
స్పా సెంటర్‌లపై పోలీసుల దాడులు
లక్ష్మీపురం: గుంటూరు వెస్ట్ సబ్ డివిజన్ పరిధిలోని లక్ష్మీపురంలో ఉన్న ఇంటర్నేషనల్ స్పా సెంటర్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు అడిషనల్ ఎస్పీ సుప్రజ, అరండల్ పేట సీఐ వీరాస్వామి ప్రత్యేక బృందాలుగా శుక్రవారం దాడులు నిర్వహించారు.
నలుగురు థాయిలాండ్‌కు చెందిన వారితోపాటు ఏడుగురు మహిళలు, ఇద్దరు పురుషులను అదుపులో తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వారిని పట్టాభిపురం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
కేపీహెచ్‌బీ మెట్రో: పది మంది మహిళల అరెస్ట్
Comments
Please login to add a commentAdd a comment