రాజమండ్రి రూరల్ : ఓ గృహంలో యువతిని నిర్బంధించి వ్యభిచారం చేయాలని ఒత్తిడి చేస్తున్న నిర్వాహకురాలిని పోలీసులు ఆదివారం అర్ధరాత్రి అరెస్టు చేశారు. ఆ యువతికి విముక్తి కల్పించారు. పోలీసుల కథనం ప్రకారం.. లాలాచెరువు స్పిన్నింగుమిల్లు కాలనీ వినాయకుడిగుడి సమీపంలో ఎం.వసంతకుమారి వ్యభిచార గృహం నిర్వహిస్తోంది. వసంతకుమారితోపాటు కోర్లమ్మపేటకు చెందిన స్టేజ్‌షోల డ్యాన్సర్ దారపు దుర్గకూడా వ్యభిచార వృత్తి చేసేది. 15రోజుల క్రితం రాజమండ్రి మెయిన్‌రోడ్డులో దారపు దుర్గ కోరుకొండ మండలానికి చెందిన ఓ యువతిని పరిచయం చేసుకుంది.
ఆ యువతికి తెలిసిన వారింటికి వెళ్దామని చెప్పి ఆమెను వసంతకుమారి ఇంటికి తీసుకొచ్చింది. ఆ తర్వాత అక్కడి నుంచి దారపు దుర్గ వెళ్లిపోయింది. వసంతకుమారి ఆ యువతిని నిర్బంధించి వ్యభిచారం చేయాలని ఒత్తిడి చేయడం ప్రారంభించింది. ఒకరోజు ఇద్దరు విటులను తీసుకొచ్చి వారిని ఆ యువతి వద్దకు పంపింది. ఆ సమయంలో యువతి ఏడవడంతో వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో చుట్టుపక్కల వారికి వసంతకుమారి కదలికలపై అనుమానం వచ్చింది.
వారు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఆదివారం అర్ధరాత్రి వసంతకుమారి గృహంపై బొమ్మూరు ఇన్‌స్పెక్టర్ కనకారావు, సిబ్బందితో కలిసి దాడిచేశారు. యువతిని ఆమె చెర నుంచి విడిపించారు. వసంతకుమారిని అరెస్టుచేసి స్టేషన్‌కు తరలించారు. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఇన్‌స్పెక్టర్ కనకారావు వసంత కుమారిని సోమవారం రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించారు. ఈకేసులో దారపు దుర్గను అరెస్టు చేయాల్సి ఉందని, యువతిని వారి తల్లిదండ్రులకు అప్పగించామని కనకారావు తెలిపారు.
వ్యభిచార గృహంలో యువతి నిర్బంధం
Published Tue, Jul 7 2015 12:59 AM | Last Updated on Wed, Aug 1 2018 2:15 PM
Advertisement
Advertisement