స్పా ముసుగులో వ్యభిచారం.. గుట్టురట్టు | police raids on spa center and owner escapes | Sakshi
Sakshi News home page

స్పా ముసుగులో వ్యభిచారం.. గుట్టురట్టు

Published Thu, May 25 2017 5:50 PM | Last Updated on Tue, Sep 5 2017 11:59 AM

స్పా ముసుగులో వ్యభిచారం.. గుట్టురట్టు

స్పా ముసుగులో వ్యభిచారం.. గుట్టురట్టు

నాసిక్‌: వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు ఒక స్పాపై దాడి చేసి ఎనిమిది మంది మహిళలు సహా 13 మందిని అదుపులోకి తీసుకున్నారు. మహారాష్ట్ర నాసిక్‌లోని గంగాపూర్‌ రోడ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని హెచ్‌పీటీ కాలేజి రోడ్డులో స్పా పేరుతో వ్యభిచారం గృహాన్ని నడుపుతున్నారు. సెక్స్ రాకెట్‌ నడుస్తుందని పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. ఈ మేరకు పోలీసులు బుధవారం రాత్రి స్పాపై ఆకస్మికంగా దాడి చేశారు.

స్పాలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న 8 మంది మహిళలతో పాటు ఐదుగురు పురుషులను అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం షరతులతో వారిని విడిచిపెట్టినట్లు పోలీస్‌స్టేషన్‌ ఇన్‌ఛార్జి మహేష్‌ దేవికర్‌ తెలిపారు. పరారీలో ఉన్న స్పా యజమాని పరేష్‌సురానాపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామన్నారు. గతంలో కూడా ఇదే స్పాపై దాడి చేశామని, అయినా యజమాని తీరులో మార్పురాలేదని వివరించారు. స్పా యజమాని కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టినట్లు మహేష్‌ దేవికర్‌ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement