కండక్టర్‌పై చేయి చేసుకున్న టీడీపీ నాయకుడు | tdp leader slapped bus conductor | Sakshi
Sakshi News home page

కండక్టర్‌పై చేయి చేసుకున్న టీడీపీ నాయకుడు

Published Wed, Jan 28 2015 1:53 AM | Last Updated on Tue, Aug 21 2018 9:20 PM

tdp leader slapped bus conductor

కొయ్యూరు పోలీసులకు ఫిర్యాదు

కేసు నమోదు
{పతిగా కేడిపేట స్టేషన్‌లో ఫిర్యాదు

కొయ్యూరు: విధుల్లో ఉన్న ఆర్టీసీ కం డక్టర్‌పై చేయిచేసుకున్నందుకు మం డల టీడీపీ అధ్యక్షుడు ఎస్‌కె బ షీర్‌ఖాన్‌పై కొయ్యూరు ఇన్‌చార్జీ ఎస్‌ఐ మధుసూధన్ మంగళవారం కేసు నమోదు చేశారు. విధులకు ఆ టం కం కలిగించడంతోపాటు తనపై చే యిచేసుకున్నారని బాధిత కండక్టర్ సీహెచ్ వెంకటేశ్వరరావు పోలీసుల కు ఫిర్యాదు చేశారు. వివరాలు ఇలా  ఉన్నాయి. టీడీపీ నేత ఎస్‌కె   బషీర్‌ఖాన్ తమ్ముడి భార్య (మరదలు) సోమవారం రేవళ్ల బస్సులో కేడిపేట నుంచి కొయ్యూరు వచ్చా రు. బస్సు ఖాళీ లేకపోవడంతో ఆమెను వెనక్కు జరగాలని కండక్టర్ కోరారు.

 

అయితే అక్కడ ఏమి జరిగిందో తెలియక పో యినా ఆమె రాజేంద్రపాలెంలో బ స్సు దిగి ఇంటికి వచ్చాక, కండక్టర్ అసభ్యకరంగా ప్రవర్తించారని బం ధువులకు తెలి పారు. దీంతో కోప్రోది కుడైన ఖాన్ రేవళ్ల నుంచి తిరిగి వ స్తున్న బస్సును అతని షాపు వద్ద ఆపి కండక్టర్, డ్రైవర్‌ను కిందకు దించారు. అక్కడ తనపై చేయిచేసుకున్నారని కండక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశా రు. కండక్టర్ యూని యన్ నాయకులతో వచ్చి మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా కండక్టర్ అసభ్యకరంగా ప్రవర్తించారంటూ మ హిళ కేడిపేట పోలీసుస్టేష్‌న్‌లో ఫిర్యా దు చేశారని ఎస్‌ఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement