వ్యభిచారం కేసులో మోడల్ అరెస్టు
హైదరాబాద్: ఢిల్లీకి చెందిన ఓ మోడల్ వ్యభిచారం చేస్తుందన్న సమాచారం అందడంతో పశ్ఛిమ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు శుక్రవారం రాత్రి దాడులు నిర్వహించి మోడల్‌ను, ఆమె సహాయకున్ని అరెస్టు చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. ఢిల్లీకి చెందిన ఓ మోడల్(24) సోమాజిగూడాలోని ఓ హోటల్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందింది.
శుక్రవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు హోటల్‌పై దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా సదరు యువతితో పాటు, ఆమె సహాయకుడు కృష్ణానగర్‌కు చెందిన నర్సింహ్మలను అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.5 వేల నగదు, రెండు సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నారు. పంజాగుట్ట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.