Bernard Marak
-
ఫామ్ హౌస్‌లో గుట్టుగా వ్యభిచార గృహం.. బీజేపీ నేత అరెస్టు
లక్నో: ఫామ్ హౌస్‌లో అక్రమంగా వ్యభిచార గృహం నడుపుతున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న మేఘాలయ బీజేపీ నాయకుడు బెర్నార్డ్ మరాక్ను ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులు హాపుడ్ జిల్లాలో అరెస్టు చేశారు. అతడ్ని మేఘాలయ పోలీసులకు అప్పగించనున్నట్లు హాపుడ్ ఎస్పీ వివేకానంద్ సింగ్ వెల్లడించారు. మేఘాలయ బీజేపీ ఉపాధ్యక్షుడుడైన బెర్నార్డ్‌కు చెందిన ఫామ్ హౌస్‌పై శనివారం రైడింగ్ చేశారు పోలీసులు. అక్కడ గుట్టుగా నడుపుతున్న వ్యభిచార గృహం నుంచి ఆరుగురు మైనర్లను కాపాడారు. ఈ కేసులో మొత్తం 73 మందిని అరెస్టు చేశారు. అనంతరం బెర్నార్డ్పై నాన్‌బెయిలబుల్ అరెస్టు వారెంట్ చేశారు. అప్పటికే అతడు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఉన్నట్లు గుర్తించి అక్కడి పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. బెర్నార్డ్‌ను మేఘాలయలోని తురకు తరలిచేందుకు ఏర్పాట్లు చేసినట్లు, ఆ రాష్ట్ర పోలీసులు అతడ్ని తీసుకువెళ్లేందుకు వస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. చదవండి: ఫామ్ హౌసులో గుట్టుగా బీజేపీ నేత సెక్స్ రాకెట్.. 23 మంది మహిళలు, 73 మంది.. -
'బీఫ్ తినడం మా సంస్కృతి, సంప్రదాయం'
షిల్లాంగ్: దేశ వ్యాప్తంగా బీఫ్ అమ్మకాలు, కబేళాల విషయంలో బీజేపీ తీవ్ర నిర్ణయాలతో ముందుకెళ్తుండగా మేఘాలయాలో మాత్రం సొంత పార్టీ నేతలే తిరుగుబావుట ఎగురవేస్తున్నారు. గోమాసం(బీఫ్) పై నిషేధాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ నేత ఇటీవల బెర్నార్డ్ మారక్ పార్టీని వీడగా.. తాజాగా మరో షాకిస్తూ మరో కీలకనేత బాచు మారక్ బీజేపీకి రాజీనామా చేశారు. అంటితో ఆగకుండా.. ఈ నెల 10న బెర్నార్డ్ మారక్ ఇచ్చే బీఫ్ పార్టీలో పాల్గొని తన నిరసన తెలియజేయనున్నట్లు చెప్పారు. నార్త్ గారో హిల్స్ జిల్లా అధ్యక్ష పదవిలో బాచు మారక్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. 'మా పద్ధతులు, ఆచారాలు, సంప్రదాయాలను బీజేపీ పట్టించుకోవడం లేదు. మా మనోభావాలు దెబ్బతిన్న కారణంగా నేను పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను. బీఫ్ (నకమ్ బిట్చి) మా సంప్రదాయ ఆహారమని' తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా 'బీర్ అండ్ బీఫ్' పార్టీ చేసుకోవాలని పిలుపునిస్తూ ఫేస్ బుక్ లో ఇటీవల చేసిన పోస్టుపై రాష్ట్ర బీజేపీ నేతలతో పాటు పార్టీ అధిష్టానం ఆయనపై గుర్రుగా ఉంది. పార్టీ అధిష్టానం ఆయన రాజీనామా లేఖను ఇంకా ఆమోదించలేదని సమాచారం. కబేళాలను కూడా చట్టబద్ధం చేస్తామంటూ మేఘాలయ బీజేపీ నేత బెర్నార్డ్ మారక్ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసిన అనంతరం పార్టీ నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు. '2018లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే బీఫ్‌పై నిషేధం ఉండదు. సాధారణ ధరలకే అందరికీ బీఫ్ అందేలా చూడటమే తమ విధి అని.. కబేళాలకు చట్టపరమైన గుర్తింపు ఇస్తామంటూ' బాచు మారక్ బీఫ్ నిషేధానికి వ్యతిరేకంగా ప్రచారం చేపట్టడం చర్చనీయాంశమైంది. మరోవైపు కేరళ, తమిళనాడు, కర్ణాటకలో బీఫ్ నిషేధంపై ఆగ్రహ జ్వాలలు రగులుతున్నాయి. -
బీఫ్‌పై బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు
షిల్లాంగ్: దేశ వ్యాప్తంగా బీఫ్ అమ్మకాలు, కబేళాల విషయంలో బీజేపీ చాలా సీరియస్‌గా ఉండగా అదే పార్టీకి చెందిన నేత మాత్రం బీఫ్‌కు అనుకూలంగా ప్రకటన చేశారు. తాము అధికారంలోకి వస్తే చౌక ధరలకే బీఫ్ లభించేలా ఏర్పాట్లు చేస్తామని, కబేళాలను కూడా చట్టబద్ధం చేస్తామంటూ మేఘాలయ బీజేపీ నేత బెర్నార్డ్ మారక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘మేఘాలయలో చాలామంది బీజేపీ నేతలు బీఫ్ తింటారు. మేఘాలయలాంటి రాష్ట్రంలో బీఫ్ బ్యాన్ అనే ప్రశ్నే తలెత్తదు. చారిత్రక నేపథ్యం ఏమిటో ఇక్కడి రాష్ట్ర బీజేపీ నేతలకు బాగా తెలుసు. రాజ్యాంగ పరంగా మా రాష్ట్రానికి వర్తించే అంశాలపై కూడా వారికి అవగాహన ఉంది. 2018లో బీజేపీ అధికారంలోకి వస్తే బీఫ్‌ను నిషేధించదు. దానికి బదులుగా దాని రేట్ల విషయంలో క్రమబద్దీకరణ చేస్తుంది. కబేళాలకు చట్టపరమైన గుర్తింపు ఇస్తాం. బీఫ్ అనేది ఇప్పుడు మా రాష్ట్రంలో బాగా ఖరీదైన పదార్ధంగా మారింది. దాని ధరలను నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైంది. అందుకే మేం రాగానే ధరలను నియంత్రిస్తాం’ అని చెప్పారు.