లక్నో: ఫామ్ హౌస్‌లో అక్రమంగా వ్యభిచార గృహం నడుపుతున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న మేఘాలయ బీజేపీ నాయకుడు బెర్నార్డ్ మరాక్‌ను ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులు హాపుడ్ జిల్లాలో అరెస్టు చేశారు. అతడ్ని మేఘాలయ పోలీసులకు అప్పగించనున్నట్లు హాపుడ్ ఎస్పీ వివేకానంద్ సింగ్ వెల్లడించారు.
మేఘాలయ బీజేపీ ఉపాధ్యక్షుడుడైన బెర్నార్డ్‌కు చెందిన ఫామ్ హౌస్‌పై శనివారం రైడింగ్ చేశారు పోలీసులు. అక్కడ గుట్టుగా నడుపుతున్న వ్యభిచార గృహం నుంచి ఆరుగురు మైనర్లను కాపాడారు. ఈ కేసులో మొత్తం 73 మందిని అరెస్టు చేశారు. అనంతరం బెర్నార్డ్‌పై నాన్‌బెయిలబుల్ అరెస్టు వారెంట్ చేశారు. అప్పటికే అతడు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఉన్నట్లు గుర్తించి అక్కడి పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. బెర్నార్డ్‌ను మేఘాలయలోని తురకు తరలిచేందుకు ఏర్పాట్లు చేసినట్లు, ఆ రాష్ట్ర పోలీసులు అతడ్ని తీసుకువెళ్లేందుకు వస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
చదవండి: ఫామ్ హౌసులో గుట్టుగా బీజేపీ నేత సెక్స్ రాకెట్.. 23 మంది మహిళలు, 73 మంది..
Comments
Please login to add a commentAdd a comment