BMTC
-
నమ్మించి నట్టేట ముంచిన కండక్టర్
కర్ణాటక: బస్సు కండక్టర్ యువతికి టికెట్ ఇస్తూ ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మూడునెలలకే ముఖం చాటేశాడు. వివరాలు.. ఎంఎస్ పాళ్య బీఎంటీసీ డిపోకి చెందిన కండక్టర్ కం డ్రైవర్‌గా పని చేస్తున్న మంజునాథ్.. రోజు ఎంఎస్ పాళ్య నుంచి యలహంకకు బస్సును నడిపేపాడు. ఆ బస్సులో ప్రయాణించే యువతికి టికెట్ ఇస్తూ మాటలు కలిపాడు. తనకు పెళ్లయి ఇద్దరు పిల్లలున్న సంగతి చెప్పకుండా, ప్రేమ అంటూ యువతి వెంటపడి ఒప్పించాడు. ఇద్దరూ జాలీ ట్రిప్‌లకు వెళ్లేవారు. కండక్టర్ ప్రవర్తన సరిలేదని తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు ఈ పెళ్లిని వ్యతిరేకించారు. కానీ మంజునాథ్ మాయలో పడిన యువతి వివాహం చేసుకొంది. మొదటి పెళ్లాంతో నెలమంగలలో కుటుంబం ఉందని తెలిసి యువతి భర్తని నిలదీసింది. దీంతో నువ్వు నాకు వద్దంటూ అతడు దూరం పెట్టాడు. మూడునెలల గర్భంతో ఉన్న యువతి.. అన్యాయం జరిగిందంటూ పోలీస్ కమిషనర్, మహిళా సహయవాణికి ఫిర్యాదు చేశారు. తనకు భర్త కావాలి. కడుపులో ఉన్న బిడ్డకు తండ్రి కావాలంటూ యువతి డిమాండ్ చేసింది.అన్న కూతురిని ప్రేమిస్తున్నాడని.. -
ఖరీదైన కారుకి చిన్నప్పుడు ప్రయాణించిన బస్ నెంబర్ - నెట్టింట్లో ప్రశంసలు
ఒక వ్యక్తి ఎంత గొప్పవాడైనా తన చిన్నప్పటి జ్ఞాపకాలను ఎట్టి పరిస్థితుల్లోనూ మరచిపోడు, ఎందుకంటే మళ్ళీ అలాంటి రోజులు కావాలనుకున్న దొరకవు. కష్టాలు, సుఖాలు తెలియకుండా ఎంతో సంతోషంగా గడిచిపోయిన రోజులు మళ్ళీ గుర్తు చేసుకుంటే ఆ అనుభూతి వర్ణానాతీతం అనే చెప్పాలి. అయితే ఇటీవల ఒక వ్యక్తి తాను చదువుకునే రోజుల్లో ప్రయాణించి బస్సు నెంబర్‌ను తన కొత్త కారుకి తీసుకున్నాడు. ఈ సంఘటన గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. అమెరికాలో స్థిరపడిన బెంగళూరుకు చెందిన ఒక వ్యక్తి ఇటీవల ఒక టెస్లా కారుని కొనుగోలు చేశారు. ఎంతో ఇష్టపడి కొనుగోలు చేసుకున్న ఈ కారుకి ఫ్యాన్సీ నెంబర్ కాకుండా తన చిన్నతనంలో ప్రయాణించిన బస్ రిజిస్ట్రేషన్ నెంబర్‌ను పోలిన నెంబర్ తీసుకున్నాడు. ఇందులో అంత గొప్ప ఏముందని కొంత మంది అనుకోవచ్చు. అయితే ఇది అతని బాల్యం మీద, ఆ బస్సు మీద ఉన్న జ్ఞాపకాలను గుర్తుచేస్తాయి. ధనపాల్ అనే పేరు కలిగిన ఈ వ్యక్తి 1992లో బెంగళూరులోని విద్యారణ్యపుర & యశ్వంత్ పుర మధ్య బీఎంటీసీ బస్సులో ప్రయాణించినట్లు, ఆ బస్సు నడిపిన డ్రైవర్ చెంగప్ప గౌరవార్థంగా ఆ బస్సు నెంబర్ తన కారుకి పెట్టుకున్నట్లు మీడియా ద్వారా వెల్లడించారు. సుమారు మూడు దశాబ్దాల కిందట ధనపాల్ ప్రయాణించిన బస్సు నెంబర్ 'KA01F232' ఇప్పుడు తన కొత్త కారుకి తీసుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. తన జీవితంలో ఆ బస్సుతో ఉన్న సంబంధం చాలా ప్రత్యేకమైనదని, దాంతో చాలా జ్ఞాపకాలు ముడిపడి ఉన్నాయని కూడా చెప్పుకొచ్చారు. అప్పట్లో ఆ బస్సు నడిపిన డ్రైవర్ ఇప్పుడు రిటైర్ అయ్యారని ఆయన మీద గౌరవంతో ఈ నెంబర్ తీసుకున్నట్లు కూడా వెల్లడించాడు. (ఇదీ చదవండి: వారెవ్వా.. 21 నెలలు, రూ. 9000 కోట్లు - జీవితాన్ని మార్చేసిన ఒక్క యాప్!) BMTC మీద ఉన్న ప్రేమకు, చిన్నప్పుడు స్కూలుకి వెళ్లిన బస్సుని, దానిని డ్రైవ్ చేసిన డ్రైవర్‌ను గుర్తుపెట్టుకుని గౌరవించడం చాలా గొప్ప విషయం అని పలువురు నెటిజన్లు ధనపాల్ మీద ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. -
బస్సుకు అడ్డుగా వచ్చాడని చితకబాదడు
-
అడ్డుగా వచ్చాడని నడిరోడ్డుమీద చితకబాదాడు..!
బెంగుళూరు : బస్సుకు అడ్డుగా వచ్చాడని ఆరోపిస్తూ బీఎంటీసీ వోల్వో బస్ డ్రైవర్ ఓ ద్విచక్రవాహన దారుడిని డ్రైవర్ చితకబాదిన ఘటన బెంగుళూరులోని మహదేవ్‌పురాలో గురువారం చోటుచేసుకుంది. దీంతో మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (బీఎంటీసీ) బస్ డ్రైవర్ సంతోష్ బాడిగర్ పై చర్యలు చేపట్టింది. అతన్ని సస్పెండ్ చేస్టున్నట్టు వెల్లడించింది. బైకిస్ట్పై దాడి దృశ్యాలను కె.హమీద్ అనే ప్రయాణికుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయింది. పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు బస్ డ్రైవర్ చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ఓ ప్రైవేటు వ్యక్తిని పబ్లిక్‌గా చితకబాదడం సమంజసమా..! అని హమీద్ వీడియోను ట్విటర్లో షేర్ చేశాడు. బస్సు నెమ్మదించినప్పుడు బైకిస్ట్ అడ్డుగా వచ్చి పక్కకు వెళ్లిపోయాడని, అతని తప్పు ఏమీ లేదని పేర్కొన్నాడు. కాగా, డ్రైవర్ అనుచిత ప్రవర్తనై బీఎంటీసీ క్షమాపణలు చెప్పింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కానివ్వమని వెల్లడించింది. ఇక సదరు ప్రయాణికుడిని సైతం బస్ డ్రైవర్ బెదిరించడం గమనార్హం. నువ్వెవరు నన్నడగడానికి..? అంటూ సంతోష్ బాడిగర్ హమీద్‌పై బెదిరింపులకు దిగాడు. ఇక ద్విచక్ర వాహనదారుడితో ఓ యువతి కూడా ఉండటం గమనార్హం. -
బెంగళూరు బస్సు.. బహుబాగు బాసూ!
ప్రజా రవాణా వ్యవస్థలో అత్యుత్తమ సేవలందిస్తున్న బెంగళూరు.. 400 కోట్ల నష్టంతో, తీవ్ర కష్టాల్లో కునారిల్లుతున్న హైదరాబాద్ సిటీ ఆర్టీసీ ♦ బెంగళూరు వ్యాప్తంగా బీఎంటీసీ బస్సులు 6,350 ♦ మరో 1,600 బస్సుల కొనుగోలుకు ప్రణాళిక ♦ మరోవైపు ఏటా బస్సులను తగ్గిస్తున్న హైదరాబాద్ ♦ 3,700 బస్సులు నడుపుతూ.. భారీ నష్టాల్లో సంస్థ సాక్షి, హైదరాబాద్: రెండు మహా నగరాలు.. కోటి చొప్పున జనాభా! సాఫ్ట్వేర్ పరిశ్రమలో దేశానికే రెండు కళ్లు!! కానీ ప్రజా రవాణా వ్యవస్థ నిర్వహణలో మాత్రం భూమ్యాకాశాలకు ఉన్నంత తేడా! ఈ రెండు మహా నగరాల్లో ఒకటి... అత్యుత్తమ ప్రజా రవాణా సంస్థగా గుర్తింపు పొందిన బెంగళూరు. మరోటి... ముక్కుతూ మూలుగుతూ పుట్టెడు నష్టాలతో ఆపసోపాలు పడుతున్న హైదరాబాద్ ఆర్టీసీ వ్యవస్థ! ఓవైపు మెట్రో రైలు, మరోవైపు కొత్త పుంతలు తొక్కుతున్న ప్రైవేటు క్యాబ్ సర్వీసులు, ఆటోలు, సొంత వాహనాలు.. ఇలా పోటీ ఎంతున్నా బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్ (బీఎంటీసీ) సగర్వంగా ముందుకు సాగుతోంది. కానీ క్రమంగా బస్సుల సంఖ్య తగ్గించుకుంటూ సాయం కోసం హైదరాబాద్ సిటీ బస్సు వ్యవస్థ నిస్తేజంగా మారుతోంది. గతేడాదితో పోలిస్తే నగరంలో వంద బస్సులు తగ్గగా.. అటు బెంగళూరులో కొత్తగా 1,600 బస్సులు కొనేందుకు రంగం సిద్ధం చేస్తోంది.. బెంగళూరు విజయ రహస్యమిదే ఢిల్లీలోని సాలీనా ఆర్టీసీ కార్పొరేషన్ సగటున రూ.వెయ్యి కోట్లు, ముంబై రూ.855 కోట్లు నష్టపోతుంటే, ఇప్పుడు భాగ్యనగరం వాటితో పోటీకి సై అంటూ 2016–17లో రూ.400 కోట్లు నష్టాల మూటగట్టుకుంది. బీఎంటీసీ మాత్రం నాలుగేళ్ల క్రితం వరకు లాభాల్లోనే ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.150 కోట్లు నష్టపోయింది. అర్బన్ ప్రాంతాల్లోనే ఈ నష్టాలు నమోదు కావడం గమనార్హం. ప్రపంచంలో ఎక్కడైనా అర్బన్ ప్రాంతాల్లో నష్టాలు పరిపాటి. అలా చూస్తే అతి తక్కువ నష్టాలున్నది బీఎంటీసీకే. 1. ట్రాఫిక్ చిక్కుల్లో బెంగళూరు కూడా ఇతర నగరాలకు తీసిపోదు. కానీ అనుసంధాన మార్గాలు, వంతెనలు, వన్‌వే నిబంధనలు, రోడ్ల విస్తరణ, అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట తదితరాలతో అడ్డంకులను అధిగమిస్తోంది. 2. మెయిన్ రోడ్‌కు ఇరువైపులా కాలనీల్లోకి బస్సులు వెళ్లేలా రోడ్లను తీర్చిదిద్దారు. మొదటి కాలనీ అప్రోచ్ రోడ్డు 40 అడుగులుంటే, తదుపరి కాలనీ రోడ్డూ అంతే ఉంటుంది. 3. ప్రతి నెలా 4వ తేదీన బస్ డే ఉంటుంది. ఆ రోజు జనం బస్సుల్లోనే ప్రయాణిస్తారు. 4. ఏకంగా 655 ఏసీ బస్సులున్నాయి. సాఫ్ట్వేర్ ఉద్యోగులు వాటికి అలవాటు పడేలా చేశారు. 5. ఆర్టీసీ అధికారులు నిత్యం పర్యటిస్తుంటారు. కొత్త మార్గాల అన్వేషణ బృందాలూ ఉన్నాయి. 6. ప్రభుత్వం ఏటా బడ్జెట్ నిధులు కేటాయిస్తోంది. 7. ప్రత్యేకంగా బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్ పోర్టు కార్పొరేషన్ ఏర్పాటు చేసి సీనియర్ ఐఏఎస్ అధికారిని కమిషనర్‌గా నియమించారు. హైదరాబాద్ సమస్యలివే.. ⇒ ఆర్టీసీ బస్సులు ప్రధాన రోడ్లకే పరిమితమవుతున్నాయి. కాలనీల్లోకి తక్కువ సంఖ్యలో తిరుగుతుండటంతో అవి ప్రయాణానికి అనుకూలం కాదని జనం భావిస్తున్నారు. రోడ్ల ఆక్రమణలు, ఎక్కడ పడితే అక్కడ ప్రార్థనా మందిరాలు, సరైన ప్రణాళిక లేకుండా రోడ్ల నిర్మాణం కారణంగా బస్సులు కాలనీల్లోకి, బస్తీల్లోకి వెళ్లలేకపోతున్నాయి. ⇒ తీవ్ర నష్టాల్లో ఉన్న ఆర్టీసీని ఆదుకునే విషయంలో ప్రభుత్వపరంగా బడ్జెట్ కేటాయింపుల భరోసా లేదు. బకాయిల చెల్లింపూ లేదు. ⇒ బస్సులెక్కేలా నగర ప్రజలను చైతన్య పరిచే కార్యక్రమాలు శూన్యం. సొంత వాహనాలను నియంత్రించే చర్యలు లేవు. పార్కింగ్ వసతి ఉంటేనే వాహనం కొనాలనే బెంగళూరు నిబంధనా ఇక్కడ లేదు. కాలనీల్లోనూ పరుగుపెట్టాలి.. కేవలం హైవేల మీదుగానే బస్సులు నడుస్తున్నంత కాలం హైదరాబాద్‌లో ప్రజా రవాణా మెరుగవడం కష్టమే. కాలనీలకూ వెళ్లాలి. బెంగళూరులో మెజిస్టిక్ నుంచి బన్నేర్‌గట్ట హైవేకు దూరంగా (దాదాపు 25 కి.మీ.) ఉండే అరికెరా వంటి ప్రాంతానికీ నిత్యం సిటీ బస్సులుంటాయి. అవి కాలనీల మీదుగా వెళ్తాయి గనుక కార్లున్న వారూ వాటిలోనే వెళ్తుంటారు. – ఈమని శివనాగిరెడ్డి, రిటైర్డ్ ప్రభుత్వోద్యోగి మెరుగ్గానే నిర్వహిస్తున్నాం సిటీ బస్సుల నిర్వహణ మెరుగ్గానే ఉందని చెప్పాలి. భారీగా కొత్త బస్సులు కొనాలని ప్లాన్ చేశాం, ఇటీవల 80 ఏసీ బస్సులు అందుబాటులోకి తెచ్చాం. మినీ బస్సులూ ప్రారంభించాం. సొంత వాహనాల వాడకాన్ని తగ్గిస్తే సిటీ బస్సులు మంచి సేవలందిస్తాయి – పురుషోత్తం నాయక్, ఈడీ, హైదరాబాద్ సిటీ జోన్ ప్రభుత్వ దృక్పథం మారాలి ‘నగరంలో ఏటా ఆర్టీసీ బస్సుల సంఖ్య తగ్గటం మంచి పరిణామం కాదు. ప్రజలు సిటీ బస్సుల్లో ఎక్కువగా ప్రయాణించేలా ప్రభుత్వం కార్యాచరణ ఏర్పాటు చేయాలి. బెంగళూరును అధ్యయనం చేసి ఇక్కడా అలాంటి చర్యలు తీసుకోవాలి’ – నాగేశ్వరరావు ఆర్టీసీ కార్మిక సంఘం నేత