ఒక వ్యక్తి ఎంత గొప్పవాడైనా తన చిన్నప్పటి జ్ఞాపకాలను ఎట్టి పరిస్థితుల్లోనూ మరచిపోడు, ఎందుకంటే మళ్ళీ అలాంటి రోజులు కావాలనుకున్న దొరకవు. కష్టాలు, సుఖాలు తెలియకుండా ఎంతో సంతోషంగా గడిచిపోయిన రోజులు మళ్ళీ గుర్తు చేసుకుంటే ఆ అనుభూతి వర్ణానాతీతం అనే చెప్పాలి. అయితే ఇటీవల ఒక వ్యక్తి తాను చదువుకునే రోజుల్లో ప్రయాణించి బస్సు నెంబర్‌ను తన కొత్త కారుకి తీసుకున్నాడు. ఈ సంఘటన గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
అమెరికాలో స్థిరపడిన బెంగళూరుకు చెందిన ఒక వ్యక్తి ఇటీవల ఒక టెస్లా కారుని కొనుగోలు చేశారు. ఎంతో ఇష్టపడి కొనుగోలు చేసుకున్న ఈ కారుకి ఫ్యాన్సీ నెంబర్ కాకుండా తన చిన్నతనంలో ప్రయాణించిన బస్ రిజిస్ట్రేషన్ నెంబర్‌ను పోలిన నెంబర్ తీసుకున్నాడు. ఇందులో అంత గొప్ప ఏముందని కొంత మంది అనుకోవచ్చు. అయితే ఇది అతని బాల్యం మీద, ఆ బస్సు మీద ఉన్న జ్ఞాపకాలను గుర్తుచేస్తాయి.
ధనపాల్ అనే పేరు కలిగిన ఈ వ్యక్తి 1992లో బెంగళూరులోని విద్యారణ్యపుర & యశ్వంత్ పుర మధ్య బీఎంటీసీ బస్సులో ప్రయాణించినట్లు, ఆ బస్సు నడిపిన డ్రైవర్ చెంగప్ప గౌరవార్థంగా ఆ బస్సు నెంబర్ తన కారుకి పెట్టుకున్నట్లు మీడియా ద్వారా వెల్లడించారు.
సుమారు మూడు దశాబ్దాల కిందట ధనపాల్ ప్రయాణించిన బస్సు నెంబర్ 'KA01F232' ఇప్పుడు తన కొత్త కారుకి తీసుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. తన జీవితంలో ఆ బస్సుతో ఉన్న సంబంధం చాలా ప్రత్యేకమైనదని, దాంతో చాలా జ్ఞాపకాలు ముడిపడి ఉన్నాయని కూడా చెప్పుకొచ్చారు. అప్పట్లో ఆ బస్సు నడిపిన డ్రైవర్ ఇప్పుడు రిటైర్ అయ్యారని ఆయన మీద గౌరవంతో ఈ నెంబర్ తీసుకున్నట్లు కూడా వెల్లడించాడు.
(ఇదీ చదవండి: వారెవ్వా.. 21 నెలలు, రూ. 9000 కోట్లు - జీవితాన్ని మార్చేసిన ఒక్క యాప్!)
BMTC మీద ఉన్న ప్రేమకు, చిన్నప్పుడు స్కూలుకి వెళ్లిన బస్సుని, దానిని డ్రైవ్ చేసిన డ్రైవర్‌ను గుర్తుపెట్టుకుని గౌరవించడం చాలా గొప్ప విషయం అని పలువురు నెటిజన్లు ధనపాల్ మీద ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి.
Comments
Please login to add a commentAdd a comment