
వ్యభిచారం గృహంపై దాడులు..
అరేహళ్లి లోని ఏజీఎస్‌లేఔట్‌లోని ఓ ఇంటిలో నిర్వహిస్తున్న వేశ్యావాటికపై సీసీబీ పోలీసులు బుధవారం దాడులు నిర్వహించారు.
బెంగళూరు(బనశంకరి) : అరేహళ్లి లోని ఏజీఎస్‌లేఔట్‌లోని ఓ ఇంటిలో నిర్వహిస్తున్న వేశ్యావాటికపై సీసీబీ పోలీసులు బుధవారం దాడులు నిర్వహించారు. ఏజీఎస్ లేఔట్ కు చెందిన శోభ, నరేశ్ అనే యువకుడిని అరెస్ట్ చేసి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ యువతిని పోలీసులు రక్షించారు. యువతులకు డబ్బు ఆశ చూపించి వేశ్యవాటిక నిర్వహిస్తున్నట్లు విచారణలో వెలుగుచూసిందని, నిందితులపై సుబ్రహ్మణ్యపుర పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.