కర్ణాటక: బస్సు కండక్టర్ యువతికి టికెట్ ఇస్తూ ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మూడునెలలకే ముఖం చాటేశాడు. వివరాలు.. ఎంఎస్ పాళ్య బీఎంటీసీ డిపోకి చెందిన కండక్టర్ కం డ్రైవర్‌గా పని చేస్తున్న మంజునాథ్.. రోజు ఎంఎస్ పాళ్య నుంచి యలహంకకు బస్సును నడిపేపాడు.
ఆ బస్సులో ప్రయాణించే యువతికి టికెట్ ఇస్తూ మాటలు కలిపాడు. తనకు పెళ్లయి ఇద్దరు పిల్లలున్న సంగతి చెప్పకుండా, ప్రేమ అంటూ యువతి వెంటపడి ఒప్పించాడు. ఇద్దరూ జాలీ ట్రిప్‌లకు వెళ్లేవారు. కండక్టర్ ప్రవర్తన సరిలేదని తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు ఈ పెళ్లిని వ్యతిరేకించారు.
కానీ మంజునాథ్ మాయలో పడిన యువతి వివాహం చేసుకొంది. మొదటి పెళ్లాంతో నెలమంగలలో కుటుంబం ఉందని తెలిసి యువతి భర్తని నిలదీసింది. దీంతో నువ్వు నాకు వద్దంటూ అతడు దూరం పెట్టాడు. మూడునెలల గర్భంతో ఉన్న యువతి.. అన్యాయం జరిగిందంటూ పోలీస్ కమిషనర్, మహిళా సహయవాణికి ఫిర్యాదు చేశారు. తనకు భర్త కావాలి. కడుపులో ఉన్న బిడ్డకు తండ్రి కావాలంటూ యువతి డిమాండ్ చేసింది.
అన్న కూతురిని ప్రేమిస్తున్నాడని..
Comments
Please login to add a commentAdd a comment