
ప్రతీకాత్మక చిత్రం
బనశంకరి: బంగ్లాదేశ్ నుంచి మహిళలను అక్రమంగా తీసుకువచ్చి బెంగళూరులో పడుపువృత్తి నిర్వహిస్తున్న పశ్చిమబెంగాల్‌కు చెందిన ముగ్గురిని సోమవారం సీసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు. మహాదేవపుర లక్ష్మీసాగర లేఔట్‌లో వేశ్యవాటిక నడుస్తున్నట్లు తెలిసి దాడులు చేశారు. పశ్చిమబెంగాల్‌కు చెందిన నౌషద్‌అలీ, స్వరూప్, సమీర్ అనే ముగ్గురిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. 11 నకిలీ ఆధార్ కార్డులను సీజ్ చేశారు. ఇద్దరు బంగ్లాదేశ్ మహిళలను కాపాడారు. మహిళలకు బెంగళూరులో మంచి ఉపాధిని చూపిస్తామని ఇక్కడకు తీసుకొచ్చి బలవంతంగా వేశ్యావృత్తి చేయించేవారని తేలింది.
అత్యాచారం చేయడానికి వచ్చి హత్య
బొమ్మనహళ్లి: మహిళను హత్య చేసిన కేసులో ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఈనెల 10న బేగూరు సమీపంలోని సుభాష్ నగరలో నివాసం ఉంటున్న ఆటో డ్రైవర్ చాంద్ భార్య షహినాతాజ్ (40) దారుణ హత్యకు గురైంది. ఈ కేసులో అదే ప్రాంతానికి చెందిన అక్రమ్‌ఖాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
అత్యాచారం చేయడానికి వచ్చి..
ఇంటిలో ఒంటరిగా ఉన్న షహినాతాజ్‌పై అత్యాచారం చేయడానికి వచ్చిన అక్రమ్ ఖాన్ ఆమె గట్టిగా కేకలు వేయడంతో చాకుతో ఆమె గొంతు కోసి హత్య చేశాడు. సాయంత్రం ఇంటికి వచ్చిన చాంద్ విషయం గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనుమానితులను విచారణ చేస్తున్న సమయంలో అక్రమ్ ఖాన్ కొంచెం అనుమానాస్పదంగా కనిపించడంతో తమదైన శైలిలో విచారణ చేయడంతో అసలు విషయం బయటపెట్టాడు. కేసు దర్యాప్తులో ఉంది.
చదవండి: యువ దంపతుల ఆత్మహత్య
Comments
Please login to add a commentAdd a comment