బీఫ్‌పై బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు | Beef to get cheaper in Meghalaya if BJP takes power | Sakshi
Sakshi News home page

బీఫ్‌పై బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు

Published Mon, May 29 2017 8:28 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

బీఫ్‌పై బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు - Sakshi

బీఫ్‌పై బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు

షిల్లాంగ్‌: దేశ వ్యాప్తంగా బీఫ్‌ అమ్మకాలు, కబేళాల విషయంలో బీజేపీ చాలా సీరియస్‌గా ఉండగా అదే పార్టీకి చెందిన నేత మాత్రం బీఫ్‌కు అనుకూలంగా ప్రకటన చేశారు. తాము అధికారంలోకి వస్తే చౌక ధరలకే బీఫ్‌ లభించేలా ఏర్పాట్లు చేస్తామని, కబేళాలను కూడా చట్టబద్ధం చేస్తామంటూ మేఘాలయ బీజేపీ నేత బెర్నార్డ్‌ మారక్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.

‘మేఘాలయలో చాలామంది బీజేపీ నేతలు బీఫ్‌ తింటారు. మేఘాలయలాంటి రాష్ట్రంలో బీఫ్‌ బ్యాన్‌ అనే ప్రశ్నే తలెత్తదు. చారిత్రక నేపథ్యం ఏమిటో ఇక్కడి రాష్ట్ర బీజేపీ నేతలకు బాగా తెలుసు. రాజ్యాంగ పరంగా మా రాష్ట్రానికి వర్తించే అంశాలపై కూడా వారికి అవగాహన ఉంది. 2018లో బీజేపీ అధికారంలోకి వస్తే బీఫ్‌ను నిషేధించదు. దానికి బదులుగా దాని రేట్ల విషయంలో క్రమబద్దీకరణ చేస్తుంది. కబేళాలకు చట్టపరమైన గుర్తింపు ఇస్తాం. బీఫ్‌ అనేది ఇప్పుడు మా రాష్ట్రంలో బాగా ఖరీదైన పదార్ధంగా మారింది. దాని ధరలను నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైంది. అందుకే మేం రాగానే ధరలను నియంత్రిస్తాం’ అని చెప్పారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement