన్నారు. కాగా, ఘటనపై జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి స్పందిస్తూ అధ్యాపకురాలిని సస్పెండ్ చేశారు. ప్రిన్సిపాల్‌పైనా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. -
చిన్నారి జుట్టు పట్టుకుని చితకబాదిన టీచర్.. దెబ్బలు తట్టుకోలేక..
పిల్లల విద్యా విధానంలో ఎన్నో మార్పులు వచ్చాయి. ఇప్పుడంతా టెక్నాలజీ చదువులు వచ్చేశాయి. దానికి తోడు కరోనా కారణంగా విద్యార్థులు.. బడులకు నెలల పాటు బడులకు దూరమయ్యారు. కొత్తగా స్కూల్స్ ప్రారంభం కావడంతో విద్యార్థులు చదువులో బాగా వెనకబడ్డారు. దండిస్తే.. పిల్లలు క్రమశిక్షణ తప్పరు, సరిగా చదువుతారనేది ఒకప్పడు ఉండేది. కానీ, ఇప్పుడు పరిస్థితులు చాలా మారిపోయాయి. అయితే పిల్లల్ని దండించడంలో ఓ టీచర్ దారుణంగా వ్యవహరించింది. ఆమెకు కూడా ఓ తల్లేనన్న విషయం మరచి.. పాపం పసిపాపను చితకబాదింది. ఐదేళ్ల చిన్నారి పట్ల అత్యంత క్రూరంగా వ్యవహరించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ దారుణ ఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఉన్నావ్ జిల్లా అసోహా మండలం ఇస్లామ్ నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రభుత్వ పాఠశాలలో శిక్షా మిత్ర లేదా పారా టీచర్.. ఓ చిన్నారిని దారుణంగా కొట్టింది. క్లాస్ రూమ్ శబ్ధం చేసిందని, హోం వర్క్ చేయలేదన్న కారణంతో 30 సెకన్లలో 10 చెంప దెబ్బలు కొట్టింది. చిన్నారి జుట్టు పట్టుకుని ఎడా పెడా చెంపలు వాయించింది. ఈ క్రమంలో చిన్నారి బోరున ఏడుస్తున్నా.. ఆమె అదేదీ పట్టించుకోలేదు. ఈ ఘటన ఈనెల 9వ తేదీన చోటుచేసుకోగా.. అదే రోజు సాయంత్రం బాలిక తల్లిదండ్రులు చిన్నారి ముఖంపై దెబ్బలు గుర్తించి.. వెంటనే బడికి వచ్చారు. అనంతరం టీచర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసి మరోసారి ఇలా జరిగితే బాగుండని హెచ్చరించారు. ఈ క్రమంలోనే మళ్లీ ఇలాంటి పని చేయనని ఆమెతో లేఖ రాయించారు. అయితే.. ఓ వ్యక్తి ఈ దారుణాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ కాగా.. విద్యాశాఖ అధికారులు స్పందించారు. టీచర్‌ను ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడ్ని సస్పెండ్ చేశారు. Accused #teacher (Shiksha Mitra) Sunil Kumari suspended for brutally assaulting a minor girl in govt primary school of Unnao (Islamnagar of Asoha block).#UttarPradesh #Student pic.twitter.com/ptemz5KSkN — Arvind Chauhan अरविंद चौहान (@ArvindcTOI) July 12, 2022 -
కొడుకు పరిస్థితి చూసి రగిలిపోయిన ఓ తండ్రి...
సాక్షి, ముంబై : తన కొడుకును ఓ టీచర్ కొట్టాడన్న వార్త తెలియగానే ఆ తండ్రి కోపంతో రగిలిపోయాడు. నేరుగా స్కూల్‌కి పరిగెత్తి గల్లా పట్టి అతన్ని బయటకు గుంజుకొచ్చాడు. ఆపై చితకబాదుతూ తీసుకెళ్లి పోలీసులకు అప్పగించాడు. ముంబైలోని విరార్ ప్రాంతంలో గురువారం ఈ ఘటన చోటు చేసుకుంది. జయదీప్ విద్యా మందిర్‌లో ఆరో తరగతి చదువుతున్న నితిన్ శర్మ(11) అనే విద్యార్థిని అల్లరి చేస్తున్నాడన్న కారణంతో దినేశ్ షిండే(31) అనే ఉపాధ్యాయుడు దండించాడు. అయితే అది కాస్త శ్రుతి మించటంతో నితిన్ కళ్లు తిరిగి పడిపోయాడు. ఊపిరి అందక అవస్థ పడుతున్న విధ్యార్థిని దగ్గర్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స అందించగా.. కాసేపటికి అతను కోలుకున్నాడు. అయితే ఆస్పత్రి బెడ్ మీద తన కొడుకు అపస్మారక స్థితిలో ఉండటం చూసిన తండ్రి నర్సింగ్ శర్మ కోపంతో ఊగిపోతూ స్కూల్‌కి వచ్చాడు. దినేశ్‌ను లాక్కుంటూ రోడ్డు మీదకు తీసుకొచ్చి చితకబాదాడు. ఈ క్రమంలో అతనికి కొందరు స్థానికులు కూడా తోడయ్యారు. ఆపై వీరార్ పోలీస్ స్టేషన్లో ఇరువురికి కౌన్సిలింగ్ ఇచ్చిన పోలీసులు ఈ విషయంలో ఫిర్యాదు చేయబోమని రాతపూర్వక హామీ తీసుకుని వదిలేశారు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి మెరుగుపడిందని.. మెడకు మాత్రం స్వల్ఫ గాయమైందని వైద్యులు వెల్లడించారు. పిల్లలను దండించటంలో తప్పు లేదని.. అయితే అది మరీ మితిమీరటంతోనే తాను ఇలా స్పందించాల్సి వచ్చిందని నర్సింగ్ చెబుతున్నారు. -
క్లాసులో విద్యార్థులు తెలుగు మాట్లాడారని ...
పాఠశాల తరగతి గదిలో విద్యార్థులు తెలుగు మాట్లాడటమే నేరమైంది. తరగతి గదిలో తెలుగు మాట్లాడతారా అంటూ విద్యార్థులకు టీచర్ పెద్ద క్లాస్ తీసుకుంది. తెలుగు మాట్లాడితే తప్పేముంది అని సదరు విద్యార్థులు టీచర్‌ను ప్రశ్నించారు. అంతే టీచర్‌కు కోపం కట్టలు తెంచుకుంది. దాదాపు 40 మంది విద్యార్థులను చితకబాది పారేసింది. ఆ సంఘటన మంగళవారం హైదరాబాద్ సనత్‌నగర్ లోని డాన్ బాస్కో స్కూల్లో చోటు చేసుకుంది. ఆ ఘటనపై సమాచారం అందుకున్న విద్యార్థుల తల్లిదండ్రులను పాఠశాలకు చేరుకున్నారు. సదరు టీచర్‌పై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు.