ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, కేపీహెచ్‌బీకాలనీ: ఓ ఇంట్లో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్నారనే సమాచారంతో కేపీహెచ్‌బీ పోలీసులు ఆ ఇంటిపై ఆకస్మికంగా దాడి చేశారు. ముగ్గురిని రిమాండ్‌కు తరలించారు. ఇన్‌స్పెక్టర్ లక్ష్మీనారాయణ సమాచారం మేరకు... కేపీహెచ్‌బీకాలనీ మొదటి ఫేజ్‌లోని ఈడబ్ల్యూఎస్ 702 గృహంలో కొన్ని రోజులుగా కొందరు అమ్మాయిలను తీసుకొచ్చి వ్యభిచారం చేయిన్నారు.
సోమవారం రాత్రి ఆకస్మికంగా దాడిచేసిన పోలీసులు ముగ్గురు యువకులను, ఒక యువతిని అదుపులోకి తీసుకున్నారు. యువతిని రెస్క్యూ హోమ్‌కు తరలించి యువకులు సురదామసీను, రాయగిరి హరిప్రసాద్, సునీల్ జన్నాలపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. వ్యభిచార గృహ నిర్వాహకుడు మధు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment