
ఆయనో పంచాయతీకి సర్పంచ్. గ్రామానికి ప్రథమ పౌరుడు కాస్త దారి తప్పాడు. గంజాయి సరఫరా చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు.
కాగజ్‌నగర్ రూరల్: ఆయనో పంచాయతీకి సర్పంచ్. గ్రామానికి ప్రథమ పౌరుడు కాస్త దారి తప్పాడు. గంజాయి సరఫరా చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. ఈ సంఘటన ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మండలంలోని ఈస్‌గాం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. గంజాయి అక్రమంగా రవాణా చేస్తున్న ఇద్దరు నిందితులను గురువారం పట్టుకున్నట్లు సీఐ రాజేంద్రప్రసాద్, ఎస్సై సందీప్‌కుమార్ తెలిపారు.
చదవండి: యువ రైతు కన్నీటి వ్యథ.. 13 ఎకరాల్లో పంట నీట మునక.. తట్టుకోలేక
పట్టుబడ్డ వారిలో చిన్నమాలిని గ్రామ సర్పంచ్ సుర్పం భగవంత్‌రావు, ఈస్‌గాం గ్రామానికి చెందిన సౌమిత్ర సర్కార్ ఉన్నారు. వారు గంజాయి విక్రయిస్తున్నారనే సమాచారం రావడంతో దాడులు చేశారు. వారిద్దరూ రహస్య ప్రాంతం నుంచి ఈజ్‌గాం మార్కెట్‌కు గంజాయి తరలిస్తుండగా పోలీసులు మాటువేసి పట్టుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి, 300 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
చదవండి: ఎమ్మెల్యేగా 18 ఏళ్లు ఉండి ఈటల ఒక్క ఇల్లయినా కట్టిచ్చిండా?