brothel case
-
ఫామ్ హౌస్‌లో గుట్టుగా వ్యభిచార గృహం.. బీజేపీ నేత అరెస్టు
లక్నో: ఫామ్ హౌస్‌లో అక్రమంగా వ్యభిచార గృహం నడుపుతున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న మేఘాలయ బీజేపీ నాయకుడు బెర్నార్డ్ మరాక్ను ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులు హాపుడ్ జిల్లాలో అరెస్టు చేశారు. అతడ్ని మేఘాలయ పోలీసులకు అప్పగించనున్నట్లు హాపుడ్ ఎస్పీ వివేకానంద్ సింగ్ వెల్లడించారు. మేఘాలయ బీజేపీ ఉపాధ్యక్షుడుడైన బెర్నార్డ్‌కు చెందిన ఫామ్ హౌస్‌పై శనివారం రైడింగ్ చేశారు పోలీసులు. అక్కడ గుట్టుగా నడుపుతున్న వ్యభిచార గృహం నుంచి ఆరుగురు మైనర్లను కాపాడారు. ఈ కేసులో మొత్తం 73 మందిని అరెస్టు చేశారు. అనంతరం బెర్నార్డ్పై నాన్‌బెయిలబుల్ అరెస్టు వారెంట్ చేశారు. అప్పటికే అతడు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఉన్నట్లు గుర్తించి అక్కడి పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. బెర్నార్డ్‌ను మేఘాలయలోని తురకు తరలిచేందుకు ఏర్పాట్లు చేసినట్లు, ఆ రాష్ట్ర పోలీసులు అతడ్ని తీసుకువెళ్లేందుకు వస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. చదవండి: ఫామ్ హౌసులో గుట్టుగా బీజేపీ నేత సెక్స్ రాకెట్.. 23 మంది మహిళలు, 73 మంది.. -
స్పా ముసుగులో వ్యభిచారం.. గుట్టురట్టు
నాసిక్: వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు ఒక స్పాపై దాడి చేసి ఎనిమిది మంది మహిళలు సహా 13 మందిని అదుపులోకి తీసుకున్నారు. మహారాష్ట్ర నాసిక్‌లోని గంగాపూర్ రోడ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని హెచ్‌పీటీ కాలేజి రోడ్డులో స్పా పేరుతో వ్యభిచారం గృహాన్ని నడుపుతున్నారు. సెక్స్ రాకెట్ నడుస్తుందని పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. ఈ మేరకు పోలీసులు బుధవారం రాత్రి స్పాపై ఆకస్మికంగా దాడి చేశారు. స్పాలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న 8 మంది మహిళలతో పాటు ఐదుగురు పురుషులను అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం షరతులతో వారిని విడిచిపెట్టినట్లు పోలీస్‌స్టేషన్ ఇన్‌ఛార్జి మహేష్ దేవికర్ తెలిపారు. పరారీలో ఉన్న స్పా యజమాని పరేష్సురానాపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామన్నారు. గతంలో కూడా ఇదే స్పాపై దాడి చేశామని, అయినా యజమాని తీరులో మార్పురాలేదని వివరించారు. స్పా యజమాని కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టినట్లు మహేష్ దేవికర్ చెప్పారు. -
వ్యభిచారం కేసులో మోడల్ అరెస్టు
హైదరాబాద్: ఢిల్లీకి చెందిన ఓ మోడల్ వ్యభిచారం చేస్తుందన్న సమాచారం అందడంతో పశ్ఛిమ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు శుక్రవారం రాత్రి దాడులు నిర్వహించి మోడల్‌ను, ఆమె సహాయకున్ని అరెస్టు చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. ఢిల్లీకి చెందిన ఓ మోడల్(24) సోమాజిగూడాలోని ఓ హోటల్లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందింది. శుక్రవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు హోటల్‌పై దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా సదరు యువతితో పాటు, ఆమె సహాయకుడు కృష్ణానగర్‌కు చెందిన నర్సింహ్మలను అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.5 వేల నగదు, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పంజాగుట్ట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
వ్యభిచారం కేసులో పట్టబడ్డ టీవీ ఆర్టిస్ట్
హైదరాబాద్: హైదరాబాద్ ఎల్బీనగర్లోని ఓ వ్యభిచార గృహంపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఓ టీవీ ఆర్టిస్ట్ పాటు ముగ్గురు విటులు, ముగ్గురు యువతులను పోలీసులు అదుపులో తీసుకున్నారు. అరెస్టయిన టీవీ నటుడు పలు సీరియల్స్‌లో నటించినట్టు సమాచారం.