హాస్టల్ నుంచి వ్యభిచార గృహానికి.. | Tribal Girls Hostel to brothel house three girls Disappear | Sakshi
Sakshi News home page

హాస్టల్ నుంచి వ్యభిచార గృహానికి..

Published Wed, Apr 13 2016 4:02 AM | Last Updated on Sun, Sep 3 2017 9:47 PM

హాస్టల్ నుంచి వ్యభిచార గృహానికి..

హాస్టల్ నుంచి వ్యభిచార గృహానికి..

నాలుగు నెలల క్రితం
ఇద్దరు బాలికల అదృశ్యం
పోలీసుల అదుపులో నిందితులు

 ఇల్లెందు: ఖమ్మం జిల్లా గుండాల గిరిజన బాలికల హాస్టల్ నుంచి అదృశ్యమైన బాలికలు నాలుగు నెలల తర్వాత ఓ వ్యభిచార గృహంలో తేలారు. మంగళవారం ఖమ్మం జిల్లా ఇల్లెందులో డీఎస్పీ ఆర్. వీరేశ్వరరావు వివరాలు వెల్లడిం చారు. గుండాల గిరిజన బాలికల హాస్టల్‌లో చదివే ఓ బాలి కకు ఇల్లెందు మండలం పోలారం గ్రామానికి చెందిన ఇస్లావత్ కిషోర్‌తో పరిచయం ఏర్పడింది. ప్రేమ పేరుతో కిషో ర్ ఆ బాలికకు మోసం చేశాడు. ఆ తర్వాత అతడు ఓ యువతిని పెళ్లి చేసుకున్నాడు. కిషోర్‌పై కోపంతో ఆ విద్యార్థిని తన స్నేహితురాలిని తీసుకొని గత డిసెంబర్ 16న హాస్టల్ నుంచి వెళ్లిపోయింది.

వారు వరంగల్ జిల్లా మహబూబాబాద్‌కు, అక్కడి నుంచి సికింద్రాబాద్‌కు వచ్చారు. అక్కడ వారికి పరిచయమైన ఇద్దరు మహిళలు పని కల్పిస్తామని ఖమ్మం జిల్లా కొత్తగూడెం తీసుకెళ్లారు. అక్కడి నుంచి పార్వతి అనే మహిళ ఇంటికి తీసుకెళ్లి వ్యభిచార ఊబిలో దింపాలని ప్రయత్నించగా వారు నిరాకరించారు. దీంతో వారిని నల్లగొండ జిల్లా యాదగిరిగుట్ట సమీపంలోని కందుకూరుకు చెందిన వ్యభిచార గృహ నిర్వాహకుడు యాదగిరికి అమ్మేశారు. యాదగిరి వారిని బలవంతంగా వ్యభిచార రొంపిలో దింపాడు. విటుడిగా వచ్చిన ఓ వ్యక్తి వద్ద  నున్న ఫోన్ సహాయం తో తన సోదరికి  జరిగిన విష యం.. తాము ఎక్కడున్నది చెప్పింది. భయపడిన యాదగిరి ఆమెను పంపించి వేశాడు. దీంతో ఆమె నేరుగా మహబూబాద్ సమీపంలో ఉంటున్న తన సోదరి వద్దకు వచ్చి గుండాల సీఐని ఆశ్రయించింది. ఖమ్మం పోలీసులు కందుకూరులోని వ్యభిచార గృహంపై దాడి చేసి మరో విద్యార్థిని విడిపించి యాదగిరిని అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement