గుట్టుచప్పుడు కాకుండా నడుస్తున్న ఓ వ్యభిచార కేంద్రంపై మలక్‌పేట పోలీసులు దాడులు నిర్వహించారు. సీఐ అల్లూరి గంగారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్‌కు చెందిన భగవతి రామ్‌చందానీ(55) సలీంనగర్‌లోని ఓ ఇంటిని అద్దెకు తీసుకుని రెండు నెలలుగా వ్యభిచార కేంద్రం నడుపుతోంది. ఫోన్ ద్వారా కస్లమర్లకు వల వేస్తుంటారు. ఈ క్రమంలో పక్కా సమాచారం అందుకున్న సీఐ తన సిబ్బందితో వ్యభిచార కేంద్రంపై దాడి చేశారు. రూ.4,000 స్వాధీనం చేసుకుని, నిర్వాహకురాలు భగవతి రామ్‌చందానీ, మరో మహిళ (35)ను అదుపులోకి తీసుకున్నారు. వారిని బుధవారం రిమాండ్‌కు తరలించారు.
వ్యభిచార కేంద్రంపై దాడి: ఇద్దరి అరెస్టు
Published Wed, Apr 13 2016 5:32 PM | Last Updated on Sun, Sep 3 2017 9:51 PM
Advertisement
Advertisement